Best Web Hosting Provider In India 2024
Brahmamudi January 22nd Episode: నందగోపాల్ మర్డర్ – పీకల్లోతు కష్టాల్లో రాజ్ కావ్య – ఊహించని దెబ్బ కొట్టిన అనామిక
Brahmamudi: బ్రహ్మముడి జనవరి 22 ఎపిసోడ్‌లో దుగ్గిరాల గెస్ట్ హౌజ్‌ను కావ్య పది కోట్లకు తాకట్టు పెట్టిన సంగతి బయటపెడుతుంది ధాన్యలక్ష్మి. కుటుంబ పరువు ప్రతిష్టలు పొగ్గొట్టిందని కావ్యపై ఫైర్ అవుతుంది. మరోవైపు నందగోపాల్‌ను కావ్య, రాజ్ కష్టపడి పట్టుకుంటారు.
Brahmamudi January 22nd Episode: రాజ్, కావ్య ఆఫీస్‌కు వెళ్లడానికి రెడీ అవుతుంటారు. రాజ్ ఆలస్యం చేస్తుండటంతో అతడిని కావ్య దగ్గరుండి రెడీ చేస్తుంది. కావ్య వెళ్లబోతుండగా ఆమె చీర కొంగు టేబుల్‌లో చిక్కుకుంటుంది. రాజ్ తన చీర కొంగు పట్టుకొని ఆపాడని కావ్య సిగ్గుపడిపోతుంది. టైమ్ లేదు…ఆఫీస్‌కు ఆలస్యమైంది. మీరు ఇలాంటి చిలిపి వేషాలు వేస్తే ఆఫీస్‌కు రావాలనే ఆలోచన పోతుంది.
ఆ తర్వాత మీరే బాధపడతారని సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ కావ్య అంటుంది. ఒక్కసారి వెనక్కి తిరగమని రాజ్ కోపంగా అంటాడు. కావ్య వెనక్కి తిరిగి చూస్తుంది. తన చీర కొంగు టేబుల్‌కు చిక్కుకొని ఉండటం చూసి తడబడిపోతుంది. మీరు పట్టుకొని ఉన్నారని అనుకున్నానని అంటుంది. నాకు అంత ఇంట్రెస్ట్, మూడు రెండు లేవని రాజ్ అంటాడు. ఎందుకు అని కావ్య రొమాంటిక్‌గా అడుగుతుంది.
నందగోపాల్ ఆచూకీ…
అప్పడే ఫోన్‌రావడంతో వారి రొమాన్స్‌కు బ్రేకులు పడతాడు. ఎస్ఐ ఫోన్ చేసి నందగోపాల్ ఆచూకీ తెలిసిందని అంటాడు. అతడిని పట్టుకోవడానికి రాజ్, కావ్య హడావిడిగా బయలుదేరుతారు. వారిని హాల్‌లో ధాన్యలక్ష్మి అడ్డుకుంటుంది. ఏదన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందామని, అర్జెంట్ పని ఉందని కావ్య, రాజ్ అంటారు. కానీ తనకు సమాధానం చెప్పిన తర్వాతే ఇక్కడి నుంచి ఇద్దరు కదలాలని ధాన్యలక్ష్మి పట్టుపడుతుంది.
గెస్ట్ హౌజ్ తాకట్టు…
అనామిక పంపించిన గెస్ట్ హౌజ్ తాకట్టు పేపర్స్‌ను కుటుంబసభ్యులకు చూపిస్తుంది. కావ్య సమర్థురాలని, వంద ఏళ్ల చరిత్ర ఉన్న కంపెనీని ఒంటి చేతితో నడిపే సత్తా ఉందని సీతారామయ్య ఆస్తి మొత్తం కావ్య చేతిలో పెడితే ఆమె ఏం చేసింది? పది కోట్ల కోసం దుగ్గిరాల ఇంటి గెస్ట్ హౌజ్‌ను తాకట్టు పెట్టి ఇంటి పరువు మర్యాదలు తీసింది అని ధాన్యలక్ష్మి రచ్చ చేస్తుంది.
ఏ పని పాట లేదు…
గెస్ట్ హౌజ్ తాకట్టు విషయం బయటపడటంతో కావ్య, రాజ్ షాకవుతారు. ఏంటి అలా తెల్లబోయి చూస్తున్నారు…ఈ రహస్యం మాకు ఎలా తెలిసిందనా? అని రుద్రాణి ఫిట్టింగ్ పెడుతుంది. రాహుల్‌కు ఏ పని పాట లేదని, ఇలాంటి రహస్యల్ని వెతికితీసి ఇంట్లో చిచ్చు పెట్టకపోతే మీ ఇద్దరికి మనశ్శాంతి ఉండదని రుద్రాణి, రాహుల్‌పై స్వప్న సెటైర్లు వేస్తుంది. మంచి మర్యాద లేని కుటుంబం కాబట్టే కావ్య ఇలా తయారైందని, ఏ అవసరం వచ్చిందని గెస్ట్ హౌజ్ తాకట్టు పెట్టిందని కావ్యపై ధాన్యలక్ష్మి విరుచుకుపడుతుంది.
సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు…
నాకు చెప్పే కావ్య గెస్ట్ హౌజ్‌ను తాకట్టు పెట్టిందని, తనకు తెలియకుండా కావ్య ఏ నిర్ణయం తీసుకోదని రాజ్ అంటాడు. ఇంకేం ఈ సమస్య ఇంతటితో ఆయిపోయిందని తాకట్టు విషయాన్ని తేలిగ్గా తీసుకుంటుంది ఇందిరాదేవి. పిల్లలకు బాధ్యత అప్పగించిన తర్వాత ప్రతి విషయంలో తలదూర్చడం సరికాదని ఇందిరాదేవి కుటుంబసభ్యులకు ఇందిరాదేవి క్లాస్ ఇస్తుంది. అసలు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, ఏం చేస్తావని రుద్రాణిపై ఫైర్ అవుతుంది ఇందిరాదేవి.
కావ్య ఆన్సర్ చెప్పనివ్వదు…
కానీ నాకు, నా భర్తకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని ధాన్యలక్ష్మి అంటుంది. గెస్ట్ హౌజ్ తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని కొడుకును సుభాష్ నిలదీస్తాడు. కానీ కావ్య, రాజ్ మాత్రం ఆన్సర్ ఇవ్వకుండా సైలెంట్‌గా ఉంటారు. ఈ ప్రశ్నలకు రాజ్ సమాధానం చెప్పాలని అనుకున్నా…కావ్య సమాధానం చెప్పనివ్వదు. అసలు ఈ ఇంటిని, మన కంపెనీని వీళ్లు ఏం చేయదలుచుకున్నారో, కుటుంబసభ్యులతో మాటలు నిందలు పడదలుచుకున్నారో అసలు చెప్పరు అని అపర్ణ కోపంగా ఉంటుంది.
తెలివిగా సమాధానం…
తెలివిగా మాట్లాడి వాళ్లను పంపించేయాలని చూస్తున్నావా వదిన అంటూ అపర్ణ మాటలను దెప్పిపొడుస్తుంది రుద్రాణి. పళ్లు రాళుతాయ్ అని స్వప్న అంటుంది. అది నా మాట కాదు అపర్ణ ఆంటీ ఆమాట రుద్రాణిపై సెటైర్ వేస్తుంది.
డాక్యుమెంట్స్ మీ చేతికి ఎలా వచ్చాయి?
అన్ని ప్రశ్నలకు సాయంత్రం జవాబు చెబుతామని, ప్రస్తుతం ఇంపార్టెంట్ పని ఉందని రాజ్ అంటాడు. అయినా వినకుండా సమాధానం కావాల్సిందేనని రుద్రాణి పట్టుపడుతుంది. తల్లీకొడుకులు తిని కూర్చోలేక రోజుకో గొడవ తెస్తూనే ఉంటారని కావ్య అంటుంది. రాజ్‌ను తీసుకొని బయటకు వెళుతుంది. రహస్య బయటపడగానే రాజ్, కావ్య జారు కుంటున్నారని రుద్రాణి అంటుంది. అ
అసలు ఈ డాక్యుమెంట్స్ మీ చేతికి ఎలా వచ్చాయి? ఈ ఇంటి తిండి తింటూ రాజ్, కావ్య వెనుక గోతులు తవ్వే ఆ గుంట నక్కలు ఎవరో తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉందని సుభాష్‌తో స్వప్న అంటుంది. స్వప్న మాటలతో రుద్రాణి, రాహుల్ మెల్లగా అక్కడి నుంచి జారు కుంటారు.
కావ్య టెన్షన్…
నందగోపాల్‌ను పట్టుకోవడానికి రాజ్, కావ్య బయలుదేరుతారు. కావ్య చాలా టెన్షన్ పడుతూ కనిపిస్తుంది. ఏమైందని భార్యను అడుగుతాడు రాజ్. సాయంత్రం కుటుంబసభ్యులకు ఏమని సమాధానం చెబుతారని భర్తను అడుగుతుంది. పెళ్లికి ముందు అసలు టెన్షన్ అంటే ఏంటో తెలియదు. పెళ్లి తర్వాత ఇన్ని కష్టాలు ఉంటాయని, కోట్లతో డీల్ చేయాల్సివస్తుందని అసలు ఊహించలేదు. పెళ్లి తర్వాత ఇంటి పట్టునే ఉంటూ భర్తకు సేవ చేస్తూ సంతోషంగా జీవితాన్ని గడిపేయాలని ఎన్నో కలలు కన్నానని కావ్య అంటుంది.
మాటలు పడలేక…
కానీ ఇక్కడికి వచ్చాకా లేనిపోని సమస్యలన్నీ నా నెత్తిన వేసుకొని నిజాలు దాచలేక, అబద్దాలు చెప్పలేక , నిందలు మోయలేక, మాటలు పడలేక ఇబ్బందులు పడాల్సివస్తుందని కావ్య అంటుంది. నంద గోపాల్‌ను పట్టుకుంటే సమస్యలు మొత్తం సాల్వ్ అవుతాయని, తాకట్టు పెట్టిన ఆస్తులన్నీ విడిపించవచ్చని రాజ్ అంటాడు. ఇంట్లో రూల్స్ ఎత్తేసి జరిగింది చెప్పి క్షమాపణలు కోరితే అందరూ మనల్ని అర్థం చేసుకుంటారని రాజ్ అంటాడు.
రాజ్ బిల్డప్‌లు…
ఇదంతా నంద మన చేతికి చిక్కి…డబ్బు మనకు ఇచ్చినప్పడు జరుగుతుంది కదా…ఒకవేళ అతడు పారిపోతే ఏం చేస్తారని కావ్య అంటుంది. అపశకునం మాటలు వద్దని, పాజిటివ్‌గా ఆలోచించుదామని రాజ్ అంటాడు. ఇది వరకు ఓ సారి నందగోపాల్ పారిపోయాడు కదా అని కావ్య అంటుంది. ఈ సారి మాత్రం వాడిని ఎ లాగైనా పట్టుకొని తీరుతానని రాజ్ గట్టిగా చెబుతాడు. కావ్య ఏదో మాట్లాడబోతుందగా ఆపేస్తాడు. ఏం జరుగుతుందో చూడు అంటూ బిల్డప్‌లు ఇస్తాడు.
రాజ్ కోపం…
ఎస్ఐ పంపించిన లొకేషన్‌కు కొంత దూరంలో కారు ఆపుతాడు రాజ్. ఏంటి ఇక్కడ కారు ఆపారు. పెట్రోల్ అయిపోయిందా అని రాజ్‌ను అడుగుతుంది కావ్య. మనం వచ్చింది చుట్టాల ఇంటికి కాదని, ఇంటి ముందు కారు ఆపితే నందగోపాల్‌కు తెలిసిపోతుందని, వాడు పారిపోతాడని రాజ్ అంటాడు. కొద్ది సేపు నీ నోరును సెలైంట్‌లో పెట్టమని, లేదంటే ప్లాస్టర్ వేస్తానని రాజ్ కోపంగా బదులిస్తాడు.
కోటీశ్వరుడిని అయిపోతా…
మందేస్తూ చిల్ అవుతుంటాడు నందగోపాల్. ఇంకో మూడు నెలల్లో తాను కోటీశ్వరుడిని అయిపోవడం ఖాయమని ఆనందపడుతుంటాడు.అప్పటివరకు నువ్వు బతికి ఉండాలిగా అంటూ అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చిన రాజ్ అంటాడు. నన్ను జిడ్డులా ఎందుకు వెంటాడుతున్నావని, నా దగ్గర డబ్బు లేదని రాజ్‌కు బదులిస్తాడు నంద. నీ దగ్గర నుంచి డబ్బులు ఎలా రాబట్టాలో నాకు తెలుసునని నంద మనుషులతో ఫైట్ చేయడానికి రాజ్ సిద్ధమవుతాడు.రాజ్‌ను కొట్టడానికి వచ్చిన నంద మనుషులతో తన మాయ మాటలతో బురడీ కొట్టిస్తుంది కావ్య. నందను పట్టుకొని పోలీసులకు అప్పగిస్తారు రాజ్, కావ్య.
తమ కష్టాలు తీరిపోయానని, ఇంట్లో వాళ్లకు చెప్పడానికి సరైన సమాధానం దొరికిందని ఆనందపడుతుంటారు. పోలీసులు పట్టుకెళుతున్న నందను ఓ వ్యక్తి వచ్చి గన్‌తో షూట్ చేస్తాడు. నంద స్పాట్‌లోనే చనిపోవడంతో రాజ్, కావ్య షాకవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది.