Best Web Hosting Provider In India 2024
Aloo Fry: కరకరలాడేలా ఆలూ ఫ్రై ఇలా చేసేయండి, పిల్లలకు ఎంతో నచ్చుతుంది
Aloo Fry: ఆలూ ఫ్రై పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టం. కానీ కొంతమంది కరకరలాడేలా చేయలేరు. అలాంటి వారికే ఇక్కడ మేము రెసిపీ ఇచ్చాము.
ఆలూ ఫ్రై పేరు చెబితేనే కొందరికి నోరూరిపోతుంది. పిల్లలకు ఇంకా నచ్చుతుంది. ఆలూ ఫ్రై కరకరలాడేలా ఎలా చేయాలో ఇక్కడ చెప్పాము. ఈ రెసిపీ ఫాలో అయితే మీరు చాలా సులువుగా పిల్లలకు నచ్చేలా క్రిస్పీ ఆలూ ఫ్రై చేయవచ్చు. దీన్ని చేయడం చాలా సులువు ఎలా చేయాలో తెలుసుకోండి.
క్రిస్పీగా ఆలూ ఫ్రై రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బంగాళాదుంపలు – నాలుగు
ఎండుమిర్చి – ఆరు
ధనియాలు – ఒక స్పూను
జీలకర్ర – ఒక స్పూను
మినప్పప్పు – రెండు స్పూన్లు
నీళ్లు – తగినన్ని
ఆవాలు -అర స్పూను
వెల్లుల్లి రెబ్బలు – నాలుగు
కరివేపాకులు – గుప్పెడు
ఇంగువ – చిటికెడు
ఉప్పు – రుచికి సరిపడా
పసుపు – పావు స్పూను
కారం – అర స్పూను
మ్యాగీ మసాలా – ఒక స్పూను
క్రిస్పీ ఆలూ ఫ్రై రెసిపీ
1. బంగాళదుంప ఫ్రై క్రిస్పీగా క్రంచీగా రావడానికి పిల్లలకు నచ్చేలా కొత్తగా చేయడానికి ఇక్కడ రెసిపీ ఇచ్చాము.
2. ముందుగా బంగాళాదుంపలను పైన పొట్టు తీసి చిన్న ముక్కలుగా కోసుకోండి.
3.వాటిని నీటిలో వేసి కాసేపు వదిలేయండి.
4.ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి మినప్పప్పు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించండి.
5. వాటిని పొడి చేసి పక్కన పెట్టుకోండి.
6. ఇప్పుడు బంగాళదుంపలను ఒక గిన్నెలో వేసి మంచినీళ్లు వేసి స్టవ్ మీద పెట్టి పది నిమిషాలు ఉడికించండి.
7. తర్వాత వాటిని వడకట్టి తీసి పక్కన పెట్టండి.
8.ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయండి.
9. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి, గుప్పెడు కరివేపాకులు వేసి వేయించండి.
10. అందులోనే ముందుగా కాసేపు ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసి వేయించండి.
11. వేయిస్తున్నప్పుడు మూత పెట్టకండి. చిన్న మంట మీద వేయిస్తూ ఉండండి.
12.ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసి కలపండి.
13. అలాగే కారం కూడా వేసి బాగా కలుపుకోండి. బంగాళదుంపలు రంగు మారేవరకు వేయించండి.
14. తర్వాత ముందుగా పొడి చేసి పెట్టుకున్న మినప్పప్పు పొడిని వేసి బాగా కలుపుకోండి.
15. అలాగే ఒక స్పూను మ్యాగీ మసాలా పొడిని కూడా వేసి బాగా కలపండి.
16. అంతే టేస్టీ క్రిస్పీ ఆలూ ఫ్రై రెడీ అయినట్టే.
17. దీన్ని చిన్న మంట మీద క్రిస్పీగా అయ్యేవరకు వేయించుకోవాలి.
18. కాబట్టి ఓపిక ఎంతో అవసరం. ఇప్పుడు దీన్ని తింటే చాలా రుచిగా ఉంటుంది.
19.పైన మూత పెట్టకుండా ఉంచితే ఇవి మెత్త పడకుండా క్రంచీగా అలాగే ఉంటాయి.
పిల్లలకు, పెద్దలకు కూడా ఈ క్రిస్పీ ఆలూ ఫ్రై ఖచ్చితంగా నచ్చుతుంది. ముఖ్యంగా పిల్లలు ఒక్కసారి తిన్నారంటే పదేపదే కావాలని మారాం చేస్తారు. రెసిపీకి కూడా ఇది అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి దీన్ని చేసుకొని చూడండి. ఇది మీకు కచ్చితంగా నచ్చడం ఖాయం.
సంబంధిత కథనం