Best Web Hosting Provider In India 2024
Action Comedy: తెలుగులోకి కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ యాక్షన్ కామెడీ మూవీ -15 కోట్ల బడ్జెట్ -50 కోట్ల కలెక్షన్స్!
విశాల్ కోలీవుడ్ మూవీ మదగజరాజా తెలుగు రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. ఈ యాక్షన్ కామెడీ మూవీ జనవరి 31న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ మూవీలో అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్లుగా నటించారు.
Action Comedy: విశాల్ హీరోగా నటించిన మదగజ రాజా మూవీ తెలుగులోకి వస్తోంది. తమిళంలో సంక్రాంతికి రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ మూవీ ఈ నెలాఖరున తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. యాక్షన్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన మదగజ రాజా సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహించాడు.
పన్నెండేళ్ల గ్యాప్ తర్వాత…
2013లోనే షూటింగ్‌ను పూర్తిచేసుకున్న మదగజ రాజా మూవీ దాదాపు పన్నెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత థియేటర్లలో రిలీజైంది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సంక్రాంతికి తమిళంలో రిలీజైన సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.
అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్…
మదగజ రాజా మూవీలో విశాల్ సరసన అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ హీరోయిన్లుగా నటించారు. సోనూ సూద్, సంతానం కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు తమిళ హీరో విజయ్ ఆంటోనీ మ్యూజిక్ అందించడం గమనార్హం.
తెలుగు రిలీజ్ డేట్…
మదగజ రాజా తెలుగులో జనవరి 31న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను సత్య కృష్ణన్ ప్రొడక్షన్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. తెలుగు రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.
యాక్షన్ కామెడీ…
ముగ్గురు ప్రాణ స్నేహితులను కష్టాల్లో నుంచి గట్టెక్కించడానికి ఓ యువకుడు ఏం చేశాడనే పాయింట్‌కు యాక్షన్, కామెడీ అంశాలను జోడించి దర్శకుడు సుందర్ సి ఈ సినిమాను రూపొందించారు. ఎంజీఆర్ అలియాస్ రాజా (విశాల్) ధైర్యవంతుడైన యువకుడు. ఓ పెళ్లిలో తన చిన్ననాటి స్నేహితులు ముగ్గురిని కలుస్తాడు.
కరక్కువేల్ విశ్వనాథ్ (సోనూ సూద్) అనే రౌడీ కారణంగా స్నేహితులు ఇబ్బందుల్లో ఉన్నారనే నిజం రాజాకు తెలుస్తుంది. వారిని ఆ డాన్ నుంచి కాపాడటానికి రాజా ఏం చేశాడు? రాజా జీవితంలోకి వచ్చిన మాధవి (అంజలి), మాయ( వరలక్ష్మి శరత్ కుమార్) ఎవరు అన్నదే ఈ మూవీ కథ.
వంద కోట్లకుపైగా కలెక్షన్స్…
మదగజరాజాను రిలీజ్ చేయడానికి విశాల్ డిస్ట్రిబ్యూటర్‌గా మారారు. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో వంద కోట్లకుపైన వసూళ్లను రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నయి. మదగజరాజా ఓటీటీ హక్కులకు మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మదగజరాజా హిట్‌తో రిలీజ్ కాకుండా ఆగిపోయిన తమిళ సినిమాలను ప్రేక్షకుల ముందుకుతీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు మొదలుపెట్టారు.