Best Web Hosting Provider In India 2024
Chiyaan Vikram: చియాన్ విక్రమ్ కొత్త సినిమాకు చిరంజీవి మాస్ టైటిల్ ఫిక్స్ – రిలీజ్ ఎప్పుడంటే?
Chiyaan Vikram: చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తోన్న వీర ధీర సూరన్ పార్ట్ 2 మూవీకి తెలుగు టైటిల్ ఫిక్సయింది. ఈ సినిమాకు కాళీ అనే పేరు ఖరారు చేశారు. గతంలో రజనీకాంత్, చిరంజీవి కాళీ టైటిల్‌తో ఓ సినిమా చేశారు. మాస్ టైటిల్‌ను విక్రమ్ మూవీకి ఫిక్స్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Chiyaan Vikram: దక్షిణాది చిత్రసీమలో ప్రయోగాత్మక సినిమాలు అనగానే అభిమానులకు తొలుత గుర్తొచ్చే హీరో చియాన్ విక్రమ్. తంగలాన్ తర్వాత వీర ధీర సూరన్ పార్ట్ 2 పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు విక్రమ్. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ మార్చి 27న పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ కాబోతోంది.
చిరంజీవి టైటిల్…
విక్రమ్ కొత్త సినిమాకు తెలుగులో కాళీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. గతంలో కాళీ టైటిల్‌తో రజనీకాంత్, చిరంజీవి ఓ మల్టీస్టారర్ మూవీ చేశారు. మాస్ మూవీ టైటిల్‌ను విక్రమ్ కొత్త సినిమాకు ఖరారు చేయడం ఆసక్తికరంగా మారింది. ఎన్వీఆర్ సినిమాస్ ద్వారా తెలుగులో కాళీ మూవీని రిలీజ్ చేస్తోంది.
డిఫరెంట్ షేడ్స్…
ఈ సినిమాకు చిన్నా ఫేమ్ ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్నాడు. వీర ధీర సూరన్ పార్ట్ 2లో ఓ కిరాణా కొట్టు యజమానిగా, గ్యాంగ్‌స్టర్‌గా డిఫరెంట్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో విక్రమ్ కనిపించబోతున్నట్లు సమాచారం. విక్రమ్‌లోని మాస్ కోణాన్ని పతాక స్థాయిలో ఆవిష్కరించే సినిమా అవుతుందని మేకర్స్ చెబుతోన్నారు.
చియాన్ విక్రమ్‌తో పాటు ఈ మూవీలో ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజరమూడు, దుషార విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విక్రమ్, ఎస్‌జే సూర్య మధ్య వచ్చే సీన్స్ పోటాపోటీగా ఉంటాయని, సీట్ ఎడ్జ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్‌ను ఆడియెన్స్‌కు ఈ మూవీ అందిస్తోందని అంటున్నారు. వీర ధీర సూరన్ పార్ట్ 2 మూవీకి జీవీ. ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.
మూడు భాషల్లో…
వీర ధీర సూరన్ పార్ట్ 2 షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. తమిళం, తెలుగు, హిందీ భాషలలో మార్చి 27న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
తంగలాన్ యావరేజ్…
విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నది. కానీ కమర్షియల్‌గా మాత్రం సరైన విజయాన్ని సాధించలేకపోయింది. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 70 కోట్ల లోపే వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు నష్టాలను తెచ్చిపెట్టింది. పార్వతి తిరువోతు, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా కనిపించారు.. ఇండిపెండెన్స్ డే కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.
డీ గ్లామర్ పాత్రలో…
తంగలాన్‌గా విక్రమ్ లుక్, యాక్టింగ్‌కు మాత్రం అభిమానులు ఫిదా అయ్యారు. ఈ సినిమాకుగాను విక్రమ్‌తో పాటు పార్వతికి నేషనల్ అవార్డు తప్పకుండా రావడం ఖాయమంటూ చెబుతోన్నారు. తంగలాన్ మూవీకి పా రంజిత్ దర్శకత్వం వహించాడు.