హోం మంత్రి జిల్లాలో మైన‌ర్ బాలిక‌ల‌పై అత్యాచారం సిగ్గు చేటు

Best Web Hosting Provider In India 2024

వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు వ‌రుదు క‌ళ్యాణి

విశాఖ‌:  రాష్ట్ర హోం మంత్రి సొంత జిల్లాలో ఒకే రోజు ఇద్ద‌రు మైన‌ర్ బాలిక‌ల‌పై అత్యాచారం ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డం సిగ్గుచేట‌ని వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు వ‌రుదు క‌ళ్యాణి మండిప‌డ్డారు. హోం మంత్రికి కోడి పందాల మీద ఉన్న శ్రద్ధ మహిళల రక్షణ మీద లేద‌ని విమ‌ర్శించారు. విశాఖ జిల్లాలో బుధ‌వారం ఇద్ద‌రు బాలిక‌ల‌పై జ‌రిగిన అత్యాచార ఘ‌ట‌న‌పై వ‌రుదు క‌ళ్యాణి స్పందించారు. కూటమి ప్రభుత్వంలో మహిళ రక్షణ అగమ్య గోచరంగా తయారైంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఎనీ టైం మద్యం (ATM ) పాలన రాష్ట్రంలో కొనసాగుతుంద‌ని అభివ‌ర్ణించారు. సీఎం నివాసం ఉంటున్నగుంటూరు జిల్లాలో కొకైన్ దొరకడం దారుణ‌మ‌న్నారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా లభిస్తోంద‌ని ఆక్షేపించారు. పోలీసులను మహిళల రక్షణ కోసం కాకుండా కక్ష్య సాధింపు చర్యలకు కూట‌మి స‌ర్కార్ వాడుకుంటుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్పటికైనా చంద్ర‌బాబు ప్రభుత్వం మహిళల రక్షణ మీద దృష్టి పెట్టాల‌ని వ‌రుదు క‌ళ్యాణి డిమాండు చేశారు.
 

Best Web Hosting Provider In India 2024