Best Web Hosting Provider In India 2024
Mystery Crime Thriller OTT: ఈ ఓటీటీలోకే నయా మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం.. ఊహలకు అందని ట్విస్టులతో సాగే సినిమా!
Mystery Crime Thriller OTT: రేఖాచిత్రం సినిమా పాజిటివ్ టాక్‍ను దక్కించుకుంది. ఈ చిత్రం సూపర్ హిట్‍గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులపై వివరాలు బయటికి వచ్చాయి.
2025లో మలయాళ ఇండస్ట్రీ తొలి బ్లాక్‍బస్టర్‌గా దుమ్మురేపుతోంది ‘రేఖా చిత్రం’ సినిమా. ఈ తక్కువ బడ్జెట్ చిత్రం ఇప్పటికే రూ.50కోట్ల కలెక్షన్ల మార్క్ దాటింది. ఆసిఫ్ అలీ హీరోగా నటించిన ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి క్యామియో రోల్ చేశారు. ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి జోఫిన్ టీ చాకో దర్శకత్వం వహించారు.
జనవరి 9న థియేటర్లలో రిలీజైన రేఖాచిత్రం సినిమా పాజిటివ్ టాక్‍తో అదరగొడుతోంది. ఇంకా థియేట్రికల్ రన్ జోరుగా సాగుతోంది. ఈ సినిమా ఓటీటీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల వివరాలు తాజాగా వెల్లడయ్యాయి.
ఓటీటీ హక్కుల ఈ ప్లాట్‍ఫామ్‍కే!
రేఖాచిత్రం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ సొంతం చేసుకుందని సమాచారం బయటికి వచ్చింది. ఈ సినిమా హక్కులను మంచి ధర దక్కిందని తెలుస్తోంది. సోనీ లివ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సాధారణంగా మలయాళ సినిమాలను ఇతర భాషల డబ్బింగ్‍లోనూ సోనీ లివ్ తీసుకొస్తుంటుంది. దీంతో రేఖాచిత్రం సినిమాను కూడా ఆ ప్లాట్‍ఫామ్ తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు తెచ్చే ఛాన్స్ ఉండొచ్చు. ఈ చిత్రం ఫిబ్రవరిలో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
రేఖాచిత్రం సినిమాలో ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ లీడ్ రోల్స్ చేశారు. మనోజ్ కే జయన్, సిద్ధిఖీ, జగదీశ్, సాయికుమార్, హరిశ్రీ అశోకన్ కీలకపాత్రలు పోషించారు. సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి స్పెషల్ పాత్ర చేశారు. ఈ క్యారెక్టర్ కోసం ఆర్టిఫిషియయల్ ఇంటెలిజెన్స్‌ను కూడా మేకర్స్ వినియోగించారు.
ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా రేఖాచిత్రం మూవీని తెరకెక్కించారు జోఫిన్. ప్రస్తుతం కాలంతో పాటు 1985ల బ్యాక్‍డ్రాప్ కూడా కథలో ఉంటుంది. ట్విస్టులతో సాగే కథనంతో మెప్పించారు. ఈ సినిమాను కావ్య ఫిల్మ్ కార్పొరేషన్, అన్ మెగా మీడియా పతాకాలపై వేణు కున్నప్పిలి ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు.
కలెక్షన్లు ఇలా..
రేఖాచిత్రం సినిమా సుమారు రూ.6కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఇప్పటికే ఈ చిత్రం రూ.50కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ అధిగమించింది. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ అయింది. ఈ చిత్రానికి ఇంకా థియేట్రికల్ కంటిన్యూ అవుతోంది.
రేఖాచిత్రం స్టోరీలైన్
ఓ ఆత్మహత్య కేసును సీఐ వివేక్ గోపీనాథ్ (ఆసిఫ్ అలీ) చేపడతాడు. 40 ఏళ్ల క్రితం జరిగిన ఓ నేరంతో చనిపోయిన వ్యక్తికి లింక్ ఉంటుంది. 1985లో ఓ సినిమా షూటింగ్ లొకేషన్ నుంచి ఓ బాలిక మిస్ అయిన కేసును కూడా వివేక్ ఇప్పుడు దర్యాప్తు చేస్తాడు. ఈ క్రమంలో చాలా ట్విస్టులు ఎదురవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? రెండు కేసులకు లింక్ ఏంటి? వివేక్ దర్యాప్తు ఎలా సక్సెస్ చేశాడు? అనే అంశాల చుట్టూ రేఖాచిత్రం స్టోరీ సాగుతుంది.
సంబంధిత కథనం