Best Web Hosting Provider In India 2024
Warangal Road Accident : మామునూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – లారీలో నుంచి తెగిపడిన ఐరన్ రాడ్లు, నలుగురు మృతి
Road accident at Mamnoor : వరంగల్ శివారు ప్రాంతమైన మామునూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీలో నుంచి ఐరన్ రాడ్లు తెగి ఆటోపై పడిన ఘటన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఘోర ప్రమాదం
మామునూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై భారీ ఐరన్ మెటీరియల్ లోడ్ తో వెళ్తున్న లారీ తాడు తెగిపోవడంతో ఘటన జరిగింది. పక్కనే ఉన్న ఆటోపై ఐరన్ రాడ్లు పడిపోవడంతో ఆటో నజ్జునుజ్జు అయింది. ఇందులో నలుగురు అక్కడకిక్కడే మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న మామునూరు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
టాపిక్
Road AccidentWarangalTelangana News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.