Best Web Hosting Provider In India 2024
ఎస్టీ మహిళను ఎమ్మెల్యే చిత్రహింసలు పెడితే చోద్యం చూస్తావా బాబూ?
వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఫైర్
భూక్య చంటి కుటుంబాన్ని పరామర్శించిన వైయస్ఆర్‌సీపీ నేతలు
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఓ ఎస్టీ మహిళను బూటు కాలితో తన్ని చిత్రహింసలు పెడితే ఆయనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. ఎమ్మెల్యే తీరుతో గిరిజన మహిళ సూసైడ్ చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు, అధికారులు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం వైయస్ఆర్‌సీపీ నేతల బృందం తిరువూరు నియోజకవర్గం ఏ. కొండూరు మండలం గోపాలపురంలో వైయస్ఆర్‌సీపీ మహిళా నేత భూక్య చంటి కుటుంబాన్ని పరామర్శించింది. ఈ సందర్భంగా మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో ఎవరికీ రక్షణ లేదు:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళిత, గిరిజనులు, మహిళలు, చిన్నారులకు రక్షణ కరువైందని మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఆందోళన వ్యక్తం చేశారు. నిత్యం ఏదో ఒక చోట దాడులు జరుగుతున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాజ్యాంగం విలువల్ని తాకట్టుపెట్టే విధంగా ప్రభుత్వం పరిపాలన చేస్తుందటంలో భూక్య చంటి సూసైడ్ ఒక ఉదంతమన్నారు. భూక్య చంటి కుటుంబ సభ్యులు వారి ఆస్తులు పంచుకుంటే ఎమ్మెల్యేకు ఏం సంబంధమన్నారు. ఒక ఎస్సీ శాసనసభ్యుడై ఉండి నీ కన్నా ఇంకా తక్కువ కులాలను దారుణంగా బూట కాళ్ళతో తన్ని చిత్రహింసలకు పెట్టాడం ఎంతవరకు న్యాయమన్నారు. చివరకు గిరిజన మహిళ సూసైడ్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చాడని మండిపడ్డారు. ఎమ్మెల్యే కొలికపూడి పరిపాలనలో భాగస్వామినేనా అని నిలదీశారు. ఈ ఘటనకు కారకుడైన ఎమ్మెల్యే పై ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎమ్మెల్యే చేసిన దాడిని కప్పు పుచ్చుకునేందుకు క్రమశిక్షణ సంఘం పేరుతో టీడీపీ కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చేసిన దానికి మ్యాండిటరీ ఇచ్చి పంపించడమా అని క్రమశిక్షణ సంఘాన్ని సూటిగా ప్రశ్నించారు. మా ప్రభుత్వంలో ఇలాంటి దారుణాలు చోటు చేసుకోలేదని, వైయస్ జగన్ బాధ్యతయుతమైన పాలన అందించారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే కొలికపూడిపై కేసు నమోదు చేసి, న్యాయ స్థానం ఎదుట దోషిగా నిలబెట్టాలని మేరుగు నాగార్జున డిమాండు చేశారు.
ప్రైవేట్ స్థలం వివాదంలో ఎమ్మెల్యేకు ఏం సంబంధం: దేవినేనిఅవినాష్
ఒక ప్రైవేట్ స్థల వివాదంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ఏం సంబంధమని ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ప్రశ్నించారు. వైయస్ఆర్‌సీపీ మహిళా కార్యకర్త భూక్యా చంటి కుటుంబంపై ఎమ్మెల్యే దాడి చేసి బూటు కాలితో తన్ని అవమానించారని, ఆమె ఆత్మహత్యకు పాల్పడేలా చేశారని ఫైర్ అయ్యారు. క్రమశిక్షణ కమిటీ పేరుతో టీడీపీ పెద్దలు పిలిచి కేవలం స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చారని తప్పుపట్టారు. బాధిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేసిందని నిలదీశారు. ఎమ్మెల్యే దాడి ఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తే ఎస్ఐ బెదిరించడం దారుణమన్నారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ తిరువూరు నియోజకవర్గ సమన్వయకర్త నల్లగట్ల స్వామి దాస్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, వైయస్ఆర్‌సీపీ నేతలు పాల్గొన్నారు.