Best Web Hosting Provider In India 2024
OTT Trending: ఓటీటీ ట్రెండింగ్‌లో కామెడీ ఫాంటసీ థ్రిల్లర్- బంగారాన్ని రక్షించే 400 ఏళ్లనాటి భూతం- తెలుగులో స్ట్రీమింగ్!
Barroz 3D OTT Streaming And Trending In Top 1: ఓటీటీలో కామెడీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ బరోజ్ 3డీ టాప్ 1 స్థానంలో ట్రెండింగ్‌లో అవుతోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మొదటిసారిగా డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు, మలయాళం, తమిళంతోపాటు ఓవరాల్ ఇండియాలో టాప్ 1 ఓటీటీ ట్రెండింగ్‌లో నిలిచింది.
Barroz 3D OTT Release And Trending Top 1: ఓటీటీలోకి ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు వస్తుంటాయి. అయితే, వాటిలో కొన్ని మాత్రమే ఓటీటీ ఆడియెన్స్ ఆదరణ పొంది టాప్‌లో దూసుకుపోతుంటాయి. కొన్నిసార్లు థియేటర్లలో హిట్ అయిన సినిమాలు మాత్రమే కాకుండా ప్లాప్‌గా నిలిచిన చిత్రాలు సైతం విచిత్రంగా ట్రెండింగ్‌లో దూసుకుపోతుంటాయి.
విపరీతమైన అంచనాలు
అలాంటి సినిమానే బరోజ్ త్రీడీ. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తొలిసారిగా దర్శకత్వం వహించిన కామెడీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ బరోజ్. దృశ్యం సిరీస్, లూసిఫర్, నెరు వంటి సినిమాలతో హీరోగా అలరించిన మోహన్ లాల్ మొదటిసారిగా మెగా ఫోన్ పట్టుకున్నారు. దాంతో బరోజ్ 3డీపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి.
ఐదు భాషల్లో రిలీజ్
అలాగే, బరోజ్ త్రీడి ట్రైలర్, టీజర్, పోస్టర్స్ క్యూరియాసిటీ కలిగించాయి. మోహన్ లాల్ నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన ‘బరోజ్ 3డీ: గార్డియన ఆఫ్ ట్రెజరర్” మూవీని త్రీడీలో ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మించారు. ఈ సినిమాను మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.
150 కోట్ల బడ్జెట్
గతేడాది అంటే 2024లో డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా బరోజ్ 3డి చిత్రం గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. అయితే, ఊహించినంతగా అంచనాలను అందుకోలేకపోయింది ఈ సినిమా. సుమారు రూ. 150 కోట్ల బడ్జెట్‌తో తెరక్కిన బరోజ్ సినిమాకు మిశ్రమ స్పందనలతోపాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా అంతంతమాత్రంగానే వచ్చాయి.
400 ఏళ్లుగా రక్షించే భూతం
దాంతో బాక్సాఫీస్ వద్ద బరోజ్ మూవీ ప్లాప్‌గా నిలిచింది. అయితే, బరోజ్ సినిమాలో మోహన్ లాల్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని సినిమా ప్రమోషన్స్‌లో చెప్పుకొచ్చారు. బరోజ్‌లో వాస్కోడిగామా నిధిని రక్షించే జీనీగా మోహన్ లాల్ నటించారు. వాస్కోడిగామాకు చెందిన అపార సంపదైన బంగారం, వజ్రాలను బరోజ్ అనే భూతం 400 ఏళ్లుగా రక్షిస్తూ ఉంటుంది.
ఆసక్తికర అంశాలు
ఆ నిధిని వాస్కోడిగామాకు చెందిన నిజమైన వారసులకు అప్పగించాలని ఆ భూతం ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఆ భూతం కంటా ఓ చిన్న పిల్ల తారసపడుతుంది. ఆ తర్వాత ఏమైంది?, ఆ చిన్నపిల్ల ఎవరు? వాస్కోడిగామా సంపదను బరోజ్ భూతం కాపాడాడా? వాస్కోడిగామా వారసులకు ఆ నిధి చేరిందా? అనే అంశాలతో బరోజ్ త్రీడీ సినిమా ఉంటుంది.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో
కాగా బరోజ్ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా జనవరి 22 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. చడీచప్పుడు లేకుండా ఓటీటీ రిలీజ్ అయిన బరోజ్ 3డీ మొదటి రోజు నుంచే ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. జనవరి 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో టాప్ 1 ప్లేసులో బరోజ్ ట్రెండ్ అవుతోంది.
టాప్ 1 ఓటీటీ ట్రెండింగ్
తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో సెపరేట్‌గా టాప్ 1లో ఓటీటీ ట్రెండింగ్‌లో ఉన్న బరోజ్ 3డీ సినిమా ఆల్ ఓవర్ ఇండియా వ్యాప్తంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతోంది. ఆ తర్వాత మరో మలయాళ ఫిల్మ్ సూక్ష్మదర్శిని నిలిచింది. అయితే, థియేటర్లలో ప్లాప్‌గా నిలిచిన బరోజ్ ఓటీటీ ట్రెండింగ్ టాప్‌లో దంచికొట్టడం విశేషం.
సంబంధిత కథనం