Best Web Hosting Provider In India 2024
Zee Telugu New Serial: జీ తెలుగులో సరికొత్త సీరియల్.. ప్రారంభమయ్యే తేదీ, టైమ్ ఇదే
Zee Telugu New Serial: జీ తెలుగు ఛానెల్లో సరికొత్త సీరియల్ రాబోతోంది. ఈ సీరియల్ పేరు ఎన్నాళ్లో వేచి హృదయం. ఈ కొత్త సీరియల్ ప్రారంభమయ్యే తేదీ, టైమ్ కూడా ఆ ఛానెల్ అనౌన్స్ చేసింది.
Zee Telugu New Serial: జీ తెలుగులో ఇప్పటికే టాప్ టీఆర్పీ రేటింగ్స్ వస్తున్న పలు సీరియల్స్ టెలికాస్ట్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కొత్తగా మరో సీరియల్ ను ఆ ఛానెల్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సీరియల్ పేరు ఎన్నాళ్లో వేచిన హృదయం. ఈ కొత్త సీరియల్ వచ్చే సోమవారం (జనవరి 27) నుంచి ప్రారంభం కానుంది.
ఎన్నాళ్లో వేచిన హృదయం సీరియల్
జీ తెలుగు ఛానల్ మొదటి నుంచి ఆసక్తికరమైన అంశాలతో, ఆకట్టుకునే కాన్సెప్ట్‌లతో ఫిక్షన్, నాన్ ఫిక్షన్ షోలను అందిస్తూ తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచుతోంది. ఊహించని మలుపులు, ఆసక్తికర కథనాలతో సాగే సీరియల్స్‌తో ఆకట్టుకుంటోన్న జీ తెలుగు మరో కొత్త సీరియల్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆసక్తికరమైన కథ, కథనంతో రూపొందుతున్న సరికొత్త సీరియల్ఎన్నాళ్లో వేచిన హృదయంజనవరి 27న ప్రారంభం కానుంది. బాధ్యతలు, బంధాలే ప్రధానంగా సాగే అందమైన ప్రేమకథఈ ఎన్నాళ్లో వేచిన హృదయం. ఈ కొత్త సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 2.30 గంటలకు టెలికాస్ట్ అవుతుంది.
ఎన్నాళ్లో వేచి హృదయం సీరియల్ స్టోరీ ఇదీ
ఎన్నాళ్లో వేచిన హృదయం సీరియల్ త్రిపుర (తన్వియ) అనే ఒక స్కూల్ టీచర్, వ్యాపారవేత్త అయిన బాలకృష్ణ(చందు గౌడ) మధ్య సాగే కథతో రూపొందుతోంది. కారు ప్రమాదంతో మానసిక వైకల్యానికి గురైన బాలకృష్ణ ఆరోగ్యం బాగుపడేందుకు అతణ్ని రామాపురం తీసుకొస్తారు. కుటుంబ బాధ్యతలతో సాగుతున్న త్రిపుర జీవితం బాలతో ఎలా ముడిపడుతుంది? బాల ఆరోగ్యం బాగుపడేందుకు త్రిపుర ఏం చేసింది? ఇద్దరి జీవితాల్లో వచ్చే సమస్యలేంటి? అనే విషయాలు తెలుసుకోవాలంటే జీ తెలుగులో ప్రసారమయ్యే ఎన్నాళ్లో వేచిన హృదయం సీరియల్ని మిస్ కాకుండా చూసేయండి.
ప్రతిభావంతులైన నటీనటులు, ఆకట్టుకునే కథతో తెరకెక్కుతున్న ఎన్నాళ్లో వేచిన హృదయం సీరియల్ జీ తెలుగు ప్రేక్షకులకు రెట్టింపు వినోదం అందించేందుకు సిద్ధమైంది. చందు గౌడ, తన్వియ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ముంతాజ్, లక్ష్మణ్, ఉమ, కౌశల్, ప్రసాద్, కరాటే కల్యాణి, విశ్వ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అద్భుతమైన కథాంశం, ఆసక్తికరమైన మలుపులతో సాగే ఎన్నాళ్లో వేచిన హృదయం సీరియల్ మీరూ తప్పక చూడండి.
జీ తెలుగులో ఇప్పటికే వస్తున్న మేఘ సందేశం, నిండు నూరేళ్ల సావాసం, పడమటి సంధ్యారాగం, చామంతి, జగద్ధాత్రి లాంటి సీరియల్స్ మంచి టీఆర్పీ రేటింగ్స్ సాధిస్తున్నాయి. మరి కొత్తగా వస్తున్న ఈ ఎన్నాళ్లో వేచిన హృదయం సీరియల్ ఎలా ఉంటుందో చూడాలి.
సంబంధిత కథనం