Best Web Hosting Provider In India 2024
Glowing Skin: చర్మానికి మెరుపు తీసుకురావాలంటే ఈ బ్లూ టీని ట్రై చేయండి, ప్రకాశవంతమైన లుక్‌తో పాటు వచ్చే 5 బెనిఫిట్స్ ఇవే
Glowing Skin: బ్లూ టీ తాగడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. అందులో మీ చర్మానికి రేడియంట్ లుక్ తీసుకురావడం ఒకటి. మరి దీనిని ఎలా వినియోగించాలో తెలుసా?
మార్కెట్లో బ్యూటీని అందించే ప్రొడక్టులు ఎన్ని ఉన్నా మనం నేచురల్ రెమెడీస్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. ఇంటిలోనే పాటించే చిట్కాలతో చర్మానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని భావిస్తుంటాం. అటువంటి వాటిలోదే బ్లూ టీ ఒకట. దీనిని తీసుకోవడం వల్ల చర్మానికి బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయట. ఇందులో ఉండే అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్ మూలకాలు, యాంటీ ఇన్‌ఫ్లమ్మేటరీ గుణాలు ఉండి చర్మానికి రేడియంట్ లుక్ తీసుకొస్తాయట. అదెలా అనుకుంటున్నారా.. రండి తెలుసుకుందాం.
బ్లూ టీ అంటే ఏంటి?
శంఖు పూలకు బటర్ఫ్లై పీ లేదా క్లిటోరియా టీ అనే శాస్త్రీయ నామం ఉంది. వీటితోనే బ్లూ టీని తయారు చేస్తారు. ఇందులో ఉండే ఆంతోసియానిన్స్ పువ్వుకు సహజంగానే యాంటీ ఆక్సిడెంట్స్ ను అందిస్తాయి. దీనికి మరెన్నే పేర్లున్నా తెలుగు వారికి శంఖు పూలంటే బాగా గుర్తుంటుంది. చర్మానికి కలిగే ప్రయోజనాల విషయానికొస్తే బ్లూ టీని రెగ్యూలర్‌గా తీసుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయట.
చర్మానికి కలిగే 5 బెనిఫిట్స్
సూర్యరశ్మి నుంచి రక్షణ కోసం:
ఈ పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సూర్యరశ్మి నుంచి రక్షణ కల్పిస్తాయి. యూవీ కిరణాల నుంచి వెలువడే హానికరమైన పదార్థాల బారిన పడకుండా కాపాడతాయి. మీ చర్మానికి రక్షణ కవచంలా ఉండి సూర్య కిరణాల వల్ల హాని కలగకుండా చేస్తాయి. దీని ఫలితంగా వృద్ధాప్య ఛాయలు తొందరగా రాకుండా, చర్మానికి డ్యామేజ్ కలగకుండా ఉంటుంది.
చర్మానికి సాగే గుణం:
ఈ బ్లూ టీ తాగడం వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలలో సాగే గుణం ఒకటి. ఇది ముఖ్యంగా యాంటీ గ్లైకేషన్ గుణాల వల్ల కలుగుతుంది. గ్లేకేషన్ అనే కెమికల్ రియాక్షన్ వల్ల వయస్సు ఎక్కువగా కనిపించడం, చర్మంపై ముడతలు రావడం, చర్మాన్ని నిర్జీవంగా మార్చడం వంటి ప్రభావాలు కనిపిస్తాయి. ఇంకా ఇందులో ఉండే కొల్లాజెన్ చర్మానికి సజీవమైన లుక్ తీసుకొచ్చి సాగే గుణం కలుగజేస్తుంది. ఫలితంగా చర్మం ముడతలు పడకుండా, మృదువుగా, యవ్వనవంతంగా ఉంటుంది.
నునుపైన చర్మం కోసం:
చర్మంపై దురదల వంటి సమస్యలు ఉన్నప్పుడు బ్లూ టీ ప్రయోజనవంతంగా ఉంటుంది. ఇందులో ఉండే విశేషమైన గుణాలు డార్క్ స్పాట్ లను తగ్గిస్తుంది. మొటిమల మచ్చలు, ఎరుపుగా మారిన మచ్చలు, పొడిబారిన చర్మం వంటి సమస్యలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. బ్లూ టీ రెగ్యూలర్‌గా తీసుకోవడం వల్ల ప్రశాంతమైన, ప్రకాశవంతమైన చర్మానికి దోహదపడుతుంది.
చర్మాన్ని హైడ్రేటెడ్‌గా:
చలికాలం తరచుగా డీహైడ్రేషన్‌కు లోనై చర్మం పొడిబారుతూ ఉంటుంది. అదృష్టవశాత్త బ్లూ టీ తాగడం వల్ల ఈ సమస్యకు సహజమైన పరిష్కారం అందుతుంది. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి తేమగా ఉండటంతో పాటు పలుచబడకుండా చూసుకుంటుంది. తద్వారా చర్మం మృదువుగా, రిఫ్రెష్‌గా కనిపిస్తుంది.
యాంటీ ఏజింగ్:
బ్లూ టీలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. అంతేకాకుండా హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను అరికడతాయి. ఇవి చర్మాన్ని దెబ్బతీయకుండా, వృద్ధాప్య చాయలు త్వరగా రాకుండా ఉంచుతాయి. అంతేకాకుండా ఈ టీలో అందే పోషకాలు చర్మాన్ని మెరుస్తూ, ప్రకాశవంతంగా మారుస్తుంది.
బ్లూటీని ఎలా ఉపయోగించాలి?
నీళ్లతో బ్లూ టీ: ఒక కప్పు వేడి నీటిలో 2 నుంచి 4 శంఖు పువ్వులను కలపండి. రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత వాటిని తీసేయండి. అలా రెడీ అయిన బ్లూ టీని క్రమం తప్పకుండా రోజూ తీసుకోండి.
నిమ్మకాయతో బ్లూ టీ: ఒక కప్పు నీళ్లలో 2-3 శంఖు పువ్వులు వేసి కొద్దిగా నిమ్మరసం కలపండి. ఒక నిమిషం తర్వాత పువ్వులను తీసివేయడం ద్వారా ఈ డ్రింక్ తాగడానికి సిద్ధంగా ఉంటుంది.
బ్లూ టీ ఐస్ క్యూబ్: శంఖు పువ్వులను నీళ్లలో వేసి దానిని ఫ్రిజ్ లో ఉంచి గడ్డ కట్టేంత సేపు వదిలేయొచ్చు. ఆ తర్వాత ఐస్ క్యూబ్స్‌ని తీసుకుని సహజమైన మెరుపు కోసం చర్మానికి రుద్దుకుంటూ ఉండండి.
తేనె, పెరుగుతో బ్లూ టీ: ఒక గిన్నెలో ఒక టీస్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ (శంఖు పువ్వులను ఎండబెట్టి తయారుచేసుకున్న) పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి మందపాటి పొరగా అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇది మీ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.
కలబంద గుజ్జుతో బ్లూ టీ: బ్లూ టీ పౌండర్, కలబంద గుజ్జు, తేనె కలిపి ముఖంపై రాసుకోండి. దానిని ఒక 20 నిమిషాల పాటు ఉంచి కడిగేయండి. ఆ తర్వాత ఫలితం చూసి మీరు షాక్ అవుతారు.
సంబంధిత కథనం
టాపిక్