Best Web Hosting Provider In India 2024
Dry cough: తీవ్రమైన పొడి దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా? ఈ పొడిని ప్రయత్నించి చూడండి
Dry cough: పొడి దగ్గుతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలోనే దగ్గు అధికంగా వస్తుంది. ఆయుర్వేదంలో చెప్పిన ఈ ఇంటి చిట్కాను పాటించి చూడండి. పొడి దగ్గు తగ్గే అవకాశం ఉంది.
చలికాలంలో దగ్గు, జలుబు, జ్వరం బారిన తరచూ పడుతూ ఉంటారు. వీటిలో ఎక్కువగా బాధపెట్టేది దగ్గు. ముఖ్యంగా పొడి దగ్గు వల్ల గొంతు ఎంతో ఇబ్బంది పడుతుంది. పొడి దగ్గు ఉన్నప్పుడు అందులో శ్లేష్మం ఉండదు. ఎందుకంటే ఊపిరితిత్తులు, శ్వాసనాళాల్లో శ్లేష్మం ఉండదు. కాబట్టి దగ్గినప్పుడు ఏమీ బయటకు రాదు. శ్లేష్మం లేకపోవడం వల్ల ఎక్కువ దగ్గు వస్తుంది. ఇది గొంతు తడారిపోయేలా చేస్తుంది. అక్కడ చర్మం రాసుకుపోయినట్టు అవుతుంది.
పొడి దగ్గు లక్షణాలు
పొడి దగ్గు వచ్చినప్పుడు గొంతులో మంట, గరగరగా ఉంటుంది. కాబట్టి దాన్ని వదిలించుకోవడానికి తరచూ దగ్గుతారు. గట్టిగా దగ్గినప్పుడు గాలి లోపలికి ప్రవేశించి గొంతును మరింత చికాకుపెడుతుంది. దీనివల్ల గొంతు పొడిబారి గొంతునొప్పి వస్తుంది.
పొడి దగ్గుకు కారణాలు
పొడి దగ్గు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అలెర్జీ , ఆస్తమా, కొన్ని రకాల మందులు, చికాకు కలిగించే గాలిని పీల్చడం వల్ల పొడి దగ్గు వచ్చే అవకాశం ఉంది. ఇతర అంతర్లీన ఆరోగ్యసమస్యలు కూడా ఉండవచ్చు.
- బ్రోన్కియల్ వాపు
- గొంతు గరగర
- గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్
- మందుల దుష్ప్రభావాలు
- అధిక రక్తపోటు మందుల వల్ల సైడ్ ఎఫెక్టులు
- ముక్కు లోపల వాపు
- కొంత నాలుక పెరగడం
- న్యుమోనియా
- ధూమపానం
- స్వరపేటికతో సమస్యలు
- ఇక్కడ చెప్పిన వాటిలో ఏ సమస్య ఉన్నా కూడా పొడి దగ్గు తీవ్రంగా వేధించే అవకాశం ఉంది.
దీర్ఘకాలిక పొడి దగ్గు వల్ల వచ్చే సమస్యలు
పొడి దగ్గును తేలికగా వదిలేయ కూడదు. ఒక్కోసారి ఇది ప్రాణాంతక వ్యాధిగా మారుతుంది. కాబట్టి దీర్ఘకాలిక పొడి దగ్గు విషయంలో వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
పొడి దగ్గు తీవ్రంగా వేధిస్తున్నప్పుడు వెంటనే కొన్ని పనులు చేయాలి.
- నీరు ఎక్కువగా తాగాలి.
- దగ్గు మందులు లేదా మాత్రలు వేసుకోవాలి
- కరక్కాయ వంటివి నములుతూ ఉండాలి.
- తేనె తాగండి
ఈ పనులు చేయకండి
- రసాయనాలు, పరిమళ ద్రవ్యాలు, అలెర్జీ కారకాలు వంటివి కొందరికి చికాకు కలిగించే వాసనల వల్ల కూడా దగ్గు మొదలైపోతుంది.
- చేతులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తరచుగా శ్వాసకోశ సమస్యలు వస్తుంటే వెంటనే వైద్యులను కలిసి తగిన చికిత్స తీసుకోవాలి.
- ధూమపానం అలవాటు ఉంటే వెంటనే మానేయండి.
మీకు దగ్గుతో పాటూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, చలి, జ్వరం మరియు ఛాతీ నొప్పి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
పొడిదగ్గుతో బాధపడుతుంటే ఇక్కడ చెప్పిన ఇంటి చిట్కాలను పాటించి చూడండి. మీకు దీని వల్ల ఎంతో కొంత ఉపశమనం దక్కుతుంది.
దగ్గును తగ్గించే పొడి
జీలకర్ర, అర టీ స్పూను పసుపు, నెయ్యి కలిపి నములుతూ ఆ నీటిని మింగడం వల్ల ఉపయోగం ఉంటుంది. జీలకర్రపొడిని, పసుపును కలిపి అందులో కాచిన నెయ్యిలో కలిపి దాన్ని తింటూ ఉన్నా కూడా ఉపయోగం ఉంటుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం