Illu Illalu Pillalu Serial: ధీర‌జ్ ప్రాణాల‌కు ప్ర‌మాదం – రౌడీల‌తో విశ్వ డీల్ – ప్రేమ చేత‌ వ్ర‌తం చేయించిన వేదావ‌తి

Best Web Hosting Provider In India 2024

Illu Illalu Pillalu Serial: ధీర‌జ్ ప్రాణాల‌కు ప్ర‌మాదం – రౌడీల‌తో విశ్వ డీల్ – ప్రేమ చేత‌ వ్ర‌తం చేయించిన వేదావ‌తి

Nelki Naresh Kumar HT Telugu
Jan 22, 2025 09:18 AM IST

Illu Illalu Pillalu Serial: ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు జ‌న‌వ‌రి 22 ఎపిసోడ్‌లో ప్రేమ‌ను లేపుకుపోయి పెళ్లిచేసుకున్న ధీర‌జ్‌పై ప‌గ‌తో ర‌గిలిపోతాడు విశ్వ‌. సంక్రాంతి సంబ‌రాల్లో ధీర‌జ్‌ను చంపేందుకు స్కెచ్ వేస్తాడు. గుడిలో కుటుంబ‌స‌భ్యుల పేరున అర్చ‌న చేయించిన రామ‌రాజు…ధీర‌జ్‌, ప్రేమ పేర్లు మాత్రం చెప్ప‌డు.

ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు
ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు

Illu Illalu Pillalu Serial: సంక్రాంతి వేడుక‌ల‌కు రామ‌రాజు కుటుంబాన్ని ఆహ్వానిస్తారు ఊరి పెద్ద‌లు. ధీర‌జ్ పెళ్లి కార‌ణంగా సంక్రాంతి వేడుల‌కు వెళ్ల‌డానికి రామ‌రాజు ఆలోచిస్తుంటాడు. సంక్రాంతి సంబ‌రాల‌కు వ‌స్తామ‌ని రామ‌రాజు త‌ర‌ఫున చందు ఊరి పెద్ద‌ల‌కు మాటిస్తాడు. ధీర‌జ్ తెలివిగా చందు చేత ఆ మాట‌ చెప్పించాడ‌ని రామ‌రాజు క‌నిపెడ‌తాడు. చిన్న కొడుకుపై ఫైర్ అవుతాడు.

yearly horoscope entry point

గౌర‌వాన్ని త‌గ‌ల‌బెట్టారు…

ధీర‌జ్‌, సాగ‌ర్ పెళ్లిళ్లు చేసుకొని త‌న గౌర‌వాన్ని త‌గ‌ల‌బెట్టార‌ని కొడుకుల‌పై రామ‌రాజు ఫైర్ అవుతాడు. మీకు వ‌చ్చిన పేరు ప్ర‌తిష్ట‌లు, గౌర‌వం అన్ని మా వ‌ల్ల వ‌చ్చిన‌వి కావ‌ని, మీరే క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న‌వ‌ని తండ్రికి అర్థ‌మ‌య్యేలా వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తాడు ధీర‌జ్‌.

అలాంట‌ప్పుడు మీ పిల్ల‌లు త‌ప్పు చేస్తే వాటి విలువ ఎందుకు త‌గ్గుతుంది. వాటికి మ‌చ్చ ఎలా ఏర్ప‌డుతుంద‌ని ధీర‌జ్ అంటాడు. మీ గౌర‌వం ప‌ర్వ‌తం లాంటిద‌ని, ఎవ‌రి గురించో ఆలోచించి మిమ్మ‌ల్ని మీరు త‌గ్గించుకోవ‌ద్ద‌ని తండ్రికి స‌ర్ధిచెబుతాడు ధీర‌జ్‌.

పెద్ద‌రికానికి గౌర‌వం…

కొడుకు మాట‌లు క‌రెక్ట్ అని వేదావ‌తి అంటుంది. సాగ‌ర్‌, ధీర‌జ్ పెళ్లిళ్ల గురించి తెలిసి కూడా ఊరి పెద్ద‌లు సంక్రాంతి సంబ‌రాల‌ను మీ చేతుల మీదుగా జ‌రిపించాల‌ని అనుకుంటున్నారంటే మీకు, మీ పెద్ద‌రికానికి గౌర‌వం ఇచ్చిన‌ట్లే క‌దా అని వేదావ‌తి అంటుంది.

కుటుంబ‌స‌భ్యులంద‌రూ బ‌ల‌వంతం చేయ‌డంతో సంక్రాంతి సంబ‌రాల‌కు వెళ్ల‌డానికి రామ‌రాజు ఒప్పుకుంటాడు. తండ్రి మాట‌ల‌తో కొడుకులు, కూతుళ్లు సంబ‌ర‌ప‌డ‌తారు. ప్రేమ మాత్రం కోపంగా ఉంటుంది.

విశ్వ రివేంజ్‌…

ప్రేమ‌ను పెళ్లి చేసుకొని త‌మ కుటుంబాన్ని అవ‌మానించిన ధీర‌జ్‌పై రివేంజ్ తీర్చుకోవ‌డానికి క‌న్నింగ్ ప్లాన్ వేస్తాడు విశ్వ‌. ధీర‌జ్‌ను చంపేందుకు రౌడీల‌తో డీల్ కుదుర్చుకుంటాడు. త‌న చెల్లెలికి మాయ మాట‌లు చెప్పి మోసం చేసి లేపుకుపోయి ధీర‌జ్‌ పెళ్లి చేసుకున్నాడ‌ని, అత‌డి కుటుంబంతో త‌మ‌కు పాతికేళ్ల ప‌గ ఉంద‌ని రౌడీల‌తో చెబుతాడు విశ్వ‌.

క‌న్న కూతురు లేచిపోయి పెళ్లి చేసుకుంద‌న్న బాధ త‌ట్టుకోలేక నాన్న ఆత్మ‌హ‌త్య చేసుకోబోయాడ‌ని, మేన‌కోడ‌లు గురించి త‌ల‌చుకుంటూ అత్త గుండెలు ప‌గిలేలా ఏడుస్తుంద‌ని విశ్వ అంటాడు. పాతికేళ్ల క్రితం కంటే ఇప్పుడు ఎక్కువ బాధ‌ను అనుభ‌విస్తున్నామ‌ని రౌడీల‌తో చెబుతాడు. ధీర‌జ్ చ‌నిపోతేనే తిరిగి చెల్లి మా ఇంటికి వ‌స్తుంద‌ని చెబుతాడు. సంక్రాంతి సంబ‌రాలు ముగిసేలోపు ధీర‌జ్ జీవితం కూడా ముగిసిపోవాల‌ని రౌడీల‌కు చెబుతాడు.

ఎదురుప‌డ్డ రెండు కుటుంబాలు…

సంక్రాంతి సంబ‌రాల కోసం రామ‌రాజు కుటుంబం మొత్తం ట్రాక్ట‌ర్‌లో బ‌య‌లుదేరుతారు. ధీర‌జ్‌ను చంపేందుకు విశ్వ‌తో డీల్ కుద‌ర్చుకున్న రౌడీలు ఎదురుచూస్తుంటారు. గుడికి వ‌చ్చిన రామ‌రాజు, భ‌ద్రావ‌తి కుటుంబాల‌కు ఘ‌నంగా ఊరి పెద్ద‌లు స్వాగ‌తం ప‌లుకుతారు.

రామ‌రాజు ఫ్యామిలీలో ఒక‌రిగా గుడికి వ‌చ్చిన ప్రేమ‌ను చూసి సేనాప‌తి ఎమోష‌న‌ల్ అవుతాడు కూతురిని ప‌ల‌క‌రించ‌బోతాడు. కానీ రామ‌రాజుపై ఉన్న ప‌గ గుర్తొచ్చి ఆగిపోతాడు. త‌మ ఇంటి సంతోషాన్ని దూరం చేశాడ‌ని రామ‌రాజుపై కోపంతో ర‌గిలిపోతాడు.

ప్రేమ‌ను పంచితే…ద్రోహం చేశాం…

మీరంద‌రూ నాకు జ‌న్మ‌లో రుణం తీర్చుకోలేనంత‌గా ప్రేమ‌ను పంచార‌ని, కానీ జ‌న్మ‌లో మ‌ర్చిపోలేని ద్రోహం మీకు చేశాన‌ని ప్రేమ ఎమోష‌న‌ల్ అవుతాడు. తండ్రికి గుండెల్లోని బాధ‌ను మొత్తం చెప్పుకోవాల‌ని ఉంద‌ని, అంద‌రితో ఆనందంగా మాట్లాడాల‌ని మ‌న‌సు ఆరాట‌ప‌డుతుంద‌ని అనుకుంటుంది. కానీ మిమ్మ‌ల్ని మోసం చేశాన‌నే బాధ భ‌రించ‌లేనంత న‌ర‌కంగా ఉంద‌ని అనుకుంటుంది.

క‌న్న కూతురు క‌ళ్లెదుట ఉన్న మాట్లాడ‌లేని శిక్ష వేస్తావ‌ని క‌ల‌లో కూడా ఊహించ‌లేద‌ని ప్రేమ‌ను ఉద్దేశించి సేనాప‌తి అనుకుంటాడు.

ప‌గ‌లు, ప్ర‌తీకారాలు…

రామ‌రాజు, భ‌ద్రావ‌తి ఫ్యామిలీ క‌లిసి గుడికి రావ‌డం చూసి ఊరికి చెందిన లింగం అనే వ్య‌క్తి సంబ‌ర‌ప‌డిపోతాడు. రెండు కుటుంబాలు ఒక్క‌ట‌వ్వ‌డం ఆనందంగా ఉంద‌ని అంటాడు. రామ‌రాజు చిన్న కొడుకుకు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి మీ రెండు కుటుంబాల మ‌ధ్య ఉన్న ప‌గ‌లు, ప్ర‌తీకారాల‌ను ప‌క్క‌న‌పెట్ట‌ర‌ట‌గా అని భ‌ద్రావ‌తితో అంటాడు. లింగం మాట‌లు స‌హించ‌లేని భ‌ద్రావ‌తి అత‌డిపై చెంప‌పై గ‌ట్టిగా ఒక్క‌టి పీకుతాడు. రెండు కుటుంబాలు క‌ల‌వ‌డం అసాధ్య‌మ‌ని చెప్పి గుడి లోప‌లికి వెళుతుంది.

క‌న్ఫ్యూజ‌న్…

సేనాప‌తి అమ్మాయి మీ ఇంట్లో ఉంది. మీ రెండు కుటుంబాలు మాత్రం క‌ల‌వ‌డం లేద‌ని భ‌ద్రావ‌తి అంటుంది. అస‌లు ఈ క‌న్ఫ్యూజ‌న్ ఏమిటో అర్థం కావ‌డం లేద‌ని రామ‌రాజును అడుగుతాడు లింగం. ఈ వివ‌రాలు అన్ని నీకెందుకు అని లింగాన్ని రామ‌రాజు ఒక్క‌టి పీకుతాడు.

ధీర‌జ్‌, ప్రేమ లేచిపోయి పెళ్లి చేసుకున్నార‌ని తెలిసి లింగం భ‌య‌ప‌డ‌తాడు. జాత‌ర‌లో ఎలాంటి ర‌క్త‌పాతం జ‌రుగుతుందోన‌ని అనుకుంటాడు.

కుటుంబ‌స‌భ్యుల పేరిట అర్చ‌న‌…

రామ‌రాజు ఫ్యామిలీపై పూజారి ప్ర‌శంస‌లు కురిపిస్తాడు. పిల్ల‌లు అంటే మీ వాళ్ల‌లా ఉండాల‌ని అంటాడు. మీ మాట జ‌వ‌దాట‌ర‌ని రామ‌రాజును పొగ‌డుతాడు పూజారి. ఇద్ద‌రు కొడుకులు త‌న ప‌రువు, మ‌ర్యాద‌లు త‌గిలేశార‌ని రామ‌రాజు మ‌న‌సులో కోప్ప‌డుతాడు. కుటుంబ‌స‌భ్యులంద‌రి పేరిట అర్చ‌న చేయ‌మ‌ని పంతులుతో అంటాడు రామ‌రాజు. కుటుంబ‌స‌భ్యులంద‌రి పేరు చెబుతాడు. త‌మ పేర్ల‌ను చెప్ప‌డంతో సాగ‌ర్‌, న‌ర్మ‌ద ఆనంద‌ప‌డ‌తారు.

కానీ ధీర‌జ్‌, ప్రేమ పేర్లు మాత్రం చెప్ప‌డు. వేదావ‌తి వారి పేర్లు పూజారికి చెబుతుంది. అంద‌రి పేర్లు చెప్పి మీరు క‌ష్ట‌ప‌డుతున్నార‌ని, రెండు పేర్లు చెప్పి మీకు నేను సాయం చేశాన‌ని క‌వ‌ర్ చేస్తుంది వేదావ‌తి.

ఏ త‌ప్పు చేయ‌లేదు…

మీరు త‌ల‌దించుకునేలా, మీ ప‌రువు తీసేలా ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని, ఆడ‌పిల్ల జీవితాన్ని కాపాడ‌టం కోసం త‌న మెడ‌లో తాలిక‌ట్టాల్సివ‌చ్చింద‌ని ధీర‌జ్ అనుకుంటాడు. తండ్రి త‌న‌పై చూపిస్తున్న ద్వేషాన్ని భ‌రించ‌లేక‌పోతాడు. ఆ ద్వేషం ప్రేమ‌గా మారే రోజు రావాల‌ని దేవుడిని వేడుకుంటాడు.

గుడిలో వ్ర‌తం…

కొత్త దంపుతులైన ధీర‌జ్‌, ప్రేమ‌ల‌తో గుడిలో వ్ర‌తం చేయిస్తుంది వేదావ‌తి. ఆ సీన్ చూసి భ‌ద్రావ‌తి, సేనాప‌తి కోపంతో ర‌గిలిపోతారు. మ‌రోవైపు ధీర‌జ్‌ను చంపేందుకు విశ్వ మ‌నుషులు సిద్ధంగా ఉంటారు. అక్క‌డితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు సీరియ‌ల్ ముగిసింది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024