AP Fisheries Training: 5వ తరగతి విద్యార్హతతో చేపల పెంపకంలో శిక్షణ..నేషనల్ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌లో అవకాశం

Best Web Hosting Provider In India 2024

AP Fisheries Training: 5వ తరగతి విద్యార్హతతో చేపల పెంపకంలో శిక్షణ..నేషనల్ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌లో అవకాశం

 

AP Fisheries Training: 5వ తరగతి విద్యార్హతతో చేపల పెంపకంలో మెళకువలు నేర్చుకునేందుకు నేషనల్ ఫిషరీస్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏలూరు జిల్లా బాదంపూడిలో ఉన్న దేశీయ జల మత్స్య సంవర్థన శిక్షణా కేంద్రంలో ఈ శిక్షణ అందిస్తారు.

 
ఏలూరులో  చేపల పెంపకంలో శిక్షణకు దరఖాస్తులు
ఏలూరులో చేపల పెంపకంలో శిక్షణకు దరఖాస్తులు

AP Fisheries Training: ఏలూరు జిల్లా, బాదంపూడిలో ఉన్న  దేశీయ జల మత్స్య సంవర్ధన శిక్షణా కేంద్రంలో చేపల పెంపకంపై శిక్షణా తరగతులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 5వ తరగతి విద్యార్హతతో ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చు.   135వ బ్యాచ్‌లో  శిక్షణ పొందడానికి  అభ్యర్ధులు 19 ఫిబ్రవరి, 2025 వ తేదీలోగా వారి దరఖాస్తులను మత్స్యశాఖ సహాయ సంచాలకులు, బాదంపూడి, ఉంగుటూరు మండలం, ఏలూరు జిల్లాకు పంపాల్సి ఉంటుంది. 

5వ తరగతి ఆ పైన చదువుకున్న వారికి ప్రాదాన్యత ఇస్తారు. తెలుగులో చదవడం, రాయడం తెలిసిన వారికి అవకాశం  ఉంటుంది.  18 సంవత్సరములు నుండి 30 సంవత్సరములు మధ్య వయస్సు గల వారు ఈ శిక్షణకు అర్హులుగా ప్రకటించారు. ఎంపిక కమిటీ ప్రత్యేక పరిగణనలో వయస్సు పరిమితిని సడలించవచ్చును. దరఖాస్తులతో పాటు జిల్లా  మత్స్యశాఖ ఏడీ జారీ చేసిన అనుభవ సర్టిఫికెట్లు జత చేయాల్సి ఉంటుంది. 

ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలోని వారికి, మత్స్యకారులు, యువకులు, జాలరులు, సహకార సంఘముల సభ్యులు చేపల పెంపకంలో  ఆసక్తి కలిగిన ఇతరులు, షెడ్యూల్డ్ కులములు మరియు షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు ఈ శిక్షణ పొందుటకు అర్హులుగా  పేర్కొన్నారు.

ఉపకార వేతనము లేకుండా, ఇందులో చేరడానికి 20 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 20వ తేదీన  ఉదయం 11.00 గంటలకు ఇంటర్వ్యూలను బాదంపూడి లో నిర్వహిస్తారు.  ఇంటర్వ్యూలో ఎంపిక అయిన వారి పేర్లు అదే రోజు సాయంత్రం 4.00 గంటలకు కార్యాలయం నోటీసు బోర్డులో ఉంచుతారు. 

ఎంపిక అయిన అభ్యర్థులకు 2025 మార్చి 1 నుంచి మే  31  వరకు శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. శిక్షణా కాలంలో మత్స్య క్షేత్రాలు, రిజర్వాయర్లలో చేపలు పెంపకము గురించి భోదన మరియు ప్రాక్టికల్ తో కూడిన కోర్సు బోధిస్తారు.  శిక్షణాంతరము పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేస్తారు. 

 

అభ్యర్ధి బయోడేటాలను స్వదస్తూతో లేదా టైప్ చేసి గాని దరఖాస్తులు ఫిబ్రవరి 19  లోగా చేరాల్సి ఉంటుంది. సదరు దరఖాస్తు ఫారాలను  సంబంధిత జిల్లా మత్స్యశాఖ అధికారి, ఏలూరు లేదా మత్స్యశాఖ సహాయ సంచాలకులు, బాదంపూడి వారి కార్యాలయములో కూడా జారీ చేస్తారు.  ఇంటర్వ్యూకు హాజరుయ్యే అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాల్సి ఉంటుంది. 

ఇతర వివరములకు మత్స్య శాఖ సహాయ సంచాలకులు, బాదంపూడి (సెల్ నెం. 9573337484) మత్స్యశాఖ అధికారి, బాదంపూడి- 1 (సెల్ నెం. 7286993033), మత్స్యశాఖ అధికారి, బాదంపూడి- 2 (సెల్ నెం. 9492337469) వారిని కార్యాలయము పనివేళ్లల్లో సంప్రదించాలని సూచించారు. 

Whats_app_banner
 

టాపిక్

 
 
EducationEmployeesGovernment Of Andhra PradeshCoastal Andhra PradeshTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024