Best Web Hosting Provider In India 2024
Brahmamudi January 25th Episode: అవమానించిన కావ్యకే సుభాష్ సపోర్ట్- అపర్ణకు అన్నం తినిపించిన అత్త- నందాను చంపేసిన అనామిక
Brahmamudi Serial January 25th Episode: బ్రహ్మముడి జనవరి 25 ఎపిసోడ్‌లో కావ్య అవమానించిన దాని గురించి సుభాష్‌తో ప్రకాశం మాట్లాడుతాడు. కావ్య నన్ను అన్నదంటే తనకు ఎంత పెద్ద కష్టం వచ్చిందో అని ఆలోచిస్తున్నా అంటాడు సుభాష్. తర్వాత కావ్యతో కూడా నా కోడలు తప్పు చేయదని నాకు తెలుసు అని సుభాష్ అంటాడు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య ఎదురించడంపై సుభాష్‌తో ప్రకాశం మాట్లాడుతాడు. నీకు జరిగిన అవమానంపై నా భార్యకు సమాధానాలు చెప్పలేకపోతున్నాను. ఇన్నిరోజులు నోరు మూయించాను కానీ, ఇప్పుడు నా వల్ల కాదన్నయ్య అని ప్రకాశం అంటాడు. ఆ మాటలు కావ్య వింటుంది.
అందుకని తప్పు బట్టాలా
ఈ మౌనం, ఈ మంచితనం కావ్య దృష్టిలో చేతగానీతనం కాకూడదు. నువ్ ఇలా బాధపడి ప్రయోజనం లేదు. త్వరగా దీనికి పరిష్కారం చూడు అని ప్రకాశం అంటాడు. ఈ ఇంట్లో నన్ను ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా తమ్ముడిగా నువ్ అర్థం చేసుకుంటావనుకున్నాను. కానీ, నువ్ కూడా నేను బాధపడుతున్నాను అనుకుంటున్నావ్. కావ్య నన్ను అంది. అందుకని కావ్యను తప్పుబట్టాలా. నలుగురు అంటున్నావ్. వాళ్లెవర్రా. మన దగ్గర నా విలువ పోయిందని నేనెందుకు అనుకోవాలి అని సుభాష్ అంటాడు.
కావ్య అలా అన్నందుకు బాధపడట్లేదు. అలా ఎందుకు అన్నదా అని ఆలోచిస్తున్నాను. ఎప్పుడు ఒక్క మాట అనని కావ్య అంత మాట అంది అంటే తనకు ఇంకెంత కష్టం వచ్చిందో అని ఆలోచిస్తున్నాను. తను డబ్బు కన్న మనుషులకు, బంధాలకే విలువ ఇస్తుంది. తనను నేను శత్రువులా చూడలేను. చిన్నపిల్లగా నిజంగా తప్పు చేస్తే సరిదిద్దాలి కానీ, వేలేత్తి చూపితే ఎలా అని సుభాష్ అంటాడు. నీ అంత గొప్పగా ఆలోచించాలని ఉన్న నా చేతుల్లో లేదు. నేను చెబితే ధాన్యలక్ష్మీ వినదు. నా భార్య అడిగినట్లు చేయక తప్పదు. ఇంట్లో పరువు పోయినా కనీసం భర్తగా అయిన నా పరువు కాపాడుకోవాలి కదా. క్షమించు అని ప్రకాశం వెళ్లిపోతాడు.
అది చూసి కావ్య కూడా వెళ్లిపోతుంది. తర్వాత అందరికి రాత్రి భోజనం వడ్డిస్తుంటుంది కావ్య. ధాన్యలక్ష్మీ వేస్తుంటే వద్దంటుంది. ఎవరి చేత్తో పడితే వాళ్లతో వడ్డిస్తే నేను తినను అంటుంది. తర్వాత నేను కూడా అని ప్రకాశం అంటాడు. ఇన్నాళ్లు ఎవరు వండి, వడ్డిస్తే తిన్నారో అని స్వప్న అంటుంది. నేను కూడా నేను వడ్డించుకుంటాను అని రుద్రాణి అంటుంది. దాంతో స్వప్న సెటైర్లు వేస్తుంది. తనది భస్మాసుర అస్త్రం. ఎవరి తల మీద పెట్టిన బూడిదే. మా మావయ్య మీద పెట్టావా. బూడిద అయిపోయాడు. ఇప్పుడు ధాన్యలక్ష్మీ తల మీద పెట్టావా అని స్వప్న అంటుంది.
దెయ్యం మొహంతో
కావ్య అక్క అనేసరికి నువ్ అంటే నోరు మూసుకుంటాలే అని స్వప్న అంటుంది. నువ్వేంటీ ఇంట్లో అందరూ నోరు మూసుకుంటారు. మా సుభాష్ అన్నయ్యకు హక్కు లేదనగానే పిల్లి కూనలా నోరు మూసుకున్నాడు, పాపం మా వదిన కూడా ఏం అనలేక నోరుమూసుకుంది. వాళ్లు భోజనానికి రారు. ఇంత అవమానం జరిగాక ఎలా వస్తారు అని రుద్రాణి అంటుంది. అత్త ఆ దెయ్యం మొహం పెట్టుకుని ఇటు చూడు ఎవరు వస్తున్నారో అని స్వప్న అంటుంది.
అప్పుడే సుభాష్ వస్తుంటాడు. కావ్య వెళ్లి సుభాష్‌కు వడ్డిస్తుంది. ఏవిటో అంటూ రుద్రాణి సెటైర్లు వేస్తుంది. కనీసం మా వదినకైనా పౌరుషం ఉంది అని రుద్రాణి అంటుంది. నోరు మూసుకుని తిను రుద్రాణి అని ధాన్యలక్ష్మీ వారిస్తుంది. పౌరుషం గురించి మా అత్తే మాట్లాడాలి. ఎన్ని అన్న ఈ ఇంట్లోనే సిగ్గులేకుండా ఉంటోంది అని స్వప్న అంటుంది. నా భర్త సన్నాసి కాబట్టి ఇక్కడ ఉన్నాను అని రుద్రాణి అంటే.. సేమ్ టూ యూ. నా భర్త సన్నాసి కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను అని స్వప్న అంటుంది.
మమ్మీ.. నువ్ పడటం కాకుండానే నన్ను మాటలు పడేలా చేస్తావా. అది పక్కన ఉండగా నోరు మూసుకోవచ్చు కదా అని కోప్పడతాడు రాహుల్. నువ్ సన్నాసివి కాబట్టి అది అలా మాట్లాడుతుంది. పెళ్లాన్ని అదుపులో పెట్టుకోలేవా అని రుద్రాణి అంటుంది. అలా అయితే రాజ్ అదుపులో పెట్టుకున్నాడా అని రాహుల్ అంటాడు. నేను లేస్తే అందరి నోళ్లు మూతపడతాయ్ అని సుభాష్ వార్నింగ్ ఇస్తాడు. దాంతో అంతా సైలెంట్ అయిపోతారు.
నాకు పౌరుషం ఉంది
అత్తయ్య గారు భోజనానికి రాలేదు అని కావ్య అంటే.. ఇక్కడ కుక్కలు నక్కలు మొరుగుతాయని రానట్టుంది. నేను వెళ్లి తీసుకెళ్తాను అని ఇందిరాదేవి అంటుంది. తిండి మధ్యలోనే ధాన్యలక్ష్మీ వెళ్తుంది. ఆ వెంటనే వెళ్లిన రుద్రాణి కావ్య ఇచ్చిన షాక్ నుంచి తేరుకోనట్టుంది. అందుకే భోజనం మధ్యలోనుంచి వచ్చింది అని అనుకుని వెళ్లి అడుగుతుంది. కావ్య చేసింది తినలేను. నాకు పౌరుషం ఉంది అని ధాన్యం అంటుంది. ఎవడికి పనికిరాని బోడి పౌరుషం దేనికి అని రుద్రాణి అంటుంది.
రంగులేసుకున్న కావ్యకు అధికారం ఇచ్చారు. అది ఇష్టమొచ్చినట్లు అడిగినవాళ్లు బెండు తీస్తుంది. ఇప్పుడు నీకు మరో బలమైన సపోర్ట్ కావాలి. మీ ఆయన. ఇప్పటివరకు వాళ్ల తరఫునే మాట్లాడాడు. ఇన్నాళ్లు నీది ఒంటరి పోరాటమే. ఇప్పుడు నీది జంట పోరాటమే కావాలి. అన్నయ్య ఆలోచన మారకముందే పూర్తిగా నీవైపు తిప్పుకో. ఆ తర్వాత అంతా నీవైపు తిరిగి నీకు కావాల్సిన న్యాయం చేస్తారు అని రుద్రాణి అంటుంది. నువ్ చెప్పింది చాలా బాగుంది. ఆయన్ను నా దారిలోకి తెచ్చుకుని ఒకే మాట, ఒకే బాటలా నడుస్తాం అని ధాన్యలక్ష్మీ అంటుంది.
తర్వాత సుభాష్‌తో కావ్య మాట్లాడుతుంది. థ్యాంక్స్ మావయ్య. నన్ను అర్థం చేసుకున్నందుకు. మా అమ్మ నాన్నే నన్ను అర్థం చేసుకుంటారు అనుకున్నాను. కానీ, మీరు కూడా అర్థం చేసుకున్నారు. ఇంట్లో జరిగేది నా చేతుల్లో లేదు. కానీ, జరిపించేది నేనే. అందరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. దాచుకోవడం, దోచుకోవడం అని నిందలు వేస్తున్నారు. మీరు మాత్రమే నా ప్రవర్తన వెనుక ఏదో బలమైన కారణం ఉందని నమ్మారు. ఒక మనిషిని ఇంతలా అర్థం చేసుకోవచ్చా అని ఆశ్చర్యపోవచ్చు అనుకున్నాను అని కావ్య అంటుంది.
కోపంలో కూడా గౌరవం ఉంది
నేను కూడా ఆశ్చర్యపోయాను నిన్ను చూసి. మాయ మాయలో పడినప్పుడు నువ్ ఒక్కదానివే అర్థం చేసుకున్నావ్. నన్ను కాపాడవని సాయం చేయట్లేదు. నా కోడలు ఏ తప్పు చేయదు. ఏదో ఒకరోజు అంతా తెలుసుకుని పశ్చాత్తాపంతో తలదించుకుంటారు అని సుభాష్ వెళ్లిపోతాడు. దాంతో కావ్య సంతోషంగా ఫీల్ అవుతుంది. మరోవైపు జరిగింది ఆలోచిస్తూ కావ్య చిరాకులో ఉంటుంది. ఇందిరాదేవి భోజనం తీసుకొస్తుంది. మీరెందుకు తీసుకొచ్చారు అని అపర్ణ అంటుంది.
పర్లేదు. కోపంలో కూడా గౌరవం ఉందన్నమాట అని ఇందిరాదేవి అంటే.. ఈ గొంతులో ప్రాణం ఉన్నంతవరకు మీ మీద, మావయ్య మీద గౌరవం ఉంటుంది అని అపర్ణ అంటుంది. అది నాకు తెలుసులే కూర్చో అని కావ్య మీద ఎందుకంత కోప్పడ్డావ్. చేయెత్తి కొట్టేంత కోపం ఎందుకు వచ్చిందని అడుగుతుంది. కట్టుకున్న భర్తను అంటే కోపం రాదా. స్వప్నలాంటి మనిషి అలా ప్రవర్తించింది అంటే అనుకోవచ్చు. కానీ కావ్య అంటే ఎలా తట్టుకోలేకపోయాను అని అపర్ణ అంటుంది.
అన్ని తెలిసినా కావ్య ఎందుకు అలా ప్రవర్తించిందో కారణం ఉంటుంది కదా అని ఇందిరాదేవి అంటుంది. కారణం ఉంటుంది. అది చెప్పొచ్చు కదా. చెబితే నేను అండగా ఉంటాను కదా అని అపర్ణ అంటుంది. అత్తకు కూడా చెప్పుకోలేని స్థితిలో ఉందేమో అని అపర్ణ అంటుంది. తండ్రిలాంటి మావయ్యను అంది అని అపర్ణ అంటుంది. తండ్రి అనే చొరవతోనే అనుంటుంది. సరైనా కారణం చెబితే క్షమిస్తావ్ కదా. ఒకప్పటి అపర్ణ కంటే ఇప్పటి అపర్ణ చాలా నయం. ఈ కోపంలో కూడా కావ్య మీద ప్రేమ కనపడుతుంది అని ఇందిరాదేవి అంటుంది.
కోడలికి అన్నం తినిపించిన అత్త
మా అత్తయ్యకు నేను అర్థం అవుతుంది. నా కోపం నా కోడలికి అర్థం కావట్లేదు అని అపర్ణ అంటుంది. సరే తిను అని ఇందిరాదేవి అంటే.. ఆకలిగా లేదని అపర్ణ అంటుంది. దాంతో కావ్యను చేయెత్తి కొట్టడానికి నువ్వెలా వెనుకాడావో నా కోడలి ఆకలి తీర్చడానికి నేను వెనకాడను. ఆకలి తీర్చడానికి అమ్మే కావాల ఏంటీ.. నోరు మూసుకుని పట్టు అని అపర్ణకు భోజనం తినిపిస్తుంది ఇందిరాదేవి. దాంతో అపర్ణ సంతోషంతో ఎమోషనల్ అవుతుంది. ఈ సీన్ చాలా ఎమోషనల్‌గా బాగుంటుంది.
మరుసటి రోజు ఆలోచిస్తున్న కావ్య దగ్గరికి వెళ్లి రాజ్ మాట్లాడుతాడు. మీరు నన్ను ప్రేమించకపోయినా నన్ను మాట పడనివ్వలేదు. మా పుట్టింటికి కూడా సపోర్ట్ చేశారు. మీ వ్యక్తిత్వం చాలా మంచిది. అచ్చం తాతయ్య గారిలాగే ఆలోచిస్తారు. అందుకే రాహుల్, రుద్రాణి నోరెత్తిమాట్లాడుతున్నారు అని కావ్య అంటుంది. మరి దేని గురించి ఆలోచిస్తున్నావ్ అని రాజ్ అంటాడు. ఆ నందగాడి గురించి ఆలోచిస్తున్నాను. వాన్ని చంపితే మనకు నష్టం. కానీ, వాన్ని చంపడం వల్ల ఎవరికీ లాభం అని కావ్య అంటుంది.
ఈ కోణంలో కూడా మనం ఆలోచించాలి. వాడు చచ్చిపోతే మనం వంద కోట్లు బ్యాంక్‌కు కట్టాలి. కానీ, వాడు బ్రతికుంటే ఎవరికీ నష్టం. చచ్చిపోవడం వల్ల ఎవరికీ నష్టం అని కావ్య అనుమానపడుతుంది. మనకు దొరకగానే వాడు చచ్చిపోయాడు. మనల్ని, వాడిని ఎవరైనా ఫాలో అవుతున్నారా. పోలీసుల దాకా వెళ్లకముందే ఎలా చంపేశారు అని రాజ్ అంటాడు. అవునండి దీని వెనుక ఎవరో ఉన్నారు అని కావ్య అంటుండగా.. అనామిక, సామంత్‌ను చూపిస్తారు.
భలే చెక్ పెట్టావ్
చెస్ ఆడుతుంటారు. ఆ నందగాడిని చంపేసి రాజ్‌కు భలే చెక్ పెట్టావ్ అని సామంత్ అంటాడు. ఇద్దరు ఒకరికొకరు చెక్ పెట్టుకుంటారు. ఫైనల్‌గా అనామిక చెక్ అంటే ఇది అని అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్