Best Web Hosting Provider In India 2024
SS Rajamouli: రాజమౌళి ఫేవరెట్ సాంగ్స్ 2- హీరోయిన్ డ్యాన్స్ కోసమే చాలా సార్లు చూశా! మహేశ్ బాబు, అల్లు అర్జున్ సినిమాలోవే!
Director SS Rajamouli Favourite 2 Songs And Heroine: దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో తెరకెక్కిస్తోన్న ఎస్ఎస్ఎంబీ 29తో బిజీగా ఉన్నారు. అయితే, రాజమౌళికి బాగా నచ్చిన రెండు సాంగ్స్, వాటిని కేవలం హీరోయిన్ డ్యాన్స్ కోసమే చూసినట్లుగా చెప్పారు జక్కన్న. ఆ వివరాల్లోకి వెళితే..!
Director SS Rajamouli Favourite 2 Songs And Heroine: దర్శక దిగ్గజం రాజమౌళి సినిమా కోసం ఎంతోమంది ప్రేక్షకులు, అభిమానులు ఎదురుచూస్తుంటారు. అంతేకాకుండా అనేక మంది హీరో హీరోయిన్స్ కూడా రాజమౌళి సినిమాల్లో నటించేందుకు తహతహలాడుతుంటారు.
నచ్చిన నటీనటుల గురించి
స్టార్ సెలబ్రిటీలు సైతం రాజమౌళి సినిమాలో ఓ స్పెషల్ రోల్ చేయాలని ఉవ్విలూరుతుంటారు. ఈ విషయాన్ని చాలా మంది సెలబ్రిటీలు పలు ఇంటర్వ్యూల్లో స్వయంగా చెప్పుకొచ్చారు. అయితే, అలాంటి రాజమౌళికి నచ్చిన హీరో, హీరోయిన్స్, యాక్టర్స్ కూడా ఉంటారు. పలు సందర్భాల్లో ఆయనకు నచ్చిన నటీనటుల గురించి చెప్పుకొచ్చారు.
హీరోయిన్ డ్యాన్స్ కోసమే
అయితే, తాజాగా రాజమౌళికి నచ్చిన రెండు సాంగ్స్‌కు సంబంధించిన ఓ షార్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో తనకు నచ్చిన 2 పాటలు, వాటిని కేవలం హీరోయిన్ డ్యాన్స్ కోసమే చాలా సార్లు చూసినట్లు స్టార్ డైరెక్టర్ రాజమౌళి చెప్పుకొచ్చారు. దీంతో గతంలోని ఆ వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.
సలార్ రిలీజ్ టైమ్‌లో
అయితే, ఈ వీడియో ప్రభాస్ సలార్ సినిమా సమయంలోనిది. సలార్ మూవీ రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లను రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. ఆ టైమ్‌లో తను మెచ్చిన రెండు పాటల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు జక్కన్న.
ఎక్కువగా చూసినవి శ్రుతి హాసన్‌వి
“నా ఫోన్‌లో కానీ, టీవీలో కానీ నేను ఎక్కువగా చూసిన రెండు సాంగ్స్ శ్రుతి హాసన్‌వి. రేసు గుర్రం సినిమా నుంచి పార్టీ సాంగ్ (డౌన్ డౌన్ డప్పా) ఒకటి, మరోటి శ్రీమంతుడు మూవీలోని చారుశీల. ఐ జస్ట్ లవ్ హర్ డ్యాన్సింగ్ (తన డ్యాన్స్ నాకు చాలా నచ్చింది). ఆ రెండు సాంగ్సే నేను మళ్లీ మళ్లీ ఎక్కువగా చూసినవి” అని రాజమౌళి చాలా ఇంటెన్సివ్‌గా ఎంతో ఇష్టంతో చెప్పారు.
చాలా నిరాశపరిచింది
“మీరు (ప్రశాంత్ నీల్) ఇందాక బయట కారిడార్‌లో చెప్పారు. మీరు ఎలాంటి డ్యూయెట్ సాంగ్స్ సినిమాలో చేయలేదు అని. అది నన్ను చాలా నిరాశపరిచింది” అని డైరెక్టర్ రాజమౌళి నవ్వుతూ చెప్పారు. తనను నిరాశపరిచిందని జక్కన్న చెప్పారంటే శ్రుతి హాసన్ డ్యాన్స్ తనకెంతో నచ్చిందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
అల్లు అర్జున్ అండ్ మహేశ్ బాబు
రాజమౌళి మాటలకు “అయ్యో నన్ను క్షమించండి. నేను అలా పాటలు పెట్టనందుకు” అన్నట్లుగా సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సారీ చెప్పారు. ఇదిలా ఉంటే, రాజమౌళికి నచ్చిన శ్రుతి హాసన్ సాంగ్స్‌లో ఒకటి డౌన్ డౌన్ డప్పా అల్లు అర్జున్ నటించిన రేసు గుర్రంలోనిది అయితే.. మరోటి మహేశ్ బాబు-కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన శ్రీమంతుడు మూవీలోనిది.
ఎస్ఎస్ఎంబీ29 హీరోయిన్
ఇక జక్కన్న రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఎస్ఎస్ఎంబీ 29 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా స్టోరీని చాలా పకడ్బందీగా రాస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఇటీవల ఎస్ఎస్ఎంబీ29 మూవీలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ఫిక్స్ అయిందని రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఈ సినిమా కోసమే అమెరికా నుంచి హైదరాబాద్‌కు ప్రియాంక చోప్రా వచ్చిందని పలు వార్తలు ప్రచురితం అయ్యాయి. అయితే, ఈ ఊహాగానాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
సంబంధిత కథనం