Best Web Hosting Provider In India 2024
OTT Crime Thriller: మరో ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ – గెస్ చేయలేని ట్విస్ట్‌లతో!
OTT Crime Thriller: తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ హైడ్ అండ్ సీక్ ఈటీవీ విన్ ఓటీటీలో జనవరి 24న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ థ్రిల్లర్ మూవీలో విశ్వాంత్, రియాసచ్‌దేవ్, శిల్పా మంజునాథ్ హీరోహీరోయిన్లుగా నటించారు.
తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ హైడ్ అండ్ సీక్ మరో ఓటీటీలోకి వస్తోంది. ఇటీవలే ఆహా ఓటీటీలో రిలీజైన ఈ మూవీ తాజాగా ఈటీవీ విన్‌లోకి రాబోతోంది. జనవరి 24 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుతున్నది.
సోషల్ మీడియా అనర్థాలతో…
హైడ్ అండ్ సీక్ మూవీలో విశ్వాంత్, రియాసచ్‌దేవ్, శిల్పా మంజునాథ్ హీరోహీరోయిన్లుగా నటించారు. బసిరెడ్డి రానా దర్శకత్వం వహించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది.
ఆన్‌లైన్స్ గేమ్స్‌కు బానిసలుగా మారితే…సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలుగా మారి యువత తమ జీవితాల్ని ఎలా నాశనం చేసుకున్నారనే పాయింట్‌కు సొసైటీలోని అసమానతల్ని జోడిస్తూ దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు.
శివ ఇన్వేస్టిగేషన్…
శివ (విశ్వాంత్) తండ్రితో పాటు అతడి బావ ఆర్మీలో పనిచేస్తారు. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తారు. వారి బాటలోనే మెడిసిన్ పూర్తిచేసి ఆర్మీలో డాక్టర్‌గా జాయిన్ కావాలని శివ కలలు కంటుంటాడు. శివ ఆర్మీకి వెళ్లడం అతడి అక్కకు ఇష్టం ఉండదు. తనతో పాటు కలిసి చదువుకునే వర్ష (రియా సచ్‌దేవ్)ను ప్రేమిస్తుంటాడు. వారి ప్రేమకు వర్ష తండ్రి కూడా ఆమోదం తెలుపుతాడు. శివ స్నేహితుడు చందుతో పాటు ఇంటిపక్కనే ఉండే ఓ డెలివరీ బాయ్ హత్యలకు గురవుతారు.
అవి సూసైడ్స్‌గా తేల్చిన పోలీసులు కేసును క్లోజ్ చేస్తారు. ఆత్మహత్యలు కాదని..హత్యలని శివ అనుమానిస్తాడు. శివ అనుమానాలు నిజమేనా? ఆన్‌లైన్ గేమ్స్ పేరుతో సిటీలో జరుగుతోన్న మర్డర్స్‌కు వర్ష తండ్రికి ఎలాంటి సంబంధం ఉంది? శివ సాయంతో పోలీస్ ఆఫీసర్ వైష్ణవి (శిల్పా మంజునాథ్) ఈ కేసును ఎలా సాల్వ్ చేసింది అన్నదే హైడ్ అండ్ సీక్ మూవీ కథ.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్…
హైడ్ అండ్ సీక్ మూవీకి లిజో కే జోష్ మ్యూజిక్ అందించాడు. తేజస్వి మదివాడ, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించారు.సక్సెస్ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా కెరీర్ ఆరంభం నుంచి హీరోగా డిఫరెంట్ సినిమాలు చేస్తోన్నాడు విశ్వాంత్. కేరింత మూవీతో కథానాయకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
మనమంతా, తోలు బొమ్మలాట, క్రేజీ క్రేజీ ఫీలింగ్, ఓ పిట్టకథతో పాటు హీరోగా పలు తెలుగు సినిమాల్లో కనిపించాడు. సంక్రాంతి రిలీజైన రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్‌లో కీలక పాత్ర పోషించాడు. గత ఏడాది అదాశర్మతో కలిసి సీడీ అనే హారర్ మూవీలో నటించాడు విశ్వాంత్.