Best Web Hosting Provider In India 2024
RGV Syndicate: ఆర్జీవీ సిండికేట్.. బిగ్గెస్ట్ ఫిల్మ్ ఎవర్ అంటూ కొత్త సినిమా అనౌన్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ
RGV Syndicate: సిండికేట్ పేరుతో బిగ్గెస్ట్ ఫిల్మ్ ఎవర్ అంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. బుధవారం (జనవరి 22) అతడు తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ మూవీని అనౌన్స్ చేశాడు.
RGV Syndicate: ఓ కొత్త రామ్ గోపాల్ వర్మను చూస్తారంటూ ఈ మధ్యే ట్వీట్ చేసిన డైరెక్టర్ ఆర్జీవీ చెప్పినట్లుగానే ఓ కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. సత్య మూవీ స్ఫూర్తితో తాను అలాంటి మరో సినిమా తీస్తానని ఇప్పటికే అతడు చెప్పిన విషయం తెలిసిందే. ఇక బుధవారం (జనవరి 22) బిగ్గెస్ట్ ఫిల్మ్ ఎవర్ అంటూ మూవీ పేరును సిండికేట్ అని కూడా అనౌన్స్ చేశాడు.
ఆర్జీవీ సిండికేట్ మూవీ
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యే సత్య మూవీ రీరిలీజ్ సందర్భంగా ఎక్స్ లో ఓ సుదీర్ఘ పోస్ట్ చేసిన విషయం తెలుసు కదా. సత్య సక్సెస్ తర్వాత తనకు అహంకారం వచ్చిందని, నిజానికి ఆ మూవీ స్ఫూర్తితో అలాంటి ఎన్నో సినిమాలు తీయాల్సింది కానీ చెత్త సినిమాలు తీసినట్లు అంగీకరించాడు. ఇప్పుడా ట్వీట్ కు కొనసాగింపుగా సిండికేట్ అనే కొత్త మూవీని ఆర్జీవీ అనౌన్స్ చేశాడు.
“”అత్యంత భయానక జంతువు కేవలం మనిషి మాత్రమే” సత్య ఫిల్మ్ కన్ఫెషన్ నోట్ కు కొనసాగింపుగా నేను ఇప్పటి వరకూ లేనంత అతిపెద్ద మూవీని తీయాలనుకుంటున్నాను. ఈ సినిమా పేరు సిండికేట్. ఇది అసలు ఇండియా ఉనికినే ప్రశ్నార్థకం చేయాలని చూసే ఓ సంస్థపై తీస్తున్న మూవీ” అంటూ ఆ సినిమా కాన్సెప్ట్ ఏంటన్నది కూడా తన సుదీర్ఘ పోస్టులో అతడు వివరించాడు.
సిండికేట్ కాన్సెప్ట్ ఇదీ..
ఆర్జీవీ తన సిండికేట్ మూవీ కాన్సెప్ట్ ఏంటన్నది కూడా తన ట్వీట్ లోనే చెప్పాడు. మొదట వీధి గ్యాంగులు, తర్వాత స్మగ్లర్లు, ఆ తర్వాత డీ కంపెనీలాంటి కార్పొరేట్ గ్యాంగులు, ఆ తర్వాత అల్ ఖైదా, ఐసిస్ లాంటి ఉగ్రవాద గ్రూపులు ఎలా పుట్టుకొచ్చాయి? ఎలా అంతమయ్యాయో వివరిస్తూ ఈ పోస్టు సాగింది.
అయితే గత పది, పదిహేనేళ్లుగా ఇండియాలో కొత్త క్రిమినల్ ఆర్గనైజేషన్ రాలేదని, కానీ ఇప్పుడు దేశంలో ప్రజల మధ్య ఏర్పడిన విభజన రేఖలు ఓ కొత్త క్రిమినల్ ఆర్గనైజేషన్ కు దారి తీసేలా చేస్తోందని ఆర్జీవీ చెప్పాడు. అయితే ఈ కొత్త ఆర్గనైజేషన్ గతంలోని ఆర్గనైజేషన్లకు పూర్తి భిన్నంగా దేశంలోని పోలీస్ ఏజెన్సీలు, రాజకీయ పార్టీలు, అల్ట్రా రిచ్ బిజినెస్ మెన్, మిలిటరీలతో కలిపి ఏర్పడటంతో ఇది ఓ సిండికేట్ గా మారిందంటూ తన నెక్ట్స్ మూవీ గురించి ఆర్జీవీ చెప్పుకొచ్చాడు.
ఈ భూమ్మీద మనిషిని మించిన భయానక జంతువు మరొకటి లేదన్న సందేశంతోనే ఈ సిండికేట్ మూవీ మొదలవుతుందని కూడా అతడు తెలిపాడు. ఇండియాను ఓ కొత్త ఇండియాతో భర్తీ చేయాలన్నదే ఈ సిండికేట్ లక్ష్యమని, ఇదొక భయానక మూవీ అని కూడా రామ్ గోపాల్ వర్మ స్పష్టం చేశాడు. ఈ మూవీలో నటించబోయే నటీనటులు, ఇతర వివరాలను త్వరలోనే అనౌన్స్ చేస్తానని కూడా అతడు చెప్పాడు.
సంబంధిత కథనం
టాపిక్