Best Web Hosting Provider In India 2024

విశాఖ: దొడ్డి దారిన వైజాగ్ రావాల్సిన అవసరం మాకు లేదు.. రైట్ రాయల్ గా హైవే మీదే సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వస్తారని వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. విశాఖ రాజధాని అంశంపై విపక్షాల విమర్శలకు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం క్యాంపు ఆఫీస్‌కు సంబంధించి నిర్మాణాలు పూర్తయ్యాక సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైజాగ్ వస్తారు.. అది అక్టోబర్ కావొచ్చు.. నవంబర్ కావొచ్చు అని పేర్కొన్నారు.
రాజధాని వసతుల కమిటీ ఒకసారి పర్యటించిన తర్వాత బిల్డింగ్ లు ఫైనలైజ్ అవుతాయని చెప్పారు. పచ్చ కామెర్లతో ఉన్న టీడీపీ నేతలకు వైజాగ్ అభివృద్ది, ఆకాంక్ష పట్టదని మండిపడ్డారు. విశాఖ ప్రజలు కోరుకోవడం లేదంటున్న టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎక్కడ నుంచి వచ్చారు..? అని నిలదీశారు. వియ్యంకుల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం గంటా.. అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నారని దుయ్యబట్టారు.