Best Web Hosting Provider In India 2024
Padma Awards : దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్, బాలకృష్ణకు పద్మ భూషణ్-పద్మ అవార్డుల పొందిన తెలుగు వాళ్లు వీరే
Padma Awards : తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురికి పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. సినీ నటుడు నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ , మందకృష్ణ మాదిగకు పద్మ శ్రీ, దువ్వూరు నాగేశ్వరర్ రెడ్డికి పద్మ విభూషణ్ పురష్కారాలు వరించాయి.
Padma Awards : గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. దేశవ్యాప్తంగా 139 మందిని పద్మ అవార్డులు వరించాయి. వీరిలో ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురికి పద్మ అవార్డులు దక్కాయి.
పద్మ శ్రీ అవార్డులు
- మందకృష్ణ మాదిగ(ప్రజా వ్యవహారాలు)-తెలంగాణ
- కేఎల్ కృష్ణ(సాహిత్యం)-ఏపీ
- మాడుగుల నాగఫణి శర్మ(కళలు)-ఏపీ
- మిర్యాల అప్పారావు(కళలు)-ఏపీ
- వద్దిరాజు రాఘవేంద్రాచార్య(సాహిత్యం)-ఏపీ
పద్మ భూషణ్
- నందమూరి బాలకృష్ణ(కళలు)- ఏపీ
పద్మ విభూషణ్
- దువ్వూరు నాగేశ్వరర్ రెడ్డి(వైద్యం) – తెలంగాణ
సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు కేంద్రం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. ఏపీ నుంచి కళల విభాగంలో బాలకృష్ణను పద్మ భూషణ్ అవార్డుకు ఎంపిక చేసింది. బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు దక్కడంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
“పద్మభూషణ్ అవార్డు అందుకున్న తెలుగు సినిమా దిగ్గజం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు హృదయపూర్వక అభినందనలు. మీరు ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ, సినిమా, రాజకీయాలు, దాతృత్వ రంగాలలో రాణించారు. ప్రజా సంక్షేమానికి, ముఖ్యంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా మీరు చేసిన సేవ లెక్కలేనన్ని జీవితాలను తాకింది. లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చింది. నిజమైన ఐకాన్, నాయకుడికి ఇది తగిన గౌరవం” అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
టాపిక్