Neeraj Chopra: ఒక్క రూపాయి మాత్ర‌మే క‌ట్నంగా తీసుకున్న నీర‌జ్ చోప్రా – ఒలింపిక్ విన్న‌ర్‌పై హిమానీ తండ్రి ప్ర‌శంస‌లు

Best Web Hosting Provider In India 2024


Neeraj Chopra: ఒక్క రూపాయి మాత్ర‌మే క‌ట్నంగా తీసుకున్న నీర‌జ్ చోప్రా – ఒలింపిక్ విన్న‌ర్‌పై హిమానీ తండ్రి ప్ర‌శంస‌లు

Nelki Naresh Kumar HT Telugu
Jan 22, 2025 01:10 PM IST

Neeraj Chopra: భార‌త స్టార్ అథ్లెట్ నీర‌జ్ చోప్రా ఇటీవ‌లే పెళ్లిపీట‌లెక్కాడు. టెన్నిస్ ప్లేయ‌ర్ హిమానీ మోర్‌తో ఏడ‌డుగులు వేశాడు. పెళ్లి కోసం క‌ట్నంగా హిమానీ మోర్ తండ్రి నుంచి నీర‌జ్ చోప్రా కేవ‌లం ఒక్క రూపాయి మాత్ర‌మే తీసుకున్న‌ట్లు తెలిసింది.

నీర‌జ్ చోప్రా
నీర‌జ్ చోప్రా

Neeraj Chopra: భార‌త స్టార్ అథ్లెట్‌, ఒలింపిక్ విన్న‌ర్ నీర‌జ్ చోప్రా ఇటీవ‌లే వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. టెన్నిస్ ప్లేయ‌ర్ హిమానీ మోర్‌ను పెళ్లాడాడు. పెళ్లి ఫొటోల‌ను షేర్ చేసి అభిమానుల‌కు స‌డెన్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు నీర‌జ్ చోప్రా. నీర‌జ్‌, హిమానీల పెళ్లి హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని కుమ‌ర‌ట్టి ఏరియాలో ఉన్న సూర్య విలాస్ అనే రిసార్ట్‌లో సింపుల్‌గా జ‌రిగిన‌ట్లు స‌మాచారం. కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు కొద్ధి మంది అతిథులు మాత్ర‌మే ఒలింపిక్ విన్న‌ర్ పెళ్లికి అటెండ్ అయిన‌ట్లు తెలిసింది.

yearly horoscope entry point

పెద్ద‌ల అంగీకారంతో…

నీర‌జ్‌కు చాలా రోజుల నుంచే హిమానీతో ప‌రిచ‌యం ఉన్న‌ట్లు స‌మాచారం. పెద్ద‌ల అంగీకారంతోనే నీర‌జ్‌, హిమానీ పెళ్లి జ‌రిగిన‌ట్లు చెబుతోన్నారు. హిమానీకి స్పోర్ట్స్‌లో ప్రావీణ్యం ఉంది. 2016లోజూనియర్ టెన్నిస్ ఛాంపియన్‍షిప్‍ పోటీల్లో హిమానీ స్వర్ణ పతకం గెలిచింది.

ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్‍లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ప్ర‌స్తుతం అమెరికాలో స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ అడ్మినిస్ట్రేష‌న్ విభాగాల్లో మాస్ట‌ర్స్ చేస్తోన్న‌ట్లు స‌మాచారం. అమెరికాలోని కాలేజీలో టెన్నిస్ టీమ్‌లో ఓ మెంబ‌ర్‌గా హిమానీ కొన‌సాగుతోన్న‌ట్లు చెబుతోన్నారు.

రూపాయి మాత్ర‌మే…

హిమానీని పెళ్లి చేసుకోవ‌డానికి నీర‌జ్ తీసుకున్న క‌ట్న‌కానుక‌ల‌కు సంబంధించి ఓ ఆస‌క్తి క‌ర సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. హిమానీ తండ్రి నుంచి కేవ‌లం రూపాయి మాత్ర‌మే నీర‌జ్ చోప్రా క‌ట్నంగా తీసుకున్న‌ట్లు హిమానీ త‌ల్లిదండ్రులో ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలిపారు.

ఖ‌రీదైన బ‌హుమ‌తులు ఇస్తామ‌ని చెప్పిన‌ నీర‌జ్ తిర‌స్క‌రించాడ‌ని, గ్రాండ్‌గా కాకుండా సింపుల్‌గా పెళ్లి జ‌ర‌గాల‌నే ఐడియా కూడా నీర‌జ్‌దేన‌ని హిమానీ తండ్రి భాస్క‌ర్ వెల్ల‌డించారు. హిమానీకి పుట్టింటి త‌ర‌ఫు నుంచి వ‌చ్చే దుస్తులు, బంగారంతో పాటు ఇత‌ర వ‌స్తువుల్ని కూడా నీర‌జ్ వ‌ద్ద‌ని చెప్పాడ‌ట‌. నీర‌జ్ మంచి మ‌న‌సుపై హిమానీ పేరెంట్స్ ప్ర‌శంస‌లు కురిపించారు.

రెండు ప‌త‌కాలు…

2021 టోక్నో ఒలింపిక్స్‌లో నీర‌జ్ చోప్రా గోల్డ్ మెడ‌ల్ సాధించాడు. అథ్లెటిక్స్‌లో స్వ‌ర్థ ప‌త‌కం సాధించిన తొలి భార‌త క్రీడాకారుడిగా చ‌రిత్ర‌ను సృష్టించాడు. గ‌త ఏడాది జ‌రిగిన పారిస్ ఒలింపిక్స్‌లో ర‌జ‌త ప‌త‌కం సాధించాడు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024


Source link