Nettle Leaf For Women: మహిళలారా.. మీ విషయంలో అమృతంతో సమానమైన ఈ ఆకు గురించి మీకు తెలుసా!

Best Web Hosting Provider In India 2024

Nettle Leaf For Women: మహిళలారా.. మీ విషయంలో అమృతంతో సమానమైన ఈ ఆకు గురించి మీకు తెలుసా!

Ramya Sri Marka HT Telugu
Jan 24, 2025 08:30 PM IST

Nettle Leaf For Women: మహిళల్లో వచ్చే అనేక సమస్యలకు చక్కటి పరిష్కారం దురదగొండి ఆకు అని మీకు తెలుసా? ఎన్నో ఏళ్ల నుంచీ ఈ ఆకులను ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఇది ఆడవారిలో ఎలాంటి సమస్యలను నయం చేస్తుంది, ఎలా ఉపయోగించాలి వంటి విషయాలను తెలుసుకుందాం.

మహిళలారా.. మీ విషయంలో అమృతంతో సమానమైన ఈ ఆకు గురించి తెలుసుకోండి!
మహిళలారా.. మీ విషయంలో అమృతంతో సమానమైన ఈ ఆకు గురించి తెలుసుకోండి! (shutterstock)

దురదగొండి ఆకుల గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇంగ్లీషులో Nettle Leaf అని పిలిచే ఆకులను ఆయుర్వేదంలో ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, చక్కెర, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, జింక్, సెలీనియం, థయామిన్, విటమిన్ B6 వంటి అనేక ఇతర పోషకాలతో నిండి ఉన్న దురదగొండి ఆకులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ముఖ్యంగా మహిళల విషయంలో ఇది అమృతంలా పనిచేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదని నిపుణులు చెబుతుంటారు. ఆడవారిలో వచ్చే అనేక సమస్యలను తగ్గించే శక్తి ఈ ఆకుల్లో ఉంటుందట. దురదగొండి ఆకులు మహిళల ఆరోగ్యానికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో, ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

yearly horoscope entry point

మహిళల ఆరోగ్యానికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది?

దురదగొండిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, వాపు నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది ముఖ్యంగా ఆర్థరైటిస్ సమస్య నుండి ఉపశమనం కలిగించడంలో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

రక్తపోటు

అధిక రక్తపోటును నియంత్రించడంలో కూడా దురదగొండి ఆకులు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ-హైపర్టెన్సివ్ లక్షణాలు మహిళల్లో అధిక రక్తపోటు సమస్యను నియంత్రించడంలో సహాయపడతాయి.

ఐరన్ లోపం

దురదగొండి ఆకులో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మహిళల శరీరంలో రక్తం లోపాన్ని సర్దుబాటు అవుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి మహిళల శరీరం ఐరన్‌ను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది.

PCOD

ఋతుస్రావం, PCOD వంటివి ఈ రోజుల్లో చాలా మంది మహిళలను ఇబ్బంది పెడుతున్న సమస్యలు. వీటి వల్ల కలిగే ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించడంలో దురదగొండి చాలా బాగా సహాయపడుతుంది. ఋతు చక్రాల అవకతవకలను తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. వైద్యుల సలహా మేరకు వీటిని క్రమం తప్పకుండా తీసుకున్నారంటే ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు.

చర్మానికి ప్రయోజనకరం

దురదగొండి ఆకు రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలోనూ సహాయపడుతుంది. దీని వల్ల మొటిమలు, మచ్చల సమస్య తగ్గడమే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. క్రమం తప్పకుండా వీటిని తీసుకున్నట్లయితే జుట్టు కూడా ఆరోగ్యకరంగా, అందంగా మారుతుంది.

గాయాలు మానడానికి సహాయపడుతుంది

దురదగొండి ఆకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. దీని సారాన్ని గాయాలపై రాసుకోవడం వల్ల గాయాలు త్వరగా మానిపోతాయి. మచ్చలు అవకుండా కూడా ఇది సహాయపడుతుంది.

అలెర్జీ లక్షణాలను తగ్గిస్తుంది

సహజ యాంటీహిస్టామైన్‌గా పనిచేయడం ద్వారా దురదగొండి ఆకులు అలెర్జీ లక్షణాలను తగ్గించడంలోనూ సహాయపడుతుంది.

దురదగొండి ఆకులను మహిళలు బిచ్చు బూటీని ఎలా ఉపయోగించాలి..?

  • దురదగొండి ఆకులను సూపుల్లో, కూరల్లో వేసుకుని తినచ్చు.
  • నీటిలో ఈ ఆకులను వేసి మరిగించి వడకట్టి ఆ ఆకులను కూడా తీసుకోవచ్చు.
  • చర్మానికి ఆకులను గట్టిగా రుద్ది రసం కూడా రాసుకోవచ్చు.కీళ్ల నొప్పులు, కీళ్లలో మంట వంటివి ఉన్నవారు కూడా ఈ ఆకుల రసాన్ని సంబంధిత స్థలంలో రాసుకోవాలి.
  • దురదగొండి ఆకులతో టీ తయారు చేసుకుని కూడా తాగచ్చు.
Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024