Best Web Hosting Provider In India 2024
OTT Telugu Comedy Thriller: ఓటీటీలోకి నెల రోజుల్లోపే వస్తున్న తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ.. నవ్వడానికి రెడీగా ఉండండి
OTT Telugu Comedy Thriller: ఓటీటీలోకి ఓ తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ నెల రోజుల్లోపే స్ట్రీమింగ్ కు వస్తోంది. టాలీవుడ్ టాప్ కమెడియన్ వెన్నెల కిశోర్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా చూస్తూ నవ్వడానికి ఇక సిద్ధంగా ఉండండి.
OTT Telugu Comedy Thriller: వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల నటించిన తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. ఈ మూవీ గతేడాది డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇప్పుడీ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుండటం విశేషం. బుధవారం (జనవరి 22) ఈటీవీ విన్ ఓటీటీ ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని వెల్లడించింది.
“మిస్టరీని పరిష్కరించడానికి సిద్ధంగా ఉండండి. శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఈటీవీ విన్ లో జనవరి 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ అంటూ ఈ మూవీ పోస్టర్ ను కూడా షేర్ చేసింది. తన కామెడీ టైమింగ్ తో నవ్వించడానికి వెన్నెల కిశోర్ రెడీగా ఉన్నాడు. మరి మీరు రెడీనా?
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ స్టోరీ ఏంటంటే?
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఓ కామెడీ థ్రిల్లర్ మూవీ. వైజాగ్ బీచ్ లో హత్యకు గురైన పులిదండు మేరీ అనే మహిళ, ఆ హత్యకు గల కారణాలేంటి అని ఇన్వెస్టిగేట్ చేసే ప్రైవేట్ డిటెక్టివ్ ఓం అలియాస్ షెర్లాక్ హోమ్స్ (వెన్నెల కిశోర్) చుట్టూ తిరిగే కథ ఇది. 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురైన సమయంలోనే ఇక్కడ బీచ్ లో మేరీ హత్య జరుగుతుంది.
ఈ కేసును దర్యాప్తు చేసే సీఐ భాస్కర్ అటు రాజీవ్ గాంధీ కేసుకు మారడంతో ప్రైవేట్ డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు. వారంలోపే ఈ కేసును పరిష్కరించాల్సిన పరిస్థితిలో అతడు తన దర్యాప్తు ఎలా చేస్తాడు? ఏడుగురు అనుమానితుల్లో నుంచి ఈ హత్యకు పాల్పడింది ఎవరన్నది ఎలా గుర్తిస్తాడు? అసలు ఓం.. షెర్లాక్ హోమ్స్ ఎలా అయ్యాడు అనేది తెలియాలంటే ఈ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చూడాల్సిందే. ఈ సినిమాకు చంటబ్బాయ్ తాలూక అనే క్యాప్షన్ తో ఒకప్పుడు చిరంజీవి నటించిన మూవీని గుర్తుకు తెచ్చారు. అప్పట్లో ఆ సినిమా కూడా ఓ సెన్సేషన్. చిరు తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టేశాడు.
ఇక ఈ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమాను రైటర్ మోహన్ డైరెక్ట్ చేశాడు. డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఐఎండీబీలోనూ 5.3 రేటింగ్ మాత్రమే వచ్చింది. దీంతో నెల రోజుల్లోపే అంటే జనవరి 24 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
సంబంధిత కథనం