Best Web Hosting Provider In India 2024
Road Accident : కూరగాయల లోడుతో వెళ్తున్న ట్రక్కు బోల్తా.. 9 మంది మృతి, పలువురికి గాయాలు
Karnataka Road Accident : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూరగాయల లోడుతో వెళ్తున్న ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. మరోవైపు రాయచూరులో జరిగిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
ఉత్తర కన్నడ జిల్లా యాల్లాపూర్ తాలుకాలోని గుల్లాపురలో కూరగాయల లోడుతో వెళ్తు్న్న ట్రక్కు బోల్తా పడింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. దట్టమైన పొగమంచు కారణంగా రహదారి సరిగా కనిపంచక ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ట్రక్కులో కూరగాయలతో 20 మందికిపైగా ప్రయాణిస్తున్నారు.
జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. కూరగాయలతో నిండిన ట్రక్కులో 20 మందికి పైగా కూర్చున్నారు. సవనూరు నుంచి కుమటకు బయలుదేరింది వాహనం. జాతీయ రహదారిపై ఉదయం పొగమంచు కమ్ముకుంది. రోడ్డు సరిగా కనిపించకపోవడంతో ట్రక్కు బోల్తా పడింది. మృతులంతా సవనూరుకు చెందిన వారని చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని హుబ్లీలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కూరగాయల కుప్పల కింద కూరుకుపోయిన మృతదేహాలను బయటకు తీశారు.
రాయచూర్‌లో నలుగురు మృతి
రాయచూర్‌లో రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఇందులో ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. సిందనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగిది. మరో పదిమందికి గాయలు అయ్యాయి. వీరంతా మంత్రాలయ సంస్కృత విద్యాలయ విద్యార్థులుగా గుర్తించారు.
నరహరి ఆలయంలో ప్రార్థనలు చేసేందుకు హంపికి తీర్థయాత్ర చేస్తున్నారు. సిందనూరులోని అరగినమర క్యాంపు సమీపంలో ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారిలో విద్యార్థులు ఆర్యవందన్ (18), సుశీంద్ర (22), అభిలాష్(20)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ శివ(24) కూడా ప్రాణాలు కోల్పోయాడు.
Best Web Hosting Provider In India 2024
Source link