Best Web Hosting Provider In India 2024
Crispy Dosa: బంగాళాదుంపలు, రవ్వ కలిపి క్రిస్పీ దోశెలు వేసి చూడండి, ఎంతో రుచిగా ఉంటాయి రెసిపీ ఇదిగో
Crispy Dosa: అల్పాహారం ఆరోగ్యకరమైనదే తినాలి. ఇక్కడ మేము ఉదయానే క్రిస్పీ దోశెలు ఎలా వేసుకోవాలో చెప్పాము. ఎప్పుడూ ఒకేలాంటి దోశెలు కాకుండా బంగాళాదుంపలు, రవ్వ కలిపి దోశెలు వేసి చూడండి. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. రెసిపీ ఇదిగో.
ఉదయం పూట చాలా తక్కువ సమయం ఉంటుంది. ఉన్న ఆ తక్కువ టైమ్ లోనే బ్రేక్ ఫాస్ట్ తో పాటూ పిల్లలకు లంచ్ బాక్స్ కూడా రెడీ చేయాలి. తక్కువ సమయంలో టేస్టీ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ మీకు ఇచ్చాము. పిల్లలకు బంగాళాదుంపలతో చేసే రెసిపీలు చాలా నచ్చుతాయి. వాటితో దోశెలు వేసి చూడండి… క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. దీన్ని తయారు చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. దీన్ని కొబ్బరి చట్నీతో తింటే రుచిగా ఉంటుంది. కాబట్టి బంగాళాదుంపలు, సెమోలినాతో తయారుచేసిన క్రిస్పీ దోశను నిమిషాల్లో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
బంగాళాదుంపలు రవ్వ దోశ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బంగాళాదుంపలు – రెండు
పచ్చిమిర్చి – రెండు
ఉప్పు – రుచికి సరిపడా
సెమోలినా – అరకప్పు
నీరు – రెండున్నర కప్పులు
బియ్యం పిండి – అరకప్పు
ఉల్లిపాయలు – ఒకటి
కొత్తిమీర తరుగు – ఒక స్పూను
జీలకర్ర – అరస్పూను
ఎండుమిర్చి – ఒకటి
బంగాళాదుంప రవ్వ దోశె రెసిపీ
- బంగాళాదుంపలను నీటిలో వేసి బాగా ఉడికించాలి. పొట్టు తీసి ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
- మిక్సీ జార్లో ఈ బంగాళాదుంప ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి , కొద్ది నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి.
- ఆ పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులో రవ్వు, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి.
- అందులోనే ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి.
- మీకు కావాలనుకుంటే సన్నగా తరిగిన క్యాప్సికం, టమోటాల తరుగు కూడా వేసుకోవచ్చు.
- ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేయండి.
- అందులో పిండితో దోశెల్లాగా వేసుకోవాలి. వీటిని పలుచగా వేసుకుంటే క్రిస్పీగా రవ్వ దోశెలు వస్తాయి.
8. నిమిషంలో దోశె కాలిపోతుంది. దీన్ని తీసి పక్కన పెట్టుకుంటే టేస్టీ బ్రేక్ ఫాస్ట్ రెడీ అయినట్టే.
ఈ దోశెలు ఎంతో రుచిగా ఉంటాయి. దీంతో టమోటా చట్నీ, కొబ్బరి చట్నీతో తింటే ఎంతో టేస్టీగా ఉంటాయ. తింటున్న కొద్దీ తినేలా ఉంటాయివి. ఒక్కసారి చేసుకుని చూడండి మీకెంతో నచ్చడం ఖాయం.
ఈ దోశలను వేడి వేడిగా ఉల్లిపాయ చట్నీ, టమోటా చట్నీ లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేయాలి.