Best Web Hosting Provider In India 2024
POPSK in Araku : ఏజెన్సీ వాసుల కష్టాలకు చెక్ – అరకులో పాస్‌పోర్ట్ సేవాకేంద్రం
గిరిజన ప్రాంతమైన అరకులో పోస్ట్ ఆఫీస్ పాస్ పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభమైంది. ఈ కేంద్రం ఏర్పాటుతో పాస్ పోర్ట్ సేవలు ఈ మారుమూల ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ కేంద్రంలో దేశంలో పోస్ట్ ఆఫీస్ పాస్ పోర్ట్ సేవా కేంద్రాల సంఖ్య 443కు చేరింది.
ైట్ఏ పీలోని ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని గిరిజనులకు శుభవార్త వచ్చేసింది. అరకు కేంద్రంగా పాస్ పోర్ట్ సేవా కేంద్రం ప్రారంభమైంది. ఫలితంగా ప్రతి రోజూ 40 నుంచి 50 మధ్య స్లాట్‌లు అందుబాటులోకి వచ్చాయి. నేటి నుంచే పాస్‌పోర్ట్ కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కూడా అధికారులు కల్పించారు.
ప్రస్తుతం ఏర్పాటు చేసిన ఈ కేంద్రం… అరకు లోయలోని బ్రాంచి పోస్టాఫీస్ ఆవరణలో ఉంది. ఈ కేంద్రం ఏర్పాటుతో ఏజెన్సీ ఏరియాలో పాస్ పోర్టు సేవలు కూడా అందుబాటులోకి వచ్చినట్లు అయింది. దీంతో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అల్లూరి జిల్లా వాసులు గతంలో పాస్‌పోర్టు కావాలంటే దాదాపు 120 కిలోమీటర్ల దూరంలోని విశాఖపట్నం వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అయితే తాజాగా అరకు కేంద్రంగా పాస్ పోర్టు కేంద్రం రావటంతో ఏజెన్సీ వాసులకు కష్టాలు తప్పినట్లు అయింది.
పాస్ పోర్టు కోసం దరఖాస్తు ఇలా…
పాస్ట్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు http://www.passportindia.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవచ్చు. ప్రాసెస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా… బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది. స్థానిక పోలీసులు వెరిఫికేషన్ చేసి క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని అర్హతలు ఉంటే పాస్ పోర్టు మంజూరు అవుతుంది. విదేశీ ప్రయాణాలకు పాస్ పోర్టు తప్పనిసరి.
ఇక అత్యవసర పరిస్థితుల్లో అతి తక్కువ సమయంలో పాస్ పోర్ట్ పొందేందుకు… తత్కాల్ పాస్ పోర్ట్ విధానం ఉపయోగపడుతుంది. తత్కాల్ పాస్ పోర్టును ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గా ఉంటే ఇంటర్వ్యూ అయిన వారం రోజుల్లో పాస్ పోర్ట్ ఇంటికి వచ్చేస్తుంది.
దరఖాస్తు ప్రాసెస్….
Step 1 : తత్కాల్ పాస్‌పోర్ట్ ద్వారా కొత్తగా దరఖాస్తు చేసుకోవడం లేదా ఇప్పటికే ఉన్న పాస్‌పోర్ట్‌ను పునరుద్ధరించడం కోసం ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుని, ఫీజులు చెల్లించాలి. వ్యక్తిగత ఇంటర్వ్యూ కోసం అపాయింట్‌మెంట్ తీసుకోవాలి.
Step 2 : హోంపేజీలో న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి దరఖాస్తుదారుడి వివరాలు, ఈ-మెయిల్ ఐడీతో నమోదు చేసుకోండి.
Step 3 : రిజిస్ట్రేషన్ తర్వాత పాస్‌పోర్ట్ పోర్టల్‌కు లాగిన్ అవ్వాలి. హోమ్‌పేజీలో ‘ డౌన్‌లోడ్ ఇ-ఫారమ్ ‘ పై క్లిక్ చేసి అనంతరం ‘ఫ్రెష్ పాస్‌పోర్ట్ ‘ ఆప్షన్ ఎంచుకోండి Step 4 : ఆ తర్వాత మోడ్‌లో ‘ తత్కాల్’ ఎంచుకోండి.
Step 5 : డౌన్‌లోడ్ చేసిన ఈ-ఫారమ్‌లో వివరాలు నమోదు చేయాలి. వ్యాలిడేట్ చేసి, సేవ్ చేయండి. అనంతరం XML ఫైల్ జనరేట్ అవుతుంది.
Step 6 : ఆ తర్వాత ‘అప్‌లోడ్ ఈ-ఫారమ్’ ఆప్షన్ కు వెళ్లి XML ఫైల్‌ను అప్‌లోడ్ చేయండి.
Step 7 : పాస్‌పోర్ట్ సేవా కేంద్రం అపాయింట్‌మెంట్ తీసుకోవడానికి ‘పే అండ్ షెడ్యూల్ అపాయింట్‌మెంట్ ‘ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Step 8 : పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని ఎంచుకుని అపాయింట్మెంట్‌ను బుక్ చేసుకోండి. అనంతరం ఫీజు చెల్లించండి.
Step 9 : అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ లేదా అపాయింట్‌మెంట్ నంబర్ ఉన్న అప్లికేషన్ రసీదు జనరేట్ అవుతుంది. దానిని ప్రింట్ తీసుకోండి.
Step 10 : ప్రింటెడ్ అప్లికేషన్ ఫారమ్, ఒరిజినల్ డాక్యుమెంట్‌లతో పాస్ పోర్ట్ సేవా కేంద్రంలో ఇంటర్వ్యూకు హాజరవ్వండి.
సంబంధిత కథనం
టాపిక్