Best Web Hosting Provider In India 2024
Sunny Leone: సన్నీ లియోనీతో బాత్రూమ్ సీన్ ఫ్రెండ్స్‌కి చూపించాను.. దానికి చాలా ఎనర్జీ కావాలి: బిగ్ బాస్ విన్నర్ కామెంట్
Sunny Leone: సన్నీ లియోనీతో తన బాత్రూమ్ సీన్ గురించి బిగ్ బాస్ 18 విన్నర్ కరణ్ వీర్ మెహ్రా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆ సీన్ చేయడానికి చాలా ఎనర్జీ కావాల్సి వచ్చిందని, చాలా ఎంజాయ్ చేశానని అతడు చెప్పడం విశేషం.
Sunny Leone: ఈ మధ్యే బిగ్ బాస్ 18 విజేతగా నిలిచిన కరణ్ వీర్ మెహ్రా గతంలో రాగిని ఎంఎంఎస్ 2 మూవీలో హాట్ బ్యూటీ సన్నీ లియోనీతో చేసిన బాత్రూమ్ షవర్ సీన్ గురించి చెప్పుకొచ్చాడు. ఎల్విష్ యాదవ్ పాడ్‌కాస్ట్ లో అతడు మాట్లాడాడు. ఆ వీడియోను తన ఫ్రెండ్స్ కు చూపించానని, అందులో నలుగురు ఇప్పటికీ డిప్రెషన్ లోనే ఉన్నారని అతడు చెప్పడం విశేషం. ఆ సీన్ తాను బాగా ఎంజాయ్ చేసినట్లు తెలిపాడు.
సన్నీ లియోనీ బాత్రూమ్ సీన్
రాగిని ఎంఎంఎస్ 2 మూవీలో ఇప్పటి బిగ్ బాస్ 18 విన్నర్ కరణ్ వీర్ మెహ్రా.. మ్యాడీగా నటించాడు. ఆ సినిమాలో సన్నీ లియోనీతో కలిసి బాత్రూమ్ లో షవర్ కింద ఓ హాట్ కిస్సింగ్ సీన్ లో అతడు నటించాడు. ఆ సీన్లో సన్నీ టాప్ లెస్‌గా నటించింది.
ఈ సీన్ గురించి తాజాగా తన పాడ్‌కాస్ట్ కి వచ్చిన కరణ్ ను ఎల్విష్ యాదవ్ అడిగాడు. ఈ సీన్ చూసి తన ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అయ్యారో కూడా కరణ్ చెప్పాడు. “షవర్ సీన్ అది. దానిని నేను నా ఫ్రెండ్స్ కి చూపించినప్పుడు వాళ్లు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. నలుగురైతే ఇంకా డిప్రెషన్ లోనే ఉన్నారు” అని అతడు చెప్పడం విశేషం.
ఆ సీన్‌కు చాలా ఎనర్జీ కావాలి
సన్నీ లియోనీతో బాత్రూమ్ సీన్ చేయడానికి చాలా ఎనర్జీ కావాల్సి వచ్చిందని, తాను బాగా ఎంజాయ్ చేశానని అన్నాడు. ఆ రోజు కూడా ఫాస్టింగ్ ఏమైనా చేశావా అని ఎల్విష్ అడిగినప్పుడు కరణ్ ఇలా స్పందించాడు. “భాయ్.. ఆ రోజైతే నేను చాలా తిన్నాను. చాలా ఎనర్జీ అవసరమైంది. మంచి మజా వచ్చింది. దానిని ఫ్రెండ్స్ కు చూపించినప్పుడు ఈ సీన్ చేయడానికి నీకు డబ్బులు కూడా ఇచ్చారా అని అడిగారు” అంటూ కరణ్ ఆ సీన్ గురించి చెప్పుకొచ్చాడు.
ఆ సీన్ ను ఎన్నోసార్లు రీషూట్ చేసినట్లు కూడా తెలిపాడు. ఉదయం 11 గంటలకు మొదలైన షూటింగ్ రాత్రి 9 గంటల వరకు సాగిందని కరణ్ చెప్పడం విశేషం. కరణ్ వీర్ మెహ్రా ఈ మధ్యే ముగిసిన బిగ్ బాస్ 18 విజేతగా నిలిచాడు. అంతకుముందే అతడు ఖత్రోంకే కిలాడీ 14 కూడా గెలిచాడు. బిగ్ బాస్ లో వివియన్ డిసేనా, రజత్ దలాల్ నుంచి గట్టి పోటీ ఎదురైనా చివరికి కరణ్ ట్రోఫీ అందుకున్నాడు.
సంబంధిత కథనం