Best Web Hosting Provider In India 2024

తాడేపల్లి: కేసులు విచారణకు రాకుండా అడ్డుకోవడమే చంద్రబాబుకు తెలిసిన విద్య అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు . స్కిల్ స్కామ్‌లో సుధీర్ఘకాలం దర్యాప్తు జరిగాకే చంద్రబాబును అరెస్ట్ చేశారని చెప్పారు. లేని ప్రాజెక్టులు ఉన్నట్లు చూపించి ప్రజాధనం దోచేశారు. సాక్షులను చంద్రబాబు దేశాలను దాటించగలడు. పెండ్యాల శ్రీనివాస్, పార్థసాని ఇద్దరూ రాత్రికి రాత్రే దేశం వదిలి పారిపోయారు. ఐటీశాఖకు చంద్రబాబు పరిధులు చెబుతున్నారు. చంద్రబాబు దోచుకున్నారని జనం కూడా నిర్ధారణకొచ్చారని చెప్పారు. చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నేరం జరగలేదని చంద్రబాబు నిరూపించగలరా? అని ప్రశ్నించారు. ఊరు, పేరు లేకుండా అగ్రిమెంట్ తయారు చేశారని మండిపడ్డారు. సీమెన్స్ సంస్థ సైతం మాకు సంబంధం లేదని చెప్పిందని తెలిపారు.రూ. 300 కోట్లకుపైగా ప్రజాధనాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ స్కాంలో చంద్రబాబును సాక్ష్యాధారాలతోనే అరెస్ట్ చేశారు. అన్ని ఆధారలతోనే సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేసింది. ఫేక్ ఇన్వాయిస్‌తో నిధులు పక్కదారి పట్టించారు. అన్ని వేళ్లు చంద్రబాబు వైపే చూపిస్తున్నాయి. ఈడీ కూడా నలుగురిని అరెస్ట్ చేసింది. రూ. 300 కోట్లు జేబులో వేసుకోవడానికే స్కిల్ కుట్ర. ఈ స్కామ్‌కు సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబే. చంద్రబాబు అరెస్టులో కక్షసాధింపు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. బుధవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.