Best Web Hosting Provider In India 2024
Rashmika on Wheelchair: అయ్యో రష్మిక.. కుంటుతూ వెళ్లి వీల్‍చైర్‌లో.. వీడియో వైరల్
Rashmika Mandanna on Wheelchair: కాలి గాయంతో బాధపడుతున్న హీరోయిన్ రష్మిక మందన్నా తాజాగా ఎయిర్‌పోర్ట్ వద్ద కనిపించారు. కుంటుతూ.. వీల్‍చైర్‌లోకి వెళ్లారు. ఆ వివరాలు ఇవే..
స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వరుస బ్లాక్‍బస్టర్లు సాధించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్‍గా నటించిన పుష్ప 2 చిత్రం ఇటీవల భారీ బ్లాక్‍బస్టర్ అయింది. ప్రస్తుతం రష్మిక లైనప్‍లో చాలా చిత్రాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఇటీవల రష్మిక కాలికి గాయమైంది. జిమ్ చేస్తుండగా ఇలా జరిగినట్టు ఆమె తెలిపారు. ఇప్పుడు రష్మిక మందన్నా తాజాగా ఓ ఎయిర్‌పోర్ట్ దగ్గర కనిపించారు. గాయం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు.
వీల్‍చైర్‌లో కూర్చునేందుకు కుంటూతూ..
ఎయిర్‌పోర్టు దగ్గర కారు దిగిన రష్మిక ఆ తర్వాత ఒంటి కాలిపై కుంటారు. గాయమైన కాలిపై ఒత్తిడి పడకుండా అలా చేశారు. ఆ తర్వాత అక్కడే ఉన్న ఓ వ్యక్తి సాయం చేశారు. అలాగే కుంటుతూనే వెళ్లి వీల్‍చైర్‌లో కూర్చున్నారు రష్మిక. ఆమె సహాయకులు వీర్‌చైర్‌ను నెట్టుకుంటూ తీసుకెళ్లారు. బయట ఎవరూ గుర్తుపట్టకుండా ముఖానికి మాస్క్, క్యాప్ పెట్టుకున్నారు రష్మిక. కాలికి కట్టు పెద్దగా ఉంది.
నెటిజన్ల స్పందన ఇలా..
రష్మిక కుంటుతూ వీల్‍చైర్‌లో వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయ్యో రష్మిక.. ఎంత కష్టపడుతున్నారని కొందరు రాసుకొస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ రాసుకొస్తున్నారు.
రష్మిక లైనప్ ఇలా..
రష్మిక ప్రధాన పాత్ర పోషించిన ఛావా చిత్రం ఫిబ్రవరి 14వ తేదీన రిలీజ్ కానుంది. ఈ హిస్టారికల్ యాక్షన్ చిత్రంలో మహారాణి యెసుబాయిగా రష్మిక నటించారు. ఈ ఫస్ట్ లుక్ తాజాగా వచ్చింది. కుబేర, సికిందర్, గర్ల్‌ఫ్రెండ్, థామా చిత్రాలు రష్మిక లైనప్‍లో ఉన్నాయి. వరుస సినిమాలతో ఈ బిజీగా ఉన్నారు నేషనల్ క్రష్.
సారీ చెప్పిన రష్మిక
తన లైనప్‍లో ఉన్న సినిమాల దర్శకులకు రష్మిక మందన్నా ఇటీవల సారీ చెప్పారు. కాలి కాలం వల్ల షూటింగ్‍కు రాలేకపోతున్నానని, ఆలస్యమవుతుందని చెబుతూ ఇటీవల ఇన్‍స్టాగ్రామ్ పోస్ట్ చేశారు. తనకు గాయమైన విషయాన్ని, ఫొటోలను వెల్లడించారు. జిమ్‍లో తనకు గాయమైందని, కోలుకునేందకు వారాలు, నెలలు పట్టొచ్చని తెలిపారు.
సంబంధిత కథనం