Best Web Hosting Provider In India 2024
Anupama Parameswaran: ఆనందంతోపాటు బాధ్యత కనిపిస్తోంది.. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్
Anupama Parameswaran Comments In Paradha Teaser Launch: బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించిన లేటెస్ట్ మూవీ పరదా. సినిమా బండి డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన పరదా టీజర్‌ను మలయాళ స్టార్ హీరో దుల్కన్ సల్మాన్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్ చేసింది.
Anupama Parameswaran Paradha Teaser Released: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. గతేడాది టిల్లు స్క్వేర్ సినిమాతో ఆడియెన్స్‍ను అభిమానులను అలరించింది. ఎప్పుడు చేయని విధంగా బోల్డ్ లుక్‌లో టిల్లు స్క్వేర్ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కనిపించింది.
మొదటి సినిమాతో ప్రశంసలు
ఇప్పుడు మరో డిఫరెంట్ లుక్ అండ్ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. అనుపమ పరమేశ్వరన్ నటించిన లేటెస్ట్ మూవీ పరదా. తన తొలి చిత్రం ‘సినిమా బండి’తో ప్రశంసలు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల పరదా మూవీని తెరకెక్కిస్తున్నారు. డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల ఇప్పుడు తన రెండవ చిత్రం ‘పరదా’తో వస్తున్నారు.
ముగ్గురు హీరోయిన్స్
ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో పాపులరైన రాజ్ అండ్ డీకే పరదా సినిమాకు మద్దతు ఇస్తున్నారు. శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఆనంద మీడియా బ్యానర్‌పై పరదా సినిమాని నిర్మిస్తున్నారు. ఇందులో మోస్ట్ ట్యాలెంటెడ్ అనుపమ పరమేశ్వరన్‌తోపాటు మలయాళ హీరోయిన్ దర్శన రాజేంద్రన్, తెలుగు ప్రముఖ నటి సంగీత ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
పరదా టీజర్ రిలీజ్
పరదా ఫస్ట్ లుక్ పోస్టర్, కాన్సెప్ట్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా బుధవారం (జనవరి 22) నాడు పరదా టీజర్‌ను మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా అనుపమ పరమేశ్వరన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
మంచి పాత్రలు చేయాలనే
పరదా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. పరదా టీజర్ ప్లే చేసినప్పుడు నా పదేళ్ల జర్నీ కనిపించింది. చాలా ఎమోషనల్ అయ్యాను. ఈ రోజు ఆనందంతో పాటు ఒక బాధ్యత కనిపిస్తోంది. మిమల్ని అలరించడానికి ఇలాంటి మంచి పాత్రలు మరిన్ని చేయాలనే రెస్పాన్స్‌బులిటీ” అని చెప్పింది.
ఇదే నా ఫేవరెట్ ఫిలిం
“నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతుంది. ఈ పదేళ్లలో నా మోస్ట్ ఫేవరేట్ ఫిలిం పరదా. మోస్ట్ ఫేవరేట్ క్యారెక్టర్ సుబ్బు. ఈ సినిమా అందరూ ఇష్టపడి చేసిన సినిమా. అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. టీం అందరికీ అడ్వాన్స్ కంగ్రాట్స్. నన్ను నమ్మి బిలీవ్ చేసిన విజయ్ గారికి ప్రవీణ్ గారి థాంక్ యూ. మీ అందరి సపోర్ట్‌కి థాంక్ యూ” అని అనుపమ పరమేశ్వరన్ తెలిపింది.
70 లక్షలు చెల్లించి
ఇదిలా ఉంటే, పరదా టీజర్‌లోకి వెళితే.. హీరోయిన్ సుబ్బు పాత్రను అనుపమ పరమేశ్వరన్ వాయిస్ ఓవర్ ద్వారా పరిచయం చేస్తుంది. కథకుడి ప్రకారం, సుబ్బు చాలా దూరం ప్రయాణించి తన జీవితాన్ని ముగించడానికి 70 లక్షలు చెల్లిస్తుంది. ఆ తర్వాత సుబ్బు, దర్శన రాజేంద్రన్, సంగీత పోషించిన మరో ఇద్దరు ప్రధాన పాత్రలతో కలిసి సాహసోపేతమైన యాత్రకు బయలుదేరడం ఆసక్తిగా ఉంది.
సీక్రెట్ ఎజెండా
అయితే, సుబ్బు ప్రయాణంలో సీక్రెట్ ఎజెండా ఉంది. టీజర్ ముందుకు సాగుతున్న కొద్దీ, గ్రామంలోని పాత ఆచారాలు, సంప్రదాయాలు, మూఢనమ్మకాలను రివీల్ చేస్తుంది. వాటిలో మహిళలు ముఖాలను కప్పుకోవడం, సతి లాంటి ఆచారం ఉన్నాయి. చివర్లో, అనుపమ పరమేశ్వరన్ ముఖం రివిల్ కావడం మిస్టిరియస్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తోంది.
సంబంధిత కథనం