Best Web Hosting Provider In India 2024
BRS Rythu Maha Dharna : ఈ నెల 28న నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా, హైకోర్టు గ్రీన్ సిగ్నల్
BRS Rythu Maha Dharna : బీఆర్ఎస్ రైతు మహా ధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 28న నల్గొండలో రైతు మహా ధర్నా నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. మహా ధర్నాలో బీఆఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు ముఖ్యనేతలు, రైతులు పాల్గొననున్నారు.
BRS Rythu Maha Dharna : బీఆర్ఎస్ రైతు మహా ధర్నాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 28న నల్గొండలో సభ నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. నల్గొండ క్లాక్‌టవర్ సెంటర్లో రైతు మహాధర్నా నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. బీఆర్ఎస్ రైతు మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించకపోవడంతో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మహాధర్నా కార్యక్రమానికి అనుమతినిచ్చింది. మహా ధర్నాలో బీఆఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు ముఖ్యనేతలు, రైతులు పాల్గొననున్నారు.
“నల్గొండలో బీఆర్ఎస్ మహాధర్నాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రకాలుగా అడ్డుకోవాలని చూసినా చివరికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 28న నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో బీఆర్ఎస్ రైతు మహాధర్నా జరగనుంది.” అని బీఆర్ఎస్ ఎక్స్ వేదికగా ప్రకటించింది.
ఈ నెల 21న నల్లగొండలో బీఆర్ఎస్ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ సభకు నల్గొండ జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ, జిల్లాలో గ్రామ సభలు, సంక్రాంతి రద్దీ కారణంగా బందోబస్తు ఇవ్వలేమని పోలీసులు ధర్నాకు అనుమతి నిరాకరించారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు రైతు ధర్నా అనుమతి కోసం హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి కూడా -కేటీఆర్
“రుణమాఫీ, రైతుబంధు, ఆరు గ్యారెంటీల గురించి గ్రామసభల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము కాంగ్రెస్ నాయకుల దగ్గర ఉందా?” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
“బీఆర్ఎస్ అంటే కేవలం భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు.. భారత రైతు సమితి కూడా అని కేటీఆర్ అన్నారు. రైతుల పట్ల కేసీఆర్ కు ఉన్న ప్రేమ, ఆర్తి ప్రస్తుత కాంగ్రెస్ పాలకుల్లో మచ్చుకైనా కనిపించడం లేదు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదన్న పెద్దల మాటను వందకు వంద శాతం నమ్మి అందుకు తగ్గట్టుగానే 65 శాతం మంది ప్రజలు ప్రత్యక్షంగా ఆధారపడిన వ్యవసాయరంగ సంక్షేమానికి కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలను అమలుచేశారు. రైతు బంధు, రుణమాఫీ పేరుతో లక్ష కోట్ల రూపాయలను నేరుగా 70 లక్షల రైతుల ఖాతాల్లో వేసిన ఏకైక ముఖ్యమంత్రి భారత దేశ చరిత్రలో కేసీఆర్ ఒక్కరే”- కేటీఆర్
“రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, భూమి శిస్తు రద్దు, నీటి తీరువ రద్దు, చిన్న నీటి వనరులైన చెరువులను కాపాడే మిషన్ కాకతీయ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టు నిర్మాణాలతో స్వతంత్ర భారత చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ చేయని విప్లవాత్మక పనులను రైతుల కోసం కేసీఆర్ చేశారు. రైతు ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించిన రాష్ట్రంగా తెలంగాణను కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటులో ప్రశంసించింది”- కేటీఆర్
సంబంధిత కథనం
టాపిక్