Best Web Hosting Provider In India 2024
జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
తాడేపల్లి:వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి అంబటి రాంబాబు జాతీయ జెండాను ఆవిష్కరించి, రాష్ట్ర ప్రజలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతిపిత మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, నేతాజి సుభాష్ చంద్రబోస్, డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాలకు వైయస్ఆర్‌సీపీ నేతలు నివాళులర్పించారు.
పేదరికం లేని సమాజం కోసం కృషి చేద్దాం:
అందరూ సమానంగా ఎదగాలనే దృక్పదంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. పేదరికం లేని సమాజం కోసం మనమంతా కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. మనల్ని మనం పరిపాలించుకుంటూ ఎంతో పురోభివృద్దిలోకి వెళుతున్నామని చెప్పారు. బ్రిటీష్ పాలకుల నుంచి విముక్తి కోసం బానిస సంకెళ్ళు తెంచుకుని పరిపాలించుకోవాలని అనేక మంది పోరాటాలు చేశారు. మనల్ని మనం పరిపాలించుకునే సర్వసత్తాక ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకున్నామని తెలిపారు. అందరూ సమానంగా ఎదగాలనే దృక్పదంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలను వైయస్ జగన్ ప్రభుత్వ పాలనలో చూశామని పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో అగ్రరాజ్యంగా ఎదగాలనే మన ప్రయత్నం కొనసాగించాలి, పేదరికాన్ని పారద్రోలి స్వతంత్ర భారతాన్ని నిర్మించుకోవడానికి మనమంతా కృషిచేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రజలకు విజ్క్షప్తి చేశారు. ఈ వేడుకల్లో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు అంకంరెడ్డి నారాయణమూర్తి, మస్తాన్ వలీ, ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి, సోషల్ మీడియా వింగ్ ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, విద్యార్ధి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, పార్టీ కురుబ విభాగం అధ్యక్షుడు గడ్డం రామక్రిష్ణ, బోయ విభాగం అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, పలువురు నాయకులు పాల్గొన్నారు.