Best Web Hosting Provider In India 2024
OTT Malayalam Web Series: హాట్‌స్టార్‌లోకి మలయాళం రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Malayalam Web Series: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలోకి మరో రొమాంటిక్ కామెడీ మలయాళం వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ తెలుగులోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ ఓటీటీ బుధవారం (జనవరి 22) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
OTT Malayalam Web Series: హాట్‌స్టార్ కొత్త ఏడాదిలో తన తొలి మలయాళం వెబ్ సిరీస్ ను అనౌన్స్ చేసింది. రొమాంటిక్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ పేరు లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ (Love Under Construction). ఈ వెబ్ సిరీస్ లో ప్రముఖ మలయాళం నటులు నీరజ్ మాధవ్, గౌరి జి కిషన్, అజు వర్గీస్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ విషయాన్ని బుధవారం (జనవరి 22) హాట్‌స్టార్ తెలిపింది.
లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ ఓటీటీ స్ట్రీమింగ్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 2025కుగాను తన తొలి మలయాళం వెబ్ సిరీస్ లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ ను అనౌన్స్ చేసింది. త్వరలోనే ఈ సిరీస్ రానున్నట్లు ఆ ఓటీటీ వెల్లడించింది. అయితే ఎప్పటి నుంచి అన్నది మాత్రం చెప్పలేదు. ఫిబ్రవరిలో వచ్చే అవకాశం ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విష్ణు జీ రాఘవ్ డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ మలయాళం, తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుండటం విశేషం.
“వాళ్లు తమ లవ్ ‘స్టోరీ’ని నిర్మించుకుంటారా? లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోకి రాబోతోంది” అనే క్యాప్షన్ తో ఈ కొత్త వెబ్ సిరీస్ అనౌన్స్ చేసింది. ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా లాంచ్ చేసింది. విష్ణు జీ రాఘవ్ గతంలో టొవినో థామస్, కీర్తి సురేష్ నటించిన వాశి మూవీని కూడా డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
హాట్‌స్టార్ మలయాళం వెబ్ సిరీస్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మలయాళం వెబ్ సిరీస్ లలో దూసుకెళ్తోంది. గతంలో కేరళ క్రైమ్ ఫైట్స్, పెరిల్లూర్ ప్రీమియర్ లీగ్ లాంటి వెబ్ సిరీస్ తీసుకొచ్చిన హాట్‌స్టార్ గతేడాది 1000 బేబీస్ పేరుతో ఓ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా అందించింది. ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడీ లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ రొమాంటిక్ కామెడీ జానర్ కావడంతో ఇది కూడా ఆసక్తి రేపుతోంది. ఈ సిరీస్ ను ఎం రెంజిత్ నిర్మిస్తున్నాడు. గతంలో హాట్‌స్టార్ లో వచ్చిన కేరళ క్రైమ్ ఫైల్స్, పెరిల్లూర్ ప్రీమియర్ లీగ్ సిరీస్ లలో నటించిన అజు వర్గీస్ మరోసారి ఈ లవ్ అండర్ కన్‌స్ట్రక్షన్ తో వస్తున్నాడు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని కూడా హాట్‌స్టార్ అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
సంబంధిత కథనం