Best Web Hosting Provider In India 2024
Sankranthiki Vasthunam Day 8 Collections: కొనసాగిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ జోష్.. ఎనిమిది రోజుల్లో ఎంతంటే..
Sankranthiki Vasthunam Day 8 Collections: సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద జోష్ కంటిన్యూ చేస్తోంది. రెండో వారంలోనూ అదరగొడుతోంది. ఈ చిత్రానికి 8 రోజుల్లో ఎంత కలెక్షన్లు వచ్చాయంటే..
సంక్రాంతికి వస్తున్నాం సినిమా సెన్సేషనల్ రన్ సాధిస్తోంది. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ఈ కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆరంభం నుంచి అంచనాలకు మించి కలెక్షన్లను రాబడుతోంది. అనిల్ రావివూడి దర్శకత్వం వహంచిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదలైంది. మౌత్ టాక్ బాగా రావడంతో భారీ కలెక్షన్లను సాధిస్తోంది. వారంలోనే రూ.200కోట్ల కలెక్షన్ల మార్క్ దాటి సంచలనం సృష్టించింది. ఎనిమిదో రోజు కూడా ఈ చిత్రానికి స్టడీగా కలెక్షన్లు వచ్చాయి.
8 రోజుల కలెక్షన్లు ఇవే
సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఎనిమిదో రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.218 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రం ఏడు రోజుల్లో రూ.203కోట్లను సాధించింది. హీరో వెంకటేశ్ తొలిసారి రూ.200కోట్ల క్లబ్‍లో అడుగుపెట్టారు. ఈ చిత్రానికి ఎనిమిదో రోజు సుమారు రూ.15కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీంతో వసూళ్ల లెక్క రూ.218 కోట్లకు చేరింది.
రూ.250కోట్ల మార్క్ సాధ్యమే!
సంక్రాంతికి వస్తున్నాం సినిమా రూ.250కోట్లకు చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రిపబ్లిక్ డే కూడా ఉన్న ఈ వీకెండ్‍లో వసూళ్లు పుంజుకునే ఛాన్స్ ఉంది. సంక్రాంతికి వచ్చిన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ ప్రస్తుతం పెద్దగా పర్ఫార్మ్ చేయడం లేదు. వాటితో పోలిస్తే సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి థియేటర్లలో ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉంటోంది. దీంతో ఈ చిత్రం రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ అధిగమించే ఛాన్స్ ఎక్కువే.
సంక్రాంతి పండుగ, వీకెండ్ అయ్యాక కూడా సంక్రాంతికి వస్తున్నాం చిత్రం జోష్ కొనసాగించింది. వీక్ డేస్‍లోనూ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా రావటంతో మంచి కలెక్షన్లు దక్కించుకుంది. వారంలోనే రూ.200కోట్లు మార్క్ దాటింది. రెండో వారం తొలి రోజు కూడా జోష్ చూపించింది. మోస్తరు కలెక్షన్లతో రూపొంది.. అంచనాలకు మించి భారీ కలెక్షన్లు రాబడుతూ సినీ జనాలను ఈ చిత్రం ఆశ్చర్యపరుస్తోంది.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో వెంకటేశ్ సరసన ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఇద్దరు భామల మధ్య నలిగిపోయే హీరోగా వెంకీ మరోసారి పర్ఫార్మెన్స్ అదరగొట్టారు. ఈ చిత్రాన్ని కామెడీతో పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. పండుగకు ఇది బాగా వర్కౌట్ అయింది. ఈ చిత్రాన్ని దిల్‍రాజు, శిరీష్ ప్రొడ్యూజ్ చేయగా.. భీమ్స్ సెసిరోలియో మ్యూజిక్ ఇచ్చారు.
సంబంధిత కథనం