Brahmamudi January 23rd Episode: అత్తింట్లో దోషిలా నిలబడ్డ కావ్య- సుభాష్‌ను అవమానించిన కళావతి- ధాన్యలక్ష్మీ మాటల తూటాలు

Best Web Hosting Provider In India 2024

Brahmamudi January 23rd Episode: అత్తింట్లో దోషిలా నిలబడ్డ కావ్య- సుభాష్‌ను అవమానించిన కళావతి- ధాన్యలక్ష్మీ మాటల తూటాలు

 

Brahmamudi Serial January 23rd Episode: బ్రహ్మముడి జనవరి 23 ఎపిసోడ్‌లో నందగోపాల్‌ను ఎవరో గన్‌తో షూట్ చేసి పారిపోతారు. దాంతో మళ్లీ రాజ్, కావ్య కష్టాలు మొదటికి వస్తాయి. నిజం చెబితే రుద్రాణి చాటింపు వేస్తుందని, అప్పులన్నీ నెత్తిమీద పడతాయని రాజ్ భయపడిపోతాడు. తనే దోషిలా ఇంట్లో ఉంటానని కావ్య అంటుంది.

 
బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 23వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 23వ తేది ఎపిసోడ్
 

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో నందగోపాల్ వంటి వాడి కోసం పని చేయడం ఎంత పెద్ద తప్పో రౌడీలకు కావ్య చెబుతుంది. కాసేపట్లో పోలీసులు వచ్చి వాడిని అరెస్ట్ చేస్తారు. మీరు ఉంటే మిమ్మల్ని కూడా పోలీసులు పట్టుకెళ్తారు. అప్పుడు మీ భార్య పిల్లలు అనాథలు అయిపోతారు. రోడ్డునపడిపోతారు. దీన స్థితికి వస్తారు. గుడిలో, రోడ్ల మీద అడుక్కుంటారు అని కావ్య చెబుతుంది.

మందు బాటిల్‌తో నందా ఎటాక్

దాంతో ఊహిస్తేనే భయంగా ఉందని రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. డీల్ చేయడం అంటే ఇది. మీరు కండ బలం వాడితో మేము బుద్ధిబలం వాడతాం. గోటితో పోయేదాన్ని గొడ్డలితో ఎందుకు అని రాజ్‌తో కావ్య అంటుంది. అప్పుడే నేను మూడు నెలల్లో కోటీశ్వరుడిని కావాలంటే మీరు బతకూడదని రాజ్, కావ్యపై మందు బాటిల్‌తో ఎటాక్ చేస్తాడు నందగోపాల్. కానీ, రాజ్ నందగోపాల్‌ను ఆపుతాడు. కాస్తలో కావ్యకు బాటిల్ తగలడం తప్పుతుంది.

నందగోపాల్‌ను కొట్టి బెడ్‌పై పడేస్తాడు రాజ్. బుద్ధిబలమే కాదు, కండబలం కూడా వాడాల్సి వస్తుంది శ్రీమతిగారు అని రాజ్ అంటాడు. డబ్బులు ఎక్కడపెట్టావ్ అని నందాను రాజ్ అడిగితే.. తెలీదంటాడు. దాంతో నందగోపాల్‌ను చితక్కొడతాడు రాజ్. అయినా నందా చెప్పకపోవడంతో మందు బాటిల్ ఎత్తుతాడు రాజ్. కావ్య ఆపుతుంది. పోలీసులు వస్తారు. వాళ్లే చూసుకుంటారు. మీరెందుకు హంతకుడు కావాలని కావ్య అంటుంది.

బయటకు రాగానే నంద పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, చుట్టూ పోలీసులు ఉండటంతో తప్పించుకోలేకపోతాడు. రాజ్ వచ్చి వార్నింగ్ ఇస్తాడు. మాకు నెల రోజుల్లో నిద్రలేకుండా చేస్తున్నాడు. ఇంట్రాగేషన్ చేసి డబ్బులు ఎక్కడ పెట్టాడో చెప్పించండి అని రాజ్ అంటాడు. నందాను ఎస్సై పట్టుకెళ్తాడు. ఇప్పుడు దొరికిందా ఇంట్లో చెప్పడానికి సమాధానం అని రాజ్ అంటాడు. ఆ డబ్బులు మన చేతికి రావాలి కదా అని కావ్య అంటుంది.

 

చనిపోయిన నంద గోపాల్

వీడుంటే అన్ని మన చేతులకు వస్తాయి అని రాజ్ అంటాడు. కానీ, ఇంతలో బైక్‌పై ఒకరు వచ్చి నందాను గన్‌తో రెండుసార్లు షూట్ చేస్తాడు. దాంతో నంద కిందపడిపోతాడు. రాజ్, కావ్య షాక్ అవుతారు. నందాను వచ్చి చూస్తారు. హాస్పిటల్‌కు తీసుకెళ్దామని రాజ్ అంటే.. వాడు చచ్చిపోయాడని ఎస్సై చెబుతాడు. దాంతో మరింత షాక్ అవుతాడు రాజ్. వీడు చేసిన మోసం వల్ల ఈరోజు నా ఫ్యామిలీ అంతా చాలా సమస్యలో ఉందని రాజ్ కంగారుగా లేవమంటాడు.

ఇలా జరుగుతుందని ఊహించలేకపోయాం. ఇదంతా చూస్తుంటే వీడిని ప్రీ ప్లాన్‌డ్‌గా చంపారనిపిస్తోందని ఎస్సై అంటాడు. ఇప్పుడు వంద కోట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని రాజ్ అంటాడు. కానిస్టేబుల్స్ వచ్చి వాడు తప్పించుకున్నాడు అని చెబుతారు. మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు. మీడియాకు తెలిస్తే మీరు కూడా కేసులో ఇన్వాల్వ్ కావాల్సివస్తుందని ఎస్సై అంటాడు. దాంతో రాజ్‌ను కావ్య తీసుకెళ్లిపోతుంది.

మరోవైపు ధాన్యలక్ష్మీ ఆలోచిస్తుంటే రుద్రాణి వస్తుంది. నా కొడుకు రాహుల్ ఓ ఏజెంట్ ఆత్రేయలా, నేను లేడి జేమ్స్ బాండ్‌లా క్లూస్ అన్ని కలెక్ట్ చేసి తీసుకొస్తే వాళ్లను నువ్ సింపుల్‌గా వదిలేసావ్. ఇలా అయితే, రాజ్ కావ్యల గుట్టు రట్టు చేసేదెప్పుడు, ఇంట్లో నిజాలు తేల్చెదెప్పుడు. న్యాయంగా మనకు రావాల్సిన ఆస్తులు దక్కించుకునేదెప్పుడు. తెలివితేటలు అంటే వాళ్లవేలే. దొరికినట్లే దొరికి తుర్రుమని పారిపోయారు. ఇక వాళ్ల నోటితే నిజాలు చెప్పినట్లే అని రుద్రాణి అంటుంది.

 

మరో సీక్రెట్ చెప్పిన రాహుల్

సాయంత్రం వచ్చి నిజాలు చెబుతారుగా అని ధాన్యలక్ష్మీ అంటుంది. బాగా ప్రిపేర్ అయి వస్తారు అని రుద్రాణి అంటుంది. వాళ్లం చెబుతారో చూద్దామని, అంతేకానీ చెప్పింది నమ్మడానికి కాదు అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇంతలో రాహుల్ వచ్చి మరో విషయం తెలిసింది. రాజ్ కావ్య ఇవాళ అసలు ఆఫీస్‌కే వెళ్లలేదట అని రాహుల్ అంటాడు. నేను ఏది అనుకున్నానో అదే రాహుల్ చెప్పాడు. మన నుంచి తప్పించుకోడానికో వెళ్లారు కానీ, ఆఫీస్‌లో ముఖ్యమైన పని కోసం కాదు. కోట్లు లాస్ అవుతాయని కాదు అని రుద్రాణి అంటుంది.

ఇక వాళ్లు వచ్చి ఏదో ఒక కథ చెబుతారు. దాంతో నువ్వు నమ్మేస్తావ్. వెర్రి వెంగలప్పవు అవుతావ్ అని రుద్రాణి అంటుంది. నీకు నేనేంటో సాయంత్రం తెలుస్తుంది. చూస్తూ ఉండండి అని ధాన్యలక్ష్మీ అంటుంది. మరోవైపు రాజ్, కావ్య వస్తూ ఇదేంటీ ఇలా జరిగిందని, ఇప్పుడు రుద్రాణి, ధాన్యలక్ష్మీకి ఎం చెప్పాలా అని ఆలోచిస్తుంటారు. వాడు దొరికాడని నేను అత్యుత్సాహంతో నిజాలు చెబుతానని నోరు జారను అని రాజ్ అంటాడు. అందుకే కన్ఫర్మేషన్ లేకుండా మాట ఇవ్వొద్దు అని కావ్య అంటుంది.

 

సరే తల్లి. పొరపాటు అయింది, నన్ను క్షమించు అని రాజ్ కోపంగా అంటాడు. దాంతో కావ్య సారీ చెబుతుంది. నేనే నీకు సారీ చెప్పాలి. తాతయ్య ఇచ్చిన మాట కాపాడుకోవడం కోసం నిన్ను ఇందులోకి లాగాను అనిపిస్తోంది. మన కుటుంబ విషయాలు కదా. పక్కలో బల్లెంలా ఉన్నారు. నాతోపాటు నిన్ను కూడా తప్పుబడతారు. అది తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు అవుట్ హౌజ్, వంద కోట్ల షూరిటీ తెలిస్తే రుద్రాణి అత్త ఊరుకోదు అని రాజ్ అంటాడు.

భయపడిన రాజ్

ఊరంతా చాటింపు వేస్తుంది. కంపెనీ పేరుతో పాటు కుటుంబ పరువు పోతుంది. అప్పుడు అప్పులన్నీ నెత్తిమీద పడతాయి. ఎలా కట్టాలో తెలియట్లేదు. నందా గాడు పోయాడు. వాడికి తాతయ్య వంద కోట్లు ఇచ్చాడంటే ధాన్యలక్ష్మీ పిన్ని నమ్ముతుందో లేదు. ఇంత పెద్ద విషయం మాతో ఎందుకు చెప్పలేదని అమ్మా నాన్న అంటారు. ఇప్పుడు ఇంటికి వెళ్లాలంటేనే భయంగా ఉందని రాజ్ అంటాడు. మరోవైపు ఇంట్లో రాజ్ కావ్య కోసం అంతా ఎదురుచూస్తుంటారు.

దాంతో స్వప్న సెటైర్లు వేస్తారు. రాహుల్ చేసిన తప్పుల గురించే చెబుతారు. నాకు అయితే అంతకుమించి కారణం కనపడట్లేదు. తల్లీకొడుకులు తట్టాబుట్టా నెత్తినపెట్టుకుని ఏ చెట్టో పుట్టో చూసుకోడానికి రెడీగా ఉండండి. అదిగో కారు వచ్చింది.. మీరు వెళ్లాల్సిన టైమ్ వచ్చిందని స్వప్న అంటుంది. మరి అంత దారుణంగా ఫ్రాడ్ చేశావా అని రాహుల్‌ను అనుమానిస్తుంది రుద్రాణి. దానిమొహం ఏం చేసిన మూడో కంటికి తెలియకుండా చేశాను అని రాహుల్ అంటాడు.

 

ఇంట్లో ఏం చెప్పాలి అని రాజ్ ఆగిపోతాడు. ఇంట్లో నేను ఎలాగు దోషినయ్యాను. ఇది కూడా నా మీద నుంచే పోతుంది. ఎన్ని అన్నా పడతాను. ఏం చేస్తాను అని కావ్య అంటుంది. రాజ్, కావ్య రాగానే రుద్రాణి, ధాన్యలక్ష్మీ సెటైర్లు వేస్తారు. అసలు విషయం విప్పండి అని ఇద్దరు అడిగుతారు. మనందరికి తెలియకుండా ఇంకా ఎన్ని ఆస్తులు తాకట్టుపెట్టారో. ఎన్ని కోట్లు చక్కపెట్టారో ఎవరికీ తెలుసు అని రుద్రాణి అంటుంది.

దోషిలా నిలబడ్డావేంటమ్మా

ఏమైందమ్మా నువ్వేనా ఇంత మౌనంగా ఉంది. సమాధానం చెప్పకుండా దోషిలా నిలబడ్డావేంటమ్మా. ఎంతకాలం తప్పు మీద వేసుకుంటారు. అది ఎలాంటిది అయినా ఇవాళ మాకు తెలియాల్సిందే అని సుభాష్ అంటాడు. నన్ను క్షమించండి మావయ్య గారు. ఇప్పుడు నేను ఏం చెప్పలేను అని కావ్య అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. అంటే, ఉదయం నుంచి చూసినవాళ్లంతా ఫూల్స్‌లా కనిపిస్తున్నారా అని రుద్రాణి అంటుంది.

ఏం నాటకాలు ఆడుతున్నావా.. నాటకాలు. మీ అమ్మ నాటకాలు ఆడి ముగ్గురిని మీ పంపించింది.. అనుకున్నపని పూర్తి అయిపోయిందని నిశ్చింతగా కూర్చుని నిన్ను ముందుకు తోసిందా. నీతో ఈ నాటకాలన్నీ ఆడిస్తుందా అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఈవిడకు అన్ని నాటకాలు డెలీవరీలోనే అబ్బిన విద్యలు ధాన్యలక్ష్మీ. మీరు అసలు ఆఫీస్‌కే వెళ్లలేదట. మరెక్కడకి వెళ్లారు అని రుద్రాణి అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు.

 

అసలు రహస్యంగా మీరేం చేస్తున్నారు. ఇన్ని అబద్ధాలు ఏం చేస్తున్నారు. తాకట్టు పెట్టిన డబ్బులు ఏం చేశారు. ఇవాళ నిజం చెప్పాల్సిందే అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఏం నిజం కావాలి మీకు. అసలు నిజం చెబితే తట్టుకునే శక్తి మీలో ఒక్కరికైనా ఉందా. ఎందుకు నా భార్యను రోజుకో విషయంలో దోషిగా నిలబెట్టి నిందలు వేస్తున్నారు. ఆమె నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం లేకున్నా. మా అమ్మ, నాన్న, నానమ్మకు నిజం తెలియాల్సిన అవసరం ఉంది. అసలు ఆ గెస్ట్ హౌజ్ ఎందుకు తాకట్టు పెట్టామో తెలుసా అని రాజ్ అంటాడు.

నోరు జారిన కావ్య

ఆపండి. అసలు ఏం మాట్లాడుతున్నారు అని కావ్య అంటుంది. తర్వాత తమ గదిలో రాజ్, కావ్య మాట్లాడుకుంటారు. దేవుడు లాంటి మావయ్య గారిని పట్టుకుని మీకు అడిగే హక్కు లేదని నోరు జారాను. మీకు నా మీద కోపం రాలేదా అని కావ్య అంటుంది. ఇక నుంచి నీ మనసు కష్టపెట్టకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నాను అని రాజ్ అంటాడు. దాంతో రాజ్‌ను హగ్ చేసుకుని బాధపడుతుంది కావ్య. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner
 

టాపిక్

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024