Davos AP Branding: ప్రపంచ వాణిజ్య సదస్సులో ఏపీ బ్రాండింగ్‌.. పెట్టుబడులను ఆహ్వానించిన చంద్రబాబు, ఆశావహంగా బాబు పర్యటన

Best Web Hosting Provider In India 2024

Davos AP Branding: ప్రపంచ వాణిజ్య సదస్సులో ఏపీ బ్రాండింగ్‌.. పెట్టుబడులను ఆహ్వానించిన చంద్రబాబు, ఆశావహంగా బాబు పర్యటన

Bolleddu Sarath Chand HT Telugu Jan 24, 2025 04:00 AM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Bolleddu Sarath Chandra HT Telugu
Jan 24, 2025 04:00 AM IST

Davos AP Branding: వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో ఏపీకి జవసత్వాలు కల్పించడంతో పాటు పెట్టుబడులను ఆకర్షించేలాలా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సాగింది. దావోస్‌లో నాలుగు రోజుల పర్యటన ముగించుకుని స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. ప్రభుత్వ పాలసీలు, అవకాశాలు, ఆలోచనలను వివరించి దిగ్గజ సంస్థలకు ఆహ్వానం పలికారు.

దావోస్‌లో ఏపీ బ్రాండింగ్‌, పెట్టుబడులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
దావోస్‌లో ఏపీ బ్రాండింగ్‌, పెట్టుబడులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

Davos AP Branding: ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం కోసం నెట్‌ వర్క్‌ను ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగు రోజుల దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ నాలుగు రోజులు ఒకవైపు ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈవోలు-అధిపతులతో, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే… మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో విరామం లేకుండా పాల్గొని ఆంధ్రప్రదేశ్‌ను, ఎపి బ్రాండ్ ను ముఖ్యమంత్రి ప్రమోట్ చేశారు.

yearly horoscope entry point

సమావేశాలు సఫలం :

ప్రపంచం దేశాల నుంచి దావోస్‌కు వచ్చిన పెట్టుబడిదారులను ఆకట్టుకోవడంలో చంద్రబాబు సంపూర్ణంగా సఫలమయ్యారు. వివిధ రంగాలకు చెందిన దాదాపు 15 ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. వాణిజ్యాభివృద్ధికి, పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్రం కొత్తగా తీసుకువచ్చిన పాలసీలు, స్వర్ణాంధ్ర-2047 ప్రణాళికలు… పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయసహకారాల గురించి వివరించారు.

రాష్ట్రానికి వచ్చి అనుకూలతలను ప్రత్యక్షంగా పరిశీలించాలని వారిని ఆహ్వానించారు. దీంతో పలు ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ఆసక్తి కనబరిచాయి. స్వయంగా రాష్ట్రంలో పర్యటించి పెట్టుబడుల అంశాలన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయా సంస్థలు సంసిద్ధతను వ్యక్తం చేశాయి.

పర్యటన మొదటి రోజు :

వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు తొలిరోజు పర్యటనలో ముందుగా జ్యూరిచ్‌లోని హిల్టన్ హోటల్‌లో స్విట్జర్లాండ్‌లోని భారత అంబాసిడర్‌ మృధుల్ కుమార్‌తో సమావేశమై రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫార్మాస్యుటికల్స్, మెడికల్ డివైజ్‌లు, టెక్నికల్ టెక్స్‌టైల్స్, రైల్ కాంపోనెంట్ వంటి తయారీ రంగంలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీ, స్విట్జర్లాండ్‌ యూనివర్సిటీలు.. ఏపీలో ఏర్పాటు చేస్తున్న స్కిల్లింగ్, ఏఐ యూనివర్సిటీకి కలిసి పనిచేసేలా చూడాలని మృధుల్ కుమార్‌కు చెప్పారు.

స్విస్‌మెన్, ఓర్లికాన్, ఆంగ్స్ట్ ఫిస్టర్, స్విస్ టెక్స్‌టైల్స్ సీఈవోలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు.

జ్యూరిచ్‌లో అపూర్వ స్వాగతం :

దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు ముందుగా జ్యూరిచ్‌ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అధికారుల బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో అపూర్వ స్వాగతం లభించింది. పెద్దఎత్తున తరలివచ్చిన యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు.

పర్యటన రెండవ రోజు:

పర్యటన రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు.. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ప్రత్యేక సెషన్‌లో గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్‌పై ప్రసంగించారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో విజయం సాధించి… గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదిగే సత్తా భారతీయల్లో ఉందన్నారు. మానవ వనరుల లభ్యత ఏపీకి ప్లస్ పాయింట్ అని, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతోమంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతున్నారని, తమ ప్రతిభతో రాణిస్తున్నారని అన్నారు.

ఆసక్తి చూపిన ‘మార్స్క్’: ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీలలో ఒకటైన డెన్మార్క్‌కు చెందిన మార్స్క్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది. డేటా సెంటర్లు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో పేరున్న మల్టీ-నేషనల్ టెక్నాలజీ సంస్థ సిస్కో చైర్మన్, సీఈవో చుక్ రాబిన్స్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. విశాఖ లేదా తిరుపతిలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటుతో పాటు, నెట్‌వర్క్ భాగాల తయారీకి ఆహ్వానించారు.

ఎల్జీ కెమ్ : దక్షిణ కొరియాలో అతిపెద్ద కెమికల్ కంపెనీ అయిన ఎల్జీ కెమ్ లిమిటెడ్ సీఈవో షిన్ హక్ చియోల్‌తో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి ఎల్జీ కెమ్‌ అనుబంధ సంస్థ ఎనర్జీని రాష్ట్రంలో నెలకొల్పాల్సిందిగా కోరారు.

కార్ల్స్‌బెర్గ్ గ్రూప్: పళ్ల రసాలు, శీతల పానీయాలు, బీర్లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌, ఉత్పత్తి చేసే కార్ల్స్ బెర్గ్ గ్రూప్ సీఈవో జాకబ్ ఆరుప్ ఆండర్సన్‌తోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. ఇంటిగ్రేటెడ్ బ్రూవరీ, బాట్లింగ్ యూనిట్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయమని అభ్యర్థించారు.

ఆర్సెల్లార్ మిట్టల్‌ ప్రాజెక్టు: అనకాపల్లిలో రూ. 1.4 లక్షల కోట్ల పెట్టుబడితో 17.8 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్టుపై ఆర్సెలార్ మిట్టల్/నిప్పన్ స్టీల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ ఎన్. మిట్టల్, సీఈవో ఆదిత్య మిట్టల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చించారు.

పర్యటన మూడవ రోజు :

గూగుల్ క్లౌడ్ : సర్వర్ల కోసం సొంత చిప్‌లను రూపొందిస్తున్న గూగుల్ విశాఖలో డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌ను కోరారు. గూగుల్ క్లౌడ్ తన సర్వర్ సప్లై చైన్‌ అనుసంధానించేలా తయారీ యూనిట్‌ను ఏపీలో నెలకొల్పాలని థామస్ కురియన్‌కు ముఖ్యమంత్రి సూచించారు. సర్వర్ నిర్వహణ సేవల విషయంలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని అన్నారు.

పెట్రోనాస్ : మలేషియాకు చెందిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ చీఫ్ ఎగ్జీక్యూటివ్ ఆఫీసర్ ముహమ్మద్ తౌఫిక్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న పెట్రోనాస్ కాకినాడ ప్లాంటులో రూ. 13,000 కోట్ల నుంచి రూ. 15,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.

పెప్సీకో : ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫుడ్ బెవరేజెస్‌గా ఉన్న పెప్సీకో ఇంటర్నేషనల్ బెవరేజస్ సీఈవో యూజీన్ విల్లెంసెన్, పెప్సీకో ఫౌండేషన్ చైర్మన్ స్టీఫెన్ కెహోతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఇప్పటికే ఏపీలోని శ్రీసిటీలో బాటిలింగ్ ప్లాంట్ నిర్వహిస్తున్న పెప్సికో బెవరేజెస్… విశాఖపట్నాన్ని గ్లోబల్ డెలివరీ సెంటర్‌గా చేసుకుని పెప్సీకో డిజిటల్ హబ్‌ను ఏర్పాటు చేయవచ్చని ముఖ్యమంత్రి సూచించారు.

బిల్‌గేట్స్‌తో భేటీ : ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌ ఫౌండర్‌ బిల్ గేట్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్ధించారు.

హిందుస్థాన్ యూనిలీవర్‌ : ఫుడ్, హోమ్ కేర్, బ్యూటీ, పర్సనల్ కేర్ సంబంధిత ఉత్పత్తులకు పేరున్న సంస్థ యూనిలీవర్ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉజ్జెన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరిపారు. ఏపీలో రూ.330 కోట్లతో పామాయిల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని భావిస్తున్న యూనిలీవర్‌ను బ్యూటీ పోర్ట్‌ఫోలియోకు సంబంధించి టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు విశాఖపట్నం అనుకూలంగా వుంటుందని సీఎం అన్నారు.

డీపీ వరల్డ్‌ : ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటుకు ముందుకురావాలని ప్రపంచంలో కంటైనర్ టెర్మినల్‌లో ప్రతిష్టాత్మక సంస్థ డీపీ వరల్డ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు.

ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు

దావోస్ నుంచి రాష్ట్రానికి తిరిగి వచ్చే ముందుక్షణం వరకు ముఖ్యమంత్రి వివిధ సంస్థల అధిపతులు, వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమై రాష్ట్రాభివృద్ధి కోసం వారితో చర్చలు జరుపుతూనే ఉన్నారు. ప్రఖ్యాత స్విస్ వ్యవస్థాపకుడు, పర్యావరణవేత్త, చె హోల్డింగ్స్‌ వైస్-ఛైర్మన్ ఆండ్రే హాఫ్‌మన్‌తో భేటీ అయ్యారు. అలాగే యూఎన్‌డీపీ అధిపతి అచిమ్ స్టెయినర్, సీఎన్ఎన్ బెకీ ఆండర్సన్‌తోనూ చర్చించారు.అనంతరం సిఎం బృందం దావోస్ నుంచి జ్యూరిచ్ కు రోడ్డు మార్గంలో చేరుకున్నారు. అక్కడి నుంచి అర్ధరాత్రి తరువాత సిఎం ఢిల్లీ చేరుకున్నారు. మంత్రి లోకేష్ మరో రోజు అదనంగా దావోస్ లో ఉండనున్నారు. ఈ రోజు మరికొంత మంది పారిశ్రామిక వేత్తలతో భేటీ అనంతరం రేపు లోకేష్ తిరుగుప్రయాణం కానున్నారు. నాలుగవసారి సిఎం అయిన తరువాత చేపట్టిన తొలి విదేశీ పర్యటన సంతృప్తినిచ్చిందని…రానున్న రోజుల్లో ఈ చర్చలు మంచి ఫలితాలను ఇస్తాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

Whats_app_banner

టాపిక్

TdpChandrababu NaiduNri NewsTeluguZee TeluguTelugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024