Best Web Hosting Provider In India 2024
Indian students in US : ‘ట్రంప్’ భయంతో పార్ట్-టైమ్ ఉద్యోగాలను వదిలేస్తున్న భారత విద్యార్థులు..
Indian students in US : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపంలో ఆ దేశంలోని భారతీయ విద్యార్థులకు మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి! చాలా మంది ఇప్పుడు పార్ట్-టైమ్ ఉద్యోగాలను వదిలేస్తున్నారు.
అమెరికాలో సరైన ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న భారతీయ విద్యార్థులపై ‘ట్రంప్’ పిడుగు పడింది! అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. ఇమ్మిగ్రేషన్‌పై తన వైఖరిని స్పష్టంగా తెలియజేయడంతో భారతీయ విద్యార్థుల్లో ఆందోళనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో డిపోర్టేషన్ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు.. చాలా మంది తమ పార్ట్-టైమ్ ఉద్యోగాలను వదులుకుంటున్నారు.
అమెరికాలో భారతీయ విద్యార్థుల కష్టాలు..!
విదేశీ విద్యార్థుల పార్ట్-టైమ్ ఉద్యోగాలపై అమెరికాలో చాలా నిబంధనలు ఉంటాయి. ఎఫ్-1 వంటి వీసాలపై అమెరికాకు వెళ్లేవారికి క్యాంపస్‌లో మాత్రమే వారానికి 20 గంటలు పని చేసే అవకాశం లభిస్తుంది. కానీ చాలా మంది ఖర్చుల కోసం పార్ట్- టైమ్ ఉద్యోగాలు కూడా చేస్తుంటారు. ఈ విషయం బయటపడితే దేశం నుంచి వెళ్లిపోవాల్సిన ప్రమాదం కూడా ఉంటుంది.
ఇమ్మిగ్రేషన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా కఠినంగా ఉంటారు. ఆయన మొదటి అధ్యక్ష కాలంలోనే ఇది చాలా స్పష్టంగా కనిపించింది. ఇక రెండో టర్మ్‌లో మరిన్ని కఠిన చర్యలు చేపట్టే అవకాశం లేకపోలేదు. ఫలితంగా.. ట్రంప్ అధికారంలోకి రాకముందే, భారతీయ విద్యార్థుల్లో చాలా మంది తమ పార్ట్-టైమ్ ఉద్యోగాలను వదిలేశారు. ఇప్పుడు ఇది కొనసాగుతోంది.
“నెలవారీ ఖర్చుల కోసం కాలేజ్ అయిపోయిన తర్వాత నేను చిన్న కేఫ్‌లో పనిచేసేవాడిని. గంటకు 7 డాలర్లు వచ్చేవి. ప్రతిరోజు 6 గంటలు పనిచేసేవాడి. చాలా బాగుండేది. కానీ గత వారం ఆ పార్ట్-టైమ్ జాబ్‌ని క్విట్ చేశాను. ఈ అనధికారిక పని గురించి ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలిస్తే కష్టమవుతుందని పార్ట్-టైమ్ ఉద్యోగాన్ని ఆపేశాను. రిస్క్ తీసుకోలేను! పైగా ఇక్కడ చదువుకునేందుకు రూ. 43లక్షల వరకు అప్పుతీసుకుని వచ్చాను,” అని అమెరికాలోని ఓ భారతీయ విద్యార్థి వెల్లడించాడు.
వేలాది మంది భారతీయ విద్యార్థులు అమెరికాలోని రెస్టారెంట్లలో, గ్యాస్ స్టేషన్లలో, రీటైల్ స్టోర్స్‌లో పనిచేస్తూ.. తమ రెంట్, గ్రాసరీ, ఇతర జీవన ఖర్చులకు డబ్బులు సమకుర్చుంటారు. కానీ ట్రంప్ యంత్రాంగంపై భయంతో విద్యార్థులు ఇప్పుడు రిస్క్ తీసుకోవాలని అనుకోవడం లేదు.
సేవింగ్స్ నుంచి తీసి, అప్పు చేసి..!
అమెరికాలో పార్ట్- టైమ్ ఉద్యోగాలని వదిలేసిన విద్యార్థులు.. పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. కొన్ని నెలల గ్యాప్ తర్వాత, అన్ని బాగుంటే, మళ్లీ పార్ట్ టైమ్ జాబ్స్‌లో చేరవచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికైతే సేవింగ్స్‌ని వాడుకుంటున్నారు. లేదా ఇండియాలోని కుటుంబసభ్యుల నుంచి, ఫ్రెండ్స్ నుంచి అప్పులు చేస్తున్నారు.
“ఎంత అప్పు చేసినా ఇక్కడ బతికేందుకు సరిపోవడం లేదు.” అని టెక్సాస్‌లోని ఓ భారతీయ విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు. “మళ్లీ మళ్లీ తల్లిదండ్రులను డబ్బులు అడగాలంటే బాధగా ఉంది. ఇప్పటికే వారు చాలా ఖర్చు చేశారు. గిల్టీగా ఉంది. కానీ నాకు వేరే ఆప్షన్ లేదు,”అని వివరించాడు.
“ఇప్పటివరకు దాచుకున్న వాటిల్లో చాలా వరకు ఖర్చు అయిపోయింది. నా రూమ్మేట్ నుంచి డబ్బులు తీసుకుంటున్నాను. ఇలా ఎంత కాలం ఉంటానో తెలియదు,” అని సదరు విద్యార్థి తెలిపాడు.
ప్రస్తుత అనిశ్చితి పరిస్థితులు.. అమెరికాలోని భారతీయ విద్యార్థుల్లో చాలా మందిని మానసికంగా ప్రభావితం చేస్తోంది. అటు ఆర్థిక పరిస్థితి, ఇటు మెంటల్ హెల్త్‌ని మేనేజ్ చేసుకోలేకపోతున్నారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link