Best Web Hosting Provider In India 2024
Illu Illalu Pillalu Today Episode: ధీరజ్‌ను కత్తితో పొడిచిన రౌడీలు – ప్రేమకు టార్చర్- నర్మద డ్రామాకు పుల్‌స్టాప్
Illu Illalu Pillalu : ఇళ్లు ఇల్లాలు పిల్లలు జనవరి 25 ఎపిసోడ్‌లో ఫస్ట్ నైట్ రోజు తల నొప్పి పేరుతో నర్మద ఆడిన నాటకాన్ని బయటపెడతాడు సాగర్. నన్ను ఎందుకు దూరం పెడుతోన్నావో చెప్పాల్సిందేనని పట్టుపడతాడు. సంక్రాంతి వేడుకల్ని అడ్డం పెట్టుకొని ధీరజ్‌పై విశ్వ మనిషి ఎటాక్ చేస్తాడు.
Illu Illalu Pillalu Today Episode: ధీరజ్, ప్రేమ లవ్ మ్యారేజ్ చేసుకున్నారని వారి స్నేహితులు అపోహపడతారు. ఇద్దరి చేత రొమాంటిక్ ఫొటో షూట్ ప్లాన్ చేస్తారు. ఫ్రెండ్స్ ముందు తమ నాటకం బయటపడకుండా క్లోజ్‌గా ఉన్నట్లు యాక్ట్ చేస్తారు ధీరజ్, ప్రేమ. కానీ నటన తమ వల్ల కాకపోవడంతో ఒకరి నొకరు ఛీ కొట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోతారు. వారి రియాక్షన్ చూసి స్నేహితులు షాకవుతారు. పైకి ద్వేషించుకుంటున్న ధీరజ్, ప్రేమ మనసులో ఒకరి పట్ల మరొకరికి అంతులేని ప్రేమ ఉందని స్నేహితులను ఆలోచనల్ని డైవర్ట్ చేస్తాడు తిరుపతి.
సాగర్ ప్రశ్నలు…
ఫస్ట్‌నైట్ రోజు తలనొప్పి అని నర్మద ఆడిన డ్రామాను బయటపెడతాడు సాగర్. ఫస్ట్ నైట్ రోజు నిజంగా నీకు తలనొప్పి వచ్చిందా? నేను ఇచ్చిన ట్యాబ్లెట్ వేసుకోకుండా నువ్వు పారేయడం నేను చూశానని నర్మదతో అంటాడు. దగ్గరకు వచ్చిన ప్రతిసారి నువ్వు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావని నిలదీస్తాడు. నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నానో…బలవంతంగా నీ మెడలో తాళి కట్టానో అర్థం కావడం లేదని ఆవేదనకు లోనవుతాడు.
అపరిచితుల్లా…
మనం అసలు భార్యభర్తల్లా ఉంటున్నామా? ఒకే గదిలో ముక్కుమొహం తెలియని అపరిచితుల్లా బతకాల్సివస్తుందని నర్మదతో ముందు తన మనసులోఉన్న బాధను బయటపెడతాడు. నీకు నేనంటే ఇష్టం లేదని అనిపిస్తుందని, ఆ బాధను భరించడం తన వల్ల కాదని నర్మదతో సాగర్ చెబుతాడు. నన్ను దూరం పెట్టడానికి వెనకున్న కారణం ఏదో ముందే చెబితే మనం అసలు పెళ్లి చేసుకొని ఉండేవాళ్లం కాదు కదా అని సాగర్ అంటాడు.
నిజం చెప్పిన నర్మద…
సాగర్ మాటలతో నర్మద ఎమోషనల్ అవుతుంది. నీ కోసం నేను నా కన్నవాళ్లను వదిలేసుకొని వచ్చాను. ఈ లోకంలో నాకు అందరికంటే నువ్వే…నీ ప్రేమే నాకు ముఖ్యమని భర్తతో అంటుంది నర్మద. నువ్వంటే అంత ఇష్టం, అంత ప్రేమ అని చెబుతుంది. నీకు దూరంగా ఉండటానికి కారణం ఉందని, అది నీకు చెప్పకూడదని ఇన్నాళ్లు అనుకున్నానని నర్మద అంటుంది. చందు పెళ్లి గురించి రామరాజు పడిన బాధ గురించి, ఆయన అన్న మాటలను సాగర్‌తో చెబుతుంది నర్మద. మావయ్య పడిన బాధలో అర్థం ఉందని, చందు పెళ్లి కాకముందే…మనం పిల్లల్ని కనడం కరెక్ట్ కాదని నిన్ను దూరం పెట్టానని అసలు నిజం చెబుతుంది నర్మద.
నా భార్య బంగారం…
నర్మద చెప్పిన కారణం వినగానే సాగర్ ఎమోషనల్ అవుతాడు. నర్మదను కౌగిలించుకున్నాడు. నేను మా అన్నయ్య గురించి ఆలోచించలేకపోయాను. మా కుటుంబాన్ని అర్థం చేసుకోలేకపోయాను. నీలాంటి ఆలోచించి అర్థం చేసుకునే భార్య దొరకడం నా అదృష్టం అని నర్మదకు క్షమాపణలు చెబుతాడు సాగర్. మా అవిడ బంగారం అని మురిసిపోతాడు.
రౌడీ ఎటాక్…
గుడి బయట ధీరజ్ ఫోన్ మాట్లాడుతుంటాడు. విశ్వ నియమించిన రౌడీ అతడిపై ఎటాక్ చేయడానికి వస్తాడు. ఆ రౌడీని బొమ్మలు అమ్మేవాడిగా పొరపాడిన రామరాజు అతడిని పిలుస్తాడు. తండ్రి తననే పిలిచాడని సంబరపడిపోతాడు ధీరజ్. ఆనందంగా తండ్రి దగ్గరకు వస్తాడు. మీరు నాతో మాట్లాడారా? ఏం కావాలి నాన్న అని రామరాజును అడుగుతాడు. ధీరజ్‌తో రామరాజు మాట్లాడడు. రౌడీ చేతిలో కత్తి కనిపించడంతో రామరాజు అనుమాపడతాడు. ఆ కత్తి నీ దగ్గర ఎందుకు ఉంది? ఎవరు నువ్వు అని అడుగుతాడు. రామరాజు ప్రశ్నలకు ఆ రౌడీ తడబడతాడు. మరో రౌడీ వచ్చి దొరికిపోకుండా కవర్ చేస్తాడు.
ఉష డిమాండ్…
సంక్రాంతి సంబరాల్లో భాగంగా భార్యభర్తలకు పోటీపెడతారు. భార్యను భర్త వీపుపై మోసుకుంటూ వెళ్లాలని గేమ్ ఆడిస్తారు. ఈగేమ్‌లో సాగర్ – నర్మద, ధీరజ్ – ప్రేమ పోటీ పడాలని ఉష కండీషన్ పెడుతుంది. లేదంటే ఆడపడుచు కట్నం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. తాము పోటీపడేది లేదని ధీరజ్, ప్రేమ అంటారు. మేము ఆడేది లేదని ధీరజ్, ప్రేమ అంటారు. ఆడపడుచు కట్నం ఏమిటని ఏం తెలియనట్లుగా ప్రేమ అడుగుతుంది. ఆమెపై ఉష సెటైర్లు వేస్తుంది.
ప్రేమించే పెళ్లి చేసుకున్నారా?
ఉష ఎంత చెప్పిన ధీరజ్, ప్రేమ మాత్రం ఈ గేమ్ ఆడేది లేదని పట్టుపడతారు.
వారిద్దరు ఎడమొహం, పెడమొహం పెట్టడం చూసి మీరిద్దరు నిజంగా ప్రేమించే పెళ్లిచేసుకున్నారా అని ఉష అనుమానంగా అడుగుతుంది. ఆమె మాటలతో వేదావతి షాకవుతుంది. నిజం బయటపడితే ప్రమాదమని వారిని గేమ్ ఆడటానికి ఒప్పిస్తుంది.
ప్రేమ టార్చర్…
ప్రేమను తన వీపుపై ఎత్తుకోవడానికి ధీరజ్ ఇష్టపడడు. ప్రేమ కూడా ఎంట్రా నాకు ఈ టార్చర్ అని అంటుంది. సేమ్ ఫీలింగ్ నేను ఎవడికి చెప్పుకోవాలని సాగర్ అంటాడు.మీ ఫ్యామిలీలో నువ్వే అనుకున్నాను అందరు తేడాగానే ఉన్నారని ప్రేమ సెటైర్లు వేస్తుంది. మీ ఫ్యామిలీ ఏం తక్కువ కాదని, ఇరిటేషన్‌కు టార్చర్‌కు ఇంటిపేరు మీరు అని బదులిస్తాడు. నిన్ను పెళ్లి చేసుకోవడం ఏ జన్మలో చేసిన పాపమో ఇదని అంటాడు. ధీరజ్, ప్రేమ కలిసి గేమ్ ఆడటం భద్రావతి చూసి సహించలేకపోతుంది.
ప్రభల పోటీలు…
ప్రేమను ఎత్తుకున్న సాగర్ ఇంత బరువు ఉన్నావేంటి? మీ ఇంట్లో వండిన తిండి ఇన్నాళ్లు నువ్వు ఒక్కదానివే తిన్నావా అని ప్రేమను ఏడిపిస్తాడు సాగర్. ప్రభల పోటీలు మొదలవుతాడు. తన కొడుకులతో కలిసి రామరాజు ఈ పోటీలో పాల్గొంటాడు. ఈ పోటీల్లో పాల్గొన్న ధీరజ్‌ను విశ్వ మనిషి కత్తితో పొడుస్తాడు. నాన్న అని అరుస్తూ ధీరజ్ కుప్పకూలిపోతాడు. అక్కడితో నేటి ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ముగిసింది.