గౌతమ్‌రెడ్డి కేసు..సుప్రీం కోర్టు ధ‌ర్మాస‌నం ఆశ్చ‌ర్యం

Best Web Hosting Provider In India 2024

వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడికి ముందస్తు బెయిల్‌

ఢిల్లీ: వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు గౌతమ్‌ రెడ్డిపై కూటమి సర్కార్‌ పెట్టిన కేసుల్లో సెక్షన్లను చూసి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.  ఈ మేర‌కు ఆయ‌న‌కు సు​ప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ ఇచ్చింది.  వైయ‌స్ఆర్‌సీపీ నేత గౌతమ్‌ రెడ్డిపై కూటమి సర్కార్‌ అక్రమంగా హత్యాయత్నం కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో గౌతమ్‌ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గౌతమ్‌ రెడ్డి పిటిషన్‌పై జస్టిస్ జేబీ పార్దివాల, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం విచారణ జరిపింది. గౌతమ్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ దవే, న్యాయవాది అల్లంకి రమేష్ వాదనలు వినిపించారు.
వాదనల సందర్భంగా.. కేసులో సెక్షన్లను చూసి ధర్మాసనం ఆశ్చర్యపోయింది. అనంతరం ధర్మాసనం.. దాడి చేసిన వ్యక్తే బెయిల్‌పై ఉన్నప్పుడు కుట్ర చేశారన్న గౌతమ్‌రెడ్డిని విచారించాలి కదా?. ఈ కేసులో నిందితులంతా బెయిల్‌పైనే ఉన్నారు. ఈ కేసు మెరిట్‌లోకి వెళ్లడం లేదు. కుట్రను మీరు విచారణలో తేల్చండి అని పేర్కొంది. ఈ క్రమంలో గౌతమ్‌ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. 
 

Best Web Hosting Provider In India 2024