FIITJEE centers : పరీక్షలకు ముందు దేశవ్యాప్తంగా ఫిట్​ జీ సెంటర్లు బంద్​! విద్యార్థుల్లో ఆందోళన..

Best Web Hosting Provider In India 2024


FIITJEE centers : పరీక్షలకు ముందు దేశవ్యాప్తంగా ఫిట్​ జీ సెంటర్లు బంద్​! విద్యార్థుల్లో ఆందోళన..

Sharath Chitturi HT Telugu
Jan 24, 2025 11:18 AM IST

FIITJEE centers closed : భారతదేశం అంతటా ఫిట్​ జీ కోచింగ్​ సెంటర్లు మూతపడుతున్నాయి! ఎగ్జామ్​ సీజన్​ సమీపిస్తున్న సమయంలో ఈ పరిస్థితి కారణంగా వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

అకస్మాత్తుగా మూతపడుతున్న ఫిట్​ జీ కోచింగ్​ సెంటర్లు..
అకస్మాత్తుగా మూతపడుతున్న ఫిట్​ జీ కోచింగ్​ సెంటర్లు..

దేశవ్యాప్తంగా పలు ఫిట్​ జీ (ఫోరం ఫర్ ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) కోచింగ్ సెంటర్లు అకస్మాత్తుగా మూతపడ్డాయి. సరిగ్గా బోర్డు- ఎంట్రెన్స్​ ఎగ్జామ్స్​ సమీపిస్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడటంతో వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. టీచర్ల కొరత ఇందుకు కారణం అని తెలుస్తోంది.

yearly horoscope entry point

ఫిట్​ జీ సెంటర్స్​ మూసివేత- అసలేం జరిగింది..?

వారం రోజుల వ్యవధిలో.. దిల్లీ, మీరట్, ఘజియాబాద్, లక్నో, వారణాసి, భోపాల్, పట్నా, నోయిడాలోని ప్రైవేట్ ఫిట్​ జీ కోచింగ్ సెంటర్లు మూతపడ్డాయి. దీనికి తోడు పుణెలోని రెండు ఫిట్​ జీ కేంద్రాలు కూడా క్లోజ్​ అవ్వడంతో 300 మందికి పైగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా, రాజ్ నగర్ జిల్లా కేంద్రాల్లోని ఒక కేంద్రాన్ని కూడా మూసివేయడంతో 800 మందికి పైగా విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు.

అయితే, జీతాలు అందకపోవడంతో ఉపాధ్యాయులు క్విట్​ చేయడం కారణంగా కోచింగ్​ సెంటర్లు మూతపడుతున్నట్టు తెలుస్తోంది.

నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో ఫిట్​ జీని విడిచిపెట్టినట్టు పట్నా కేంద్రానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు హెచ్​టీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను నాలుగేళ్లుగా అక్కడ బోధిస్తున్నానని, అయితే 2024 జులై నుంచి జీతాలు రాకపోవడంతో గత ఏడాది నవంబర్​లో పట్నా కోచింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయానని ఓ టీచర్ తెలిపారు.

అధ్యాపకుల కొరత కారణంగా ప్రస్తుతం తరగతులు నిర్వహించలేకపోతున్నామని, అధ్యాపకులకు మెరుగైన ఆఫర్లు రావడంతో ఇతర కోచింగ్ సెంటర్లకు వెళ్లిపోయరని మీరట్ కేంద్రానికి చెందిన ఒక సిబ్బంది హెచ్​టీకి వివరించారు. పరిస్థితిని ఫిట్​ జీ దిల్లీ ప్రధాన కార్యాలయానికి తెలియజేశామని, వారు 500 మంది విద్యార్థులకు బోధించడానికి తగినంత ఫ్యాకల్టీని అందిస్తే తరగతులను పునఃప్రారంభిస్తామని సిబ్బంది తెలిపారు.

ఫిట్​ జీ ఎలాంటి కోచింగ్ ఇస్తుంది?

ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్​ఐటీ) లేదా వివిధ సైన్స్ ఒలింపియాడ్​లలో ప్రవేశానికి సిద్ధమవుతున్న 6 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఫిట్​ జీ కోచింగ్ అందిస్తుంది. ఈ కోచింగ్​ సెంటర్స్​కి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.

“ఐదేళ్లకు 100 శాతం ఫీజు చెల్లించాము”

కాగా ఫిట్​ జీ సెంటర్లు మూతపడటంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిట్​ జీపై కేసు వేసేందుకు సిద్ధపడుతున్నారు.

“ఫిట్​ జీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు వచ్చాము. 5 సంవత్సరాలకు 100% ఫీజు చెల్లించాం. అందులో 2 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. మా పిల్లలను ఆకాశ్ ఇన్​స్టిట్యూట్​కు తరలించాలని సోమవారం ఫిట్​ జీ నుంచి సందేశం వచ్చింది. మా బిడ్డకు ఎక్కడ నేర్పించాలో నిర్ణయిస్తాం. ఆ విషయం ఫిట్​ జీ చెప్పాల్సిన అవసరం లేదు,” అని ఓ విద్యార్థి తండ్రి రాజీవ్ కుమార్ చౌదరీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link