Best Web Hosting Provider In India 2024
Friday OTT Releases: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. ఈ తెలుగు మూవీ, సిరీస్ మిస్ కావద్దు
Friday OTT Releases: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. అందులో ఓ తెలుగు మూవీ, వెబ్ సిరీస్ మాత్రం ఆసక్తి రేపుతోంది. వీటిని అస్సలు మిస్ కాకుండా చూడండి.
Friday OTT Releases: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఈ వీకెండ్ కూడా కొన్ని కొత్త మూవీస్, వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాయి. వీటిలో తెలుగుతోపాటు పలు ఇతర భాషల కంటెంట్ కూడా ఉంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, ఆహా వీడియోలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో వీటిని చూడొచ్చు. వీటిలో తెలుగు మూవీ రజాకార్ తోపాటు వెబ్ సిరీస్ సివరపల్లి కూడా ఉన్నాయి.
శుక్రవారం ఓటీటీ రిలీజెస్
శుక్రవారం (జనవరి 24) వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి అడుగుపెట్టబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.
సివరపల్లి వెబ్ సిరీస్ – ప్రైమ్ వీడియో
హిందీలో మూడు సీజన్లు పాటు వచ్చి సూపర్ హిట్ అయిన పంచాయత్ వెబ్ సిరీస్ తెలుసు కదా. ఇప్పుడు సివరపల్లి పేరుతో దీనికి తెలుగు రీమేక్ వచ్చేస్తోంది. రాగ్ మయూర్ లీడ్ రోల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ శుక్రవారం (జనవరి 24) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులను బాగా నవ్విస్తోంది. హిందీలో చూడకపోతే మాత్రం తెలుగులో కచ్చితంగా ఈ సిరీస్ చూడండి.
రజాకార్ మూవీ – ఆహా వీడియో
గతేడాది మార్చి 24న థియేటర్లలో రిలీజైన మూవీ రజాకార్. ఈ హిస్టారికల్ డ్రామా పది నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఇప్పటికే ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్లకు ఈ సినిమా అందుబాటులోకి రాగా.. మిగిలిన వాళ్లకు శుక్రవారం (జనవరి 24) నుంచి రానుంది. అనసూయతోపాటు బాబీ సింహా, మకరంద్ దేశ్‌పాండే, తేజ్ సప్రులాంటి వాళ్లు ఇందులో నటించారు.
హిసాబ్ బరాబర్ – జీ5 ఓటీటీ
ప్రముఖ తమిళ నటుడు మాధవన్ లీడ్ రోల్లో నటించిన మూవీ హిసాబ్ బరాబర్. ఈ హిందీ సెటైరికల్ థ్రిల్లర్ మూవీని అశ్విని ధిర్ డైరెక్ట్ చేశాడు. మాధవన్ తోపాటు నీల్ నితిన్ ముకేశ్, కీర్తి కుల్హరి నటించారు. ఈ సినిమా శుక్రవారం నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఓ చిన్న సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించిన ఓ రైల్వే టికెట్ చెకర్.. ఓ పెద్ద ఆర్థిక మోసాన్ని ఎలా బయటపెట్టాడన్నది ఇందులో చూడొచ్చు.
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ – ఈటీవీ విన్
ఈటీవీ విన్ ఓటీటీలోకి శుక్రవారం వస్తున్న తెలుగు కామెడీ థ్రిల్లర్ మూవీ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. వెన్నెల కిశోర్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ కాగా.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి అడుగుపెడుతోంది.
స్వీట్ డ్రీమ్స్ – హాట్‌స్టార్
హాట్‌స్టార్ లోకి శుక్రవారం వస్తున్న రొమాంటిక్ మూవీ స్వీట్ డ్రీమ్స్. అమోల్ పరాషర్, మిథిలా పాల్కర్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాను విక్టర్ ముఖర్జీ డైరెక్ట్ చేశాడు. ఒకరి గురించి మరొకరు కలలు కనే ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు.. చివరికి ఎలా ప్రేమలో పడ్డారన్నది ఈ మూవీ స్టోరీ. వాళ్ల కల నిజమెలా అయిందన్నది ఇందులో చూడొచ్చు.
ది స్మైల్ మ్యాన్ – ఆహా తమిళం
శ్యామ్-ప్రవీణ్ డైరెక్ట్ చేసిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ది స్మైల్ మ్యాన్. శరత్ కుమార్ లీడ్ రోల్లో నటించాడు. అల్జీమర్స్ తో బాధపడే ఓ పోలీస్ అధికారి చుట్టూ తిరిగే కథ ఇది. అలాంటి ఆఫీసర్ ఓ సీరియల్ కిల్లర్ కేసును పరిష్కరిస్తూ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడన్నది చూడొచ్చు. ఆహా తమిళం ఓటీటీలోకి ఈ సినిమా రానుంది.
ది ట్రామా కోడ్: హీరోస్ ఆన్ కాల్ – నెట్‌ఫ్లిక్స్
కొరియన్ మెడికల్ డ్రామా వెబ్ సిరీస్ ది ట్రామా కోడ్: హీరోస్ ఆన్ కాల్. లీ డూ-యూన్ డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. కే-డ్రామాస్ ఇష్టపడే వారు ఈ సిరీస్ మిస్ కావద్దు.
సంబంధిత కథనం
టాపిక్