Best Web Hosting Provider In India 2024
23 Jan 2025 1:03 PM
నేతాజీ జయంతి సందర్భంగా వైయస్ జగన్ ఘన నివాళులు
తాడేపల్లి: భారతదేశ స్వాతంత్ర్యం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన పోరాటం నేటి యువతకు ఆదర్శనీయమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొనియాడారు. ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి భారతీయుల్లో పోరాట స్ఫూర్తిని నింపిన యోధుడు ఆయన. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఘన నివాళులర్పిస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.