Best Web Hosting Provider In India 2024
ఉదయాన్నే ఖాళీ పొట్టతో తినకూడని ఆహారాలు ఇవిగో, వీటిని తింటే ఈ ఆరోగ్యానికి ముప్పే
ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ కలిగి ఉన్న సమతుల్య ఆహారం తినడం చాలా అవసరం. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంతో పాటూ ఏకాగ్రతను మెరుగుపరచడానికి సహాయపడతాయి. కొన్ని రకాల ఆహరాలు మాత్రం పరగడుపున తింటే ఆరోగ్యాన్ని చెడగొడతాయి.
రాత్ర భోజనం చేశాక ఆ రాత్రంతా మన శరీరం ఉపవాసం ఉంటుంది. మరుసటి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినేదాకా ఉపవాసమనే చెప్పాలి. మరుసటి రోజు మన జీవక్రియ మరియు శక్తి స్థాయిలను ప్రారంభించడానికి శరీరానికి సరైన ఇంధనం అవసరం. కాబట్టి పరగడుపున అంటే ఖాళీ పొట్టతో మొదట ఏమి తింటున్నారో దానిపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. కొన్ని ఆహారాలు ఖాళీ కడుపుతో తినకుండా ఉండటం మంచిది. ఎందుకంటే అవి జీర్ణ సమస్యలు, పొట్ట ఉబ్బరం లేదా అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
ఉదాహరణకు, పరగడుపున ఆమ్ల ఆహారాలు తింటే పొట్టలోని పొరను చికాకుపెడతాయి. ఎసిడిటీకి దారితీస్తాయి. మరోవైపు, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ కలిగిన సమతుల్య అల్పాహారం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి, దృష్టి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి సహాయపడతాయి. మీరు ఉదయం మొదట తినవలసిన, తినకూడని కొన్ని ఆహారాలు ఇక్కడ ఉన్నాయి.
ఖాళీ పొట్టతో తినకూడని ఆహారాలు
కాఫీ: పరగడుపున కాఫీ తాగడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి పెరిగి కొంతమందిలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
స్పైసీ ఫుడ్స్: స్పైసీ ఫుడ్స్ పొట్ట పొరను చికాకుపెడతాయి. యాసిడ్ రిఫ్లక్స్ లేదా అజీర్ణానికి కారణమవుతాయి.
సిట్రస్ పండ్లు: పుల్లని సిట్రస్ పండ్లు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఖాళీ కడుపుతో తినేటప్పుడు కడుపును చికాకుపెడతాయి.
కార్బోనేటేడ్ పానీయాలు: కార్బోనేటేడ్ పానీయాలు గ్యాస్, పొట్ట ఉబ్బరానికి కారణమవుతాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తినేటప్పుడు సమస్య పెరిగిపోతుంది.
చక్కెర ఆహారాలు: చక్కెర ఆహారాలు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు త్వరగా పెరగడానికి కారణమవుతాయి. రోజంతా చక్కెర స్థాయిలు అధికంగానే ఉంటాయి. దీనివల్ల డయాబెటిస్ సమస్య పెరిగిపోతుంది.
వేయించిన ఆహారాలు: వేయించిన ఆహారాలలో అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. వీటిని ఖాళీ పొట్టతో తింటే సరిగా జీర్ణం కావు.
ఖాళీ పొట్టతో తినవలసిన ఆహారాలు
గోరువెచ్చని నిమ్మకాయ నీరు: ఖాళీ కడుపుతో గోరువెచ్చని నిమ్మకాయ నీరు త్రాగటం వల్ల మీ జీవక్రియను ప్రారంభించడానికి ఉత్తమ మార్గం. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఓట్ మీల్: ఓట్ మీల్ ఫైబర్ కు గొప్ప మూలం. ఉదయం పొట్ట నిండిన నిండిన అనుభూతిని కలిగించడంలో సహాయపడుతుంది.
గుడ్లు: గుడ్లలో ప్రోటీన్, అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి సంతృప్తికరమైన, పోషకమైన అల్పాహారం అనే చెప్పుకోవాలి.
గ్రీన్ టీ: గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జీవక్రియను పెంచడానికి, కొవ్వును కరిగించడానికి సహాయపడతాయి.
బెర్రీలు: బెర్రీలలో కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉన్నందున, అవి బరువు పెరగకుండా అడ్డుకుంటుంది.
బాదం: బాదం ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఖాళీ కడుపుతో సంతృప్తికరమైన చిరుతిండిగా మారుతాయి.
చియా విత్తనాలు: చియా విత్తనాలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్ కు గొప్ప మూలం. ఇది మీ ఉదయాన్ని ఆరోగ్యంగా ప్రారంభించేందుకు మంచి ఎంపిక
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
టాపిక్