Best Web Hosting Provider In India 2024
OTT: రాశీఖన్నా బాలీవుడ్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ తెలుగులో స్ట్రీమింగ్ – ఏ ఓటీటీలో చూడాలంటే?
OTT: రాశీఖన్నా బాలీవుడ్ మూవీ ది సబర్మతి రిపోర్ట్ తెలుగులోకి వచ్చింది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ తెలుగు వెర్షన్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. వాస్తవ ఘటనల స్ఫూర్తితో తెరకెక్కిన ఈ మూవీలో విక్రాంత్ మస్సే హీరోగా నటించాడు.
రాశీఖన్నా హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ ది సబర్మతి రిపోర్ట్ తెలుగులో రిలీజైంది. జీ5 ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇటీవలే ఈ సినిమా హిందీ వెర్షన్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. తాజాగా శుక్రవారం నుంచి తెలుగు, తమిళ భాషల్లో ది సబర్మతి రిపోర్ట్ సినిమాను జీ5 ఓటీటీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
గోద్రా ఘటన ఆధారంగా…
పొలిటికల్ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కిన ది సబర్మతి రిపోర్ట్ సినిమాకు ధీరజ్ శర్మ దర్శకత్వం వహించాడు. 2002లో గుజరాత్‌లోని గోద్రా రైల్వే స్టేషన్ వద్ద సబర్మతి ఎక్స్‌ప్రెస్ కాలిపోయిన ఘటనలో 59 మంది చనిపోయారు. ఆ సంఘటన ఆధారంగా ది సబర్మతి రిపోర్ట్ మూవీ రూపొందింది.
ప్రమోషన్స్‌తో…
ది సబర్మతి రిపోర్ట్ మూవీపై బాలీవుడ్‌లో ఆరంభం నుంచే భారీగా అంచనాలు ఏర్పాడ్డాయి. ప్రమోషన్స్‌తోనే ఆడియెన్స్‌లో ఈ మూవీ ఆసక్తిని రేకెత్తించింది. సెన్సార్ నుంచి అడ్డంకులు ఎదురుకావడంతో కథలో మేకర్స్ కొన్ని మార్పులు చేశారు. కేరళ స్టోరీ, కశ్మీర్ ఫైల్స్ మాదిరిగా ఈ సినిమా హిట్టవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ అంచనాల్ని తలక్రిందులు చేస్తూ ది సబర్మతి రిపోర్ట్ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.
విక్రాంత్ మస్సే….
ది సబర్మతి రిపోర్ట్ మూవీలో టువెల్త్ ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మస్సే, రాశీఖన్నాతో పాటు రిద్ది డోగ్రా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాను బాలాజీ మోషన్ పిక్చర్స్ పతాకంపై ఏక్తా కపూర్, శోభా కపూర్ ప్రొడ్యూస్ చేశారు.
మీడియా పాత్ర…
గోద్రా ఘటనలో నిజానిజాలు వెలికితీయడంలో మీడియా ఎలాంటి పాత్ర పోషించిందనే పాయింట్‌తో దర్శకుడు ధీరజ్ శర్మ ఈ సినిమాను తెరకెక్కించాడు. తాను అనుకున్న పాయింట్‌ను అర్థవంతంగా, ఆసక్తికరంగా చెప్పడంలో డైరెక్టర్ తడబడటంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. విక్రాంత్ మస్సే యాక్టింగ్ మాత్రం బాగుందనే కామెంట్స్ వినిపించాయి.
జర్నలిస్ట్ సమర్ కుమార్
సమర్ కుమార్ (విక్రాంత్ మస్సే) ఓ న్యూస్ ఛానెల్‌లో జర్నలిస్ట్‌గా జాయిన్ అవుతాడు. గోద్రా దుర్ఘటన కవరేజ్ కోసం మహికతో కలిసి వెళతాడు. ఆ ఘటన వెనుక నిజాల్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొస్తాడు. కానీ న్యూస్ ఛానెల్ మాత్రం సమర్ కుమార్ సేకరించిన ఆధారాల్ని దాచేస్తుంది.
అతడిని ఉద్యోగంలో నుంచి తీసేస్తుంది. మరో చోట అతడిని ఉద్యోగం దొరకడం కష్టంగా మారుతుంది. తాగుడుకు బానిసగా మారిపోతాడు. ఆ టైమ్‌లోనే అతడి జీవితంలోకి అమృత గిల్ (రాశీఖన్నా) వస్తుంది? ఆమె ఎవరు? అమృతతో కలిసి గోద్రా ఘటనపై సమర్ మళ్లీ ఇన్వేస్టిగేషన్ చేయడానికి కారణ మేమిటి? అన్నదే ది సబర్మతి రిపోర్ట్ మూవీ కథ.
తెలుగు కదా…
గత కొన్నాళ్లుగా తమిళం, తెలుగుతో పాటు హిందీపై ఫోకస్ పెడుతోంది రాశీఖన్నా. బాలీవుడ్‌లో ది సబర్మతి రిపోర్ట్ కంటే ముందు యోధ మూవీతో పాటు ఫర్జీ, రుద్ర వెబ్‌సిరీస్‌లు చేసింది. ప్రస్తుతం తెలుగులో తెలుసు కదా సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది రాశీఖన్నా. ఈ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్నాడు.