APSRTC : భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. కడప జిల్లా నుంచి అరుణాచలానికి స్పెష‌ల్ స‌ర్వీసులు

Best Web Hosting Provider In India 2024

APSRTC : భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. కడప జిల్లా నుంచి అరుణాచలానికి స్పెష‌ల్ స‌ర్వీసులు

 

APSRTC : ఆర్టీసీ నిత్యం కొత్త స‌ర్వీసుల‌ను అందుబాటులో తెస్తోంది. డిమాండ్‌ను బ‌ట్టి, ప్ర‌యాణీకులు, యాత్రీకులు అత్య‌ధికంగా వెళ్లే మార్గాల‌కు అతిత‌క్కువ ధ‌ర‌కు, సుర‌క్షిత‌మైన ప్ర‌యాణాన్ని అందిస్తుంది. అందులో భాగంగానే త‌మిళ‌నాడులోని అరుణాచ‌లం (తిరువ‌ణ్ణామ‌లై)కి ఆరు స‌ర్వీస్‌లను అందుబాటులోకి తెచ్చింది.

 
ఏపీఎస్ ఆర్టీసీ
ఏపీఎస్ ఆర్టీసీ
 

ప్రముఖ పుణ్య‌క్షేత్రం అరుణాచ‌లం వెళ్లే భ‌క్తుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రోడ్డు ర‌వాణ సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) శుభ‌వార్త చెప్పింది. పౌర్ణ‌మిని పుర‌స్క‌రించుకుని అరుణాచ‌లం గిరి ప్ర‌ద‌క్ష‌ిణ‌కు స్పెష‌ల్ స‌ర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. క‌డప జిల్లాలోని ఆరు డిపోల‌ నుంచి త‌మిళ‌నాడులోని అరుణాచ‌లం (తిరువ‌ణ్ణామ‌లై)కి స్పెష‌ల్ సూప‌ర్ ల‌గ్జ‌రీ, అల్ట్రాడీల‌క్స్‌ బ‌స్ స‌ర్వీస్‌ల‌ను నడుపుతోంది. ఈ స‌ర్వీస్‌ల‌ను యాత్రికులు వినియోగించుకోవాల‌ని కోరుతోంది.

ప్యాకేజీలు..

1. క‌డ‌ప- ఆర్టీసీ సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సు స‌ర్వీస్ (పుష్‌బ్యాక్ 2+2) సీట్ల‌తో క‌డ‌ప డిపో నుంచి అందుబాటులో ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి 11న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు క‌డ‌ప బ‌స్ కాంప్ల‌క్స్‌లో బ‌స్ బ‌య‌లుదేరుతుంది. రాయ‌చోటి, చిత్తూరు, వేలూరు మీదుగా అరుణాచ‌లం చేరుకుంటుంది. టిక్కెట్టు ధ‌ర రెండు వైపుల క‌లిపి ఒక్కరికి రూ.1,072గా ఆర్టీసీ నిర్ణ‌యించింది.

2. బ‌ద్వేలు- అల్ట్రా డీల‌క్స్‌ బ‌స్సు స‌ర్వీస్ బ‌ద్వేలు డిపో నుంచి అందుబాటులో ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి 11న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు బ‌ద్వేలు బ‌స్ కాంప్ల‌క్స్‌లో బ‌స్ బ‌య‌లుదేరుతుంది. పెంచల‌కోన‌, శ్రీ‌కాళ‌హ‌స్తి, గోల్డెన్ టెంపుల్‌, కాణిపాకం మీదుగా అరుణాచ‌లం చేరుకుంటుంది. టిక్కెట్టు ధ‌ర రెండు వైపుల క‌లిపి ఒక్కరికి రూ.1,176గా ఆర్టీసీ నిర్ణ‌యించింది.

3. మైదుకూరు- ఆర్టీసీ సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సు స‌ర్వీస్ (పుష్‌బ్యాక్ 2+2) సీట్ల‌తో మైదుకూరు డిపో నుంచి అందుబాటులో ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి 11న సాయంత్రం 6 గంట‌ల‌కు పోరుమామిళ్ల‌లో బ‌స్ బ‌య‌లుదేరుతుంది. క‌డ‌ప‌, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్‌ మీదుగా అరుణాచ‌లం చేరుకుంటుంది. టిక్కెట్టు ధ‌ర రెండు వైపుల క‌లిపి ఒక్కరికి రూ.1,209గా ఆర్టీసీ నిర్ణ‌యించింది.

 

4. ప్రొద్దుటూరు- ఆర్టీసీ సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సు స‌ర్వీస్ (పుష్‌బ్యాక్ 2+2) సీట్ల‌తో ప్రొద్దుటూరు డిపో నుంచి అందుబాటులో ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి 11న సాయంత్రం 6 గంట‌ల‌కు ప్రొద్దుటూరు బ‌స్ కాంప్లెక్స్‌లో బ‌స్ బ‌య‌లుదేరుతుంది. మైదుకూరు, క‌డ‌ప‌ మీదుగా అరుణాచ‌లం చేరుకుంటుంది. టిక్కెట్టు ధ‌ర రెండు వైపుల క‌లిపి ఒక్కరికి రూ.1,273గా ఆర్టీసీ నిర్ణ‌యించింది.

5. పులివెందుల- ఆర్టీసీ అల్ట్రా డీల‌క్స్ స‌ర్వీస్ పులివెందుల‌ డిపో నుంచి అందుబాటులో ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి 11న ఉద‌యం 7 గంట‌ల‌కు పులివెందుల‌ బ‌స్ కాంప్లెక్స్‌ నుంచి బ‌య‌లుదేరుతుంది. రాయ‌చోటి, పీలేరు మీదుగా అరుణాచ‌లం చేరుకుంటుంది. టిక్కెట్టు ధ‌ర రెండు వైపుల క‌లిపి ఒక్కరికి రూ.1,183గా ఆర్టీసీ నిర్ణ‌యించింది.

6. జ‌మ్మ‌ల‌మ‌డుగు- ఆర్టీసీ సూప‌ర్ ల‌గ్జ‌రీ బ‌స్సు స‌ర్వీస్ (పుష్‌బ్యాక్ 2+2) సీట్ల‌తో జ‌మ్మ‌ల‌మ‌డుగు డిపో నుంచి అందుబాటులో ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి 11న ఉద‌యం 7 గంట‌ల‌కు జ‌మ్మ‌ల‌మ‌డుగు బ‌స్ కాంప్లెక్స్‌లో బ‌స్ బ‌య‌లుదేరుతుంది. ప్రొద్దుటూరు, మైదుకూరు, క‌డ‌ప‌ మీదుగా అరుణాచ‌లం చేరుకుంటుంది. టిక్కెట్టు ధ‌ర రెండు వైపుల క‌లిపి ఒక్కరికి రూ.1,568గా ఆర్టీసీ నిర్ణ‌యించింది.

ముందే రిజర్వ్ చేసుకోవాలి..

పౌర్ణ‌మి రోజున అరుణాచలంలో గిరి ప్ర‌ద‌క్షిణ కోసం ఈ స‌ర్వీసుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని.. క‌డ‌ప జిల్లా ప్ర‌జా ర‌వాణాధికారి పొలిమేర గోపాల్‌రెడ్డి తెలిపారు. భ‌క్తులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. టిక్కెట్టు కావాల‌నుకునేవారు క‌డ‌ప జిల్లాలోని ఆయా బ‌స్సు డిపోల‌ను సంప్ర‌దించాలని చెప్పారు. భ‌క్తులు తమ టిక్కెట్ల‌ను ముందుగానే రిజ‌ర్వు చేసుకోవాల‌ని సూచించారు.

 

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner
 

టాపిక్

 
ApsrtcKadapaAndhra Pradesh News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024