Godavari Pushkaralu in AP : గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు – 10 ముఖ్యమైన విషయాలు

Best Web Hosting Provider In India 2024

Godavari Pushkaralu in AP : గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు – 10 ముఖ్యమైన విషయాలు

Maheshwaram Mahendra HT Telugu Jan 25, 2025 08:03 AM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 25, 2025 08:03 AM IST

Godavari Pushkaralu 2027 Updates : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గోదావ‌రి పుష్కరాలకు ముహుర్తం ఖ‌రారైంది. దీంతో ఏపీ ప్రభుత్వం ముందస్తు కార్యాచ‌ర‌ణను సిద్ధం చేసే పనిలో పడింది. ఆ దిశగా కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. త్వరలోనే సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష చేయనున్నారు.

రాజమండ్రి వద్ద గోదావరి(ఫైల్ ఫొటో)
రాజమండ్రి వద్ద గోదావరి(ఫైల్ ఫొటో)
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. 2027 జులై 23 నుంచి ఆగ‌స్టు 3 వ‌ర‌కు  పుష్కరాల నిర్వహ‌ణ‌కు నిర్ణయించారు. ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి జరిగే పుష్కరాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లను మొదలు పెట్టింది. యాక్షన్ ప్లాన్ కు అనుగుణంగానే… ఏర్పాట్లు ఉండాలని భావిస్తోంది. 

yearly horoscope entry point

గోదావరి పుష్కరాలు 2027 – ముఖ్యమైన అంశాలు:

  1. ఈసారి గోదావరి పుష్కరాల నిర్వహణలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా.
  2. 2015 లో ఇదే గోదావరి పుష్కరాల ప్రారంభం వేళ చోటు చేసుకున్న ఘటనలు దృష్టిలో ఉంచుకొని అందరూ ఒకే ఘాట్‌లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు.
  3. గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి అధికార యంత్రాంగం రూ.904 కోట్లతో ప్రతిపాదలు సిద్దం చేసింది . కేంద్రం ముందస్తుగానే గోదావరి పుష్కరాల కోసం ఇప్పటికే రూ. 100 కోట్ల నిధులు కేటాయించింది.
  4. తాజాగా రైల్వే శాఖ పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యాల కల్పన కోసం రాజమండ్రి రైల్వే స్టేషన్ కు రూ 271.43 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.
  5. దేశంలో ప్రధాన ప్రాంతాల నుంచి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లు నడుపుతామని.. ముందస్తుగానే వాటి వివరాలు వెల్లడిస్తామమని అధికార యంత్రాంగం ప్రకటన చేసింది.
  6. అఖండ గోదావరి పుష్కరాలు-2027 ముసాయిదా యాక్షన్‌ ప్లాన్‌ కూడా సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లకు రోజుకు 75,11,616 మంది వస్తారని అంచనా వేస్తున్నారు.
  7. గోదావరి పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లపై ఇరిగేషన్, టూరిజం, దేవాదాయ శాఖల అధికారులు సంయుక్తంగా సమీక్షలు జరుపుతున్నారు. యాత్రికుల బస ఏర్పాట్లతోపాటు మరో నాలుగు కొత్త ఘాట్లు అవసరమని భావిస్తున్నారు.
  8. రాజమహేంద్రవరం పరిధిలో గోదావరి ఘాట్ల అభివృద్ధికి రూ.904 కోట్లతో బడ్జెట్‌ ప్రతిపాదించారు. కార్పొరేషన్‌ పరిధిలో రోడ్ల అభివృద్ధికి రూ.456.5 కోట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి రూ.678.76 కోట్లతో ప్రతిపాదనలు చేశారు.
  9. మొత్తంగా పుష్కర ఘాట్ల కోసం కావాల్సిన నిధుల పైన అధికార యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. నిధుల సమీకరణతో పాటుగా గోదావరి తీరప్రాంతంలో సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు.
  10. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో గోదావరి పుష్కరాల పైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కార్యాచరణ ఖరారు చేయనున్నారు.
Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

West GodavariEast GodavariAndhra Pradesh NewsGodavari FloodsChandrababu Naidu
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024