Best Web Hosting Provider In India 2024
Liquor Non Veg Shops Close : రేపు తెలుగు రాష్ట్రాల్లో మద్యం, మాంసం దుకాణాలు బంద్-హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
Liquor Non Veg Shops Close : రిపబ్లిక్ డే కారణంగా రేపు(ఆదివారం) తెలుగు రాష్ట్రాల్లో మద్యం షాపులు బంద్ కానున్నాయి. శనివారం రాత్రి నుంచే షాపులు క్లోజ్ అవుతాయి. రేపు కబేళాకు సెలవు ఇచ్చారు. మద్యం షాపులు క్లోజ్ అని తెలుసుకున్న మందుబాబులు లిక్కర్ కోసం షాపుల ముందు క్యూకట్టారు.
Liquor Non Veg Shops Close : గణతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు(జనవరి 26) తెలుగు రాష్ట్రాల్లో మద్యం, మాంసం దుకాణాలు మూతపడనున్నాయి. నేటి రాత్రి నుంచే జంతువులను వధించడం బంద్ చేయనున్నారు. హైదరాబాద్ లోని చికెన్, మటన్, చేపల మార్కెట్లు మూసివేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు ఆదేశించారు.
ఈ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేస్తారు. శనివారం రాత్రి నుంచే మద్యం షాపులు బంద్ కానున్నాయి. ఇప్పటికే మద్యం షాపుల ముందు బోర్డులు ఏర్పాటుచేశారు. దీంతో మందుబాబులు వైన్స్ షాపులకు క్యూ కట్టారు. రేపు బార్లు, పబ్బులు కూడా మూసివేస్తారు.
విజయవాడలో మటన్, చికెన్ షాపులు బంద్
రిపబ్లిక్ డే పురస్కరించుకుని ఏపీలో మద్యం షాపులు బంద్ కానున్నాయి. విజయవాడ పరిధిలో మద్యం షాపులతో పాటు మటన్, చికెన్ షాపులు కూడా మూసివేయాలని మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆదివారం నగరంలోని ఉన్న కబేళాకు సెలవు ప్రకటించారు.
శనివారం రాత్రి నుంచి కబేళాలో ఎటువంటి జంతువులను వధించడానికి అనుమతి లేదని పేర్కొన్నారు. నగరంలో ఉన్న అన్ని చికెన్ షాపులు, మటన్ షాపులు, చేపల మార్కెట్లు మూసివేయాలని ఆదేశించారు. ఎవరైనా అనుమతి లేకుండా జీవాలను వధిస్తే లేదా షాపులను తెరిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని విజయవాడ మున్సిపల్ కమిషనర్ తెలిపారు. మటన్, చికెన్, చేపలు హోల్ సేల్, రిటైల్ వ్యాపారస్తులు అన్ని షాపులు మూసివేయాసని నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో రేపు(ఆదివారం) ట్రాఫిక్ అంక్షలు విధించారు. సిక్రింద్రాబాద్ పరేడ్ గ్రాండ్స్‌లో రిపబ్లిక్ డే, రాజ్ భవన్ ఎట్ హోం కార్యక్రమాల కారణంగా నగరంలో ట్రాఫిక్ అంక్షలు విధించారు. జనవరి 26వ తేదీ ఉదయం 7.30 గంటల నుంచి 11.30 వరకు సిక్రింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు రాజ్ భవన్ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ అంక్షలు విధించారు.
పంజాగుట్ట, గ్రీన్‌ల్యాండ్స్, బేగంపేట్, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ రూట్ లో వచ్చే వాహనాదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలు టివోలీ ఎక్స్ రోడ్స్, ప్లాజా ఎక్స్ రోడ్స్ మార్గాలను మూసివేయనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు కాస్త ముందుగా బయల్దేరి రైల్వేస్టేషన్‌కు చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
టాపిక్