Best Web Hosting Provider In India 2024
Washing Mashine: వాషింగ్ మెషీన్‌లో ఈ 5 వస్తువులు వేయకూడదు, దుస్తులతో పాటూ మెషీన్ కూడా పాడైపోతుంది
Washing Mashine: మీరు కూడా అన్ని రకాల దుస్తులు వాషింగ్ మెషీన్ లో వేసి ఉతికేస్తున్నారా?ఆ యంత్రంలో ఉతకకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి. వాటిని ఉతకడం వల్ల మెషీన్ పాడయ్యే అవకాశం ఉంది.
రోజువారీ చేయాల్సిన పనుల్లో బట్టలు ఉతకడం కూడా ఒకటి. వాషింగ్ మెషీన్ రాకతో ఈ పని చాలా సులువుగా మారిపోయింది. ప్రతి రోజూ బట్టలు ఉతికే బాధను తప్పించింది మెషీన్. దీని వల్ల తక్కువ శ్రమతో, తక్కువ సమయంలో దుస్తులు ఉతికేస్తున్నాము. వాషింగ్ మెషిన్ నేడు ప్రతి ఇంట్లో కామన్ ఉంటోంది. దానిని సరిగ్గా ఎలా ఉపయోగించాలో తెలియని వారు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. సాధారణంగా వాషింగ్ మెషీన్ లో ఎలాంటి బట్టలు ఉతుక్కోవచ్చో తెలిసిన వారు సంఖ్య చాలా తక్కువ. అందులో వేయకూడని బట్టలు కూడా వేసి ఉతికేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఈ బట్టలు చెడిపోవడమే కాదు, మీ మెషిన్ కండిషన్ కూడా చెడిపోతుంది. మరి ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం.
పట్టు చీరలు
మీరు ఆలోచించకుండా మీ పట్టుచీరలు లేదా ఇతర దుస్తులను వాషింగ్ మెషీన్లో వేస్తుంటే ఆ పని చేయకండి. పట్టు చాలా సున్నితమైన వస్త్రం. వాటిని వాషింగ్ మెషీన్లో వేస్తే అవి చెడిపోయే అవకాశాలు ఎక్కువ. హార్డ్ వాష్ వల్ల సిల్క్ దారాలు బయటకు రావడం మొదలై దాని మెరుపు కూడా పోతుంది. చాలాసార్లు, దాని మొత్తం ఎంబ్రాయిడరీ కూడా చెడిపోతుంది. ముఖ్యంగా ఖరీదైన, స్వచ్ఛమైన పట్టు వస్త్రాలు చెడిపోయే అవకాశాలు ఎక్కువ.
లెదర్ జాకెట్లు
కొంతమంది తమ లెదర్ జాకెట్లు, ప్యాంట్లు, బూట్లు, పర్సులు, వారి బెల్టులు, బ్యాగులను కూడా కడగడానికి వాషింగ్ మెషీన్లో ఉంచుతారు. ఇలా చేయడం వల్ల మీ తోలు వస్తువులు పూర్తిగా చెడిపోవడమే కాకుండా, వాషింగ్ మెషీన్ దెబ్బతినే ప్రమాదం కూడా పెరుగుతుంది. వాస్తవానికి, తోలుతో చేసిన వస్తువులు చాలా సున్నితమైనవి. మృదువైన బ్రష్ లేదా బేబీ వైప్స్ సహాయంతో మీరు తోలును బాగా శుభ్రపరచవచ్చు.
ఉన్ని బట్టలు
శీతాకాలంలో ఉన్నితో చేసిన దుస్తులు అధికంగా వాడుతూ ఉంటారు. వాటిని వాషింగ్ మెషీన్ లో ఉతకకూడదు. ముఖ్యంగా చేతితో అల్లిన స్వెట్టర్లు, జెర్సీలను పొరపాటున యంత్రంలో ఉంచవద్దు. నిజానికి వాటిని మెషీన్ లో ఉతకడం ద్వారా అవి పాడవుతాయి. అదే సమయంలో, చాలాసార్లు అవి చాలా వదులుగా ఉంటాయి. ఉన్ని బట్టలను ఆరబెట్టడం లేదా చల్లని నీటితో చేత్తోనే ఉతికేయాలి.
ఎండ్రాయిడరీ
వాషింగ్ మెషీన్ లో తేలికపాటి డిటర్జెంట్ వేయాలి. అందులో ఖరీదైన ఎంబ్రాయిడరీ, పూసలు, స్టోన్ వర్క్ దుస్తులను ఉతకకూడదు. ఇలా చేయడం వల్ల మీ బట్టలు చాలా త్వరగా పాడవుతాయి. యంత్రంలో ఉతికినప్పుడు, బట్టల ఎంబ్రాయిడరీ, పూసలు, రాళ్ళు రాలిపోయే అవకాశం ఉంది. వాటి రంగు, మెరుపు కూడా మసకబారడం ప్రారంభమవుతుంది. అలాంటి బట్టలను ఆరబెట్టడం మంచిదని భావిస్తారు.
బ్రా వంటి లోదుస్తులు
మహిళలు బ్రా వంటి లోదుస్తులు ప్రతిరోజూ వేసుకుంటారు. వాటిని కూడా వాషింగ్ మెషీన్లో వేస్తారు. ఈ అలవాటును మార్చుకోండి. నిజానికి బ్రాను మెషీన్ వాష్ చేసినప్పుడు హుక్ లు దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనితో పాటు బ్రా పట్టీలు, ఆకారం వదులుగా మారిపోతాయి. ముఖ్యంగా ఫ్యాన్సీ లేస్ బ్రాలు, ప్యాడెడ్ బ్రాలు, అండర్ వైర్ బ్రాలను మెషీన్ లో కడగడం మర్చిపోకూడదు. దీంతో బ్రా పూర్తిగా దెబ్బతినే అవకాశాలు పెరుగుతాయి.
సంబంధిత కథనం
టాపిక్