Best Web Hosting Provider In India 2024
Mamta Kulkarni: కిన్నార్ అఖాడా మహామండలేశ్వరిగా మాజీ నటి మమతా కులకర్ణి; పేరు మార్పు కూడా..
Mamta Kulkarni: ‘కరణ్ అర్జున్’ వంటి చిత్రాలతో 1990వ దశకంలో ప్రముఖ నటిగా గుర్తింపు పొందిన మమతా కులకర్ణి 2000వ దశకం ప్రారంభంలో చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు. మహా కుంభమేళాలో ఆమె కిన్నార్ అఖాడా మహామండలేశ్వరిగా మారనున్నారు.
Mamta Kulkarni: ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభ్ ఉత్సవంలో కిన్నార్ అఖాడా మహామండలేశ్వరి గా మాజీ నటి మమతా కులకర్ణి బాధ్యతలు స్వీకరించనున్నారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత ఈ నెల ప్రారంభంలో ఆమె భారత్ కు తిరిగి వచ్చారు. నేరుగా మహాకుంభమేళా 2025 లో పాల్గొనడం కోసం ప్రయాగ్ రాజ్ కు వెళ్లారు. ఆమె కుంభమేళాలో పాల్గొన్న చిత్రాలు ఆన్ లైన్లో వైరల్ గా మారాయి. వాటిలో నటి మమత కులకర్ణి త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించడం, పిండ ప్రదానం చేయడం వంటి ఫొటోలున్నాయి. గంగానదిలో పుణ్య స్నానం ఆచరించిన అనంతరం ఆమె కిన్నార్ అఖాడాలో అధికారికంగా చేరారు.
కిన్నార్ అఖాడాలో..
‘‘మమతా కులకర్ణిని కిన్నార్ అఖాడా మహామండలేశ్వరిగా మార్చబోతోంది. ఆమెకు శ్రీ యమై మమతా నందగిరి అని నామకరణం చేశారు. ఆమె గత ఏడాదిన్నరగా కిన్నర్ అఖాడాతో, నాతో టచ్ లో ఉంది. ఎవరినీ వారి కళను ప్రదర్శించడాన్ని మేము నిషేధించనందున ఆమె కోరుకుంటే ఏ భక్తురాలి పాత్రనైనా పోషించడానికి అనుమతిస్తాం’’ అని కిన్నార్ అఖాడా ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీ నారాయణ్ చెప్పారు.
మమత కులకర్ణి స్పందన
తను కిన్నార్ అఖాడా మహామండలేశ్వరి గా మారడంపై మమత కులకర్ణి స్పందించారు. “ఇది మహాదేవుని ఆజ్ఞ, మహా కాళి. ఇది మా గురువుగారి ఆదేశం. వారు ఈ రోజును ఎంచుకున్నారు. నేనేమీ చేయలేదు’ అని ప్రయాగ్ రాజ్ లోని సంగం ఘాట్ వద్ద పిండ ప్రదాన కార్యక్రమం అనంతరం మమత కులకర్ణి అన్నారు.
వారణాసి, అయోధ్యలకు..
కుంభమేళా నుంచి మమత కులకర్ణి వారణాసి, అయోధ్యలకు వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోలో వివరించారు. మహా కుంభమేళా (maha kumbha mela 2025) లో కులకర్ణి కాషాయ దుస్తులు ధరించిన దృశ్యాలు కూడా వివిధ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. 1990వ దశకంలో ‘కరణ్ అర్జున్’, ‘బాజీ’ వంటి హిట్ చిత్రాల్లో తన నటనతో మమతా కులకర్ణి ఫేమస్ అయ్యారు. తన కెరీర్ లో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి టాప్ స్టార్స్ తో నటించింది. ఆమె చివరికి 2000 ల ప్రారంభంలో చిత్ర పరిశ్రమకు దూరమైంది. విదేశాలకు వెళ్లి లైమ్ లైట్ కు దూరంగా జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నారు.
Best Web Hosting Provider In India 2024
Source link