సైఫ్​ అలీ ఖాన్​పై దాడి కేసులో బిగ్​ ట్విస్ట్​! ‘ఫింగర్​ప్రింట్స్​’ మ్యాచ్​ అవ్వడం లేదు..

Best Web Hosting Provider In India 2024


సైఫ్​ అలీ ఖాన్​పై దాడి కేసులో బిగ్​ ట్విస్ట్​! ‘ఫింగర్​ప్రింట్స్​’ మ్యాచ్​ అవ్వడం లేదు..

Sharath Chitturi HT Telugu
Jan 26, 2025 01:25 PM IST

Saif Ali Khan attack case : సైఫ్​ అలీ ఖాన్​పై దాడి కేసులో బిగ్​ ట్విస్ట్​! నిందితుడి ఫింగర్​ప్రింట్స్​, క్రైమ్​ సీన్​తో మ్యాచ్​ అవ్వడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు నేరస్థుడిని వదిలేసి, వేరెవరినో పట్టుకున్నారా? అని సందేహలు వ్యక్తమవుతున్నాయి.

సైఫ్​ అలీ ఖాన్​పై దాడి కేసులో బిగ్​ ట్విస్ట్​!
సైఫ్​ అలీ ఖాన్​పై దాడి కేసులో బిగ్​ ట్విస్ట్​!

బాలీవుడ్​ నటుడు సైఫ్​ అలీ ఖాన్​పై దాడి కేసులో బిగ్​ ట్విస్ట్​! నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి వేలిముద్ర నమూనాలు.. క్రైమ్​ సీన్​ నుంచి సేకరించిన ఫింగర్​ప్రింట్​ శాంపిల్స్​తో మ్యాచ్​ అవ్వడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసలు నేరస్థుడిని వదిలేసి, ముంబై పోలీసులు మరొకరిని పట్టుకున్నారా? అని సందేహాలు వెలువడుతున్నాయి.

yearly horoscope entry point

ఏం జరిగింది..?

సైఫ్​ అలీ ఖాన్​పై దాడి కేసు నిందితుడు ​ షరీఫుల్ ఇస్లాం షెహజాద్ వేలిముద్ర నమూనాలపై రాష్ట్ర నేర దర్యాప్తు విభాగం (సీఐడీ) నెగిటివ్ రిపోర్టులు సమర్పించిందని మిడ్ డే ప్రత్యేక నివేదిక పేర్కొంది. ఘటనాస్థలం నుంచి సేకరించిన మొత్తం 19 వేలిముద్రల సాంపిల్స్​ – నిందితుడి వేలిముద్రలతో సరిపోలడం లేదని వివరించింది.

షెహజాద్ పది వేళ్ల నుంచి ప్రింట్లను.. సీఐడీ ఫింగర్ ప్రింట్ బ్యూరోకు పంపించారు. 19 క్రైమ్ సీన్ ఫింగర్ ప్రింట్లలో ఏ ఒక్కటి కూడా నిందితుడి వేలిముద్రలతో సరిపోలలేదని సిస్టమ్ జనరేటెడ్ రిపోర్టు ద్వారా సీఐడీ ధృవీకరించింది! ఈ నివేదికను పుణెలోని సీఐడీ సూపరింటెండెంట్​కు శుక్రవారం పంపించినట్టు నివేదిక పేర్కొంది.

జనవరి 16న ఖాన్ (54)పై కత్తితో దాడి చేసిన కేసులో.. జనవరి 19న మహారాష్ట్రలోని థానేలో మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్​ని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.

షెహజాద్ కంటే ముందు ముంబై పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే ఈ కేసుతో అతనికి ఎలాంటి సంబంధం లేదని పోలీసుల విచారణలో తేలింది.

ఛత్తీస్​గఢ్​కు చెందిన మరో అనుమానితుడు ఆకాశ్ కనోజియా (32-33)ను కూడా ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జ్ఞానేశ్వరి ఎక్స్​ప్రెస్ రైలులో ప్రయాణిస్తుండగా ఛత్తీస్​గఢ్​లోని దుర్గ్​లో రాయ్​పూర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్​పీఎఫ్ ) అధికారులు పట్టుకుని ముంబై పోలీసులకు అప్పగించారు.

ఎవరు ఈ షెహజాద్​..?

ఆ తర్వాత థానేలో షెహజాద్​ని పట్టుకున్నారు. విచారణ అనంతరం నిందితుడిని అరెస్ట్​ చేసి, కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం నిందితుడు షెహజాద్​ రిమాండ్​లో ఉన్నాడు.

అయితే షెహజాద్​ బంగ్లాదేశీ అని, ఇండియాలో అక్రమంగా నివాసముంటున్నాడని పోలీసులు తెలిపారు.

“బంగ్లాదేశ్​ నుంచి అక్రమంగా ప్రవేశించిన తర్వాత విజయ్ దాస్ అనే పేరును నిందితుడు వాడుకుంటున్నాడు. ఐదారు నెలల క్రితం ముంబైకి వచ్చాడు. కొన్ని రోజులు ముంబైలో, ఆ తర్వాత ముంబై పరిసర ప్రాంతాల్లో బస చేశాడు. నిందితుడు హౌస్ కీపింగ్ ఏజెన్సీలో సైతం పనిచేశాడు,” అని అధికారులు తెలిపారు.

షెహజాద్​ వయస్సు 30 ఏళ్లని, దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే నటుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించాడని జోన్ 9 డీసీపీ దీక్షిత్ గెడం తెలిపారు.

అయితే, సైఫ్​ అలీ ఖాన్​ నివాసంలోని సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన వ్యక్తికి, అరెస్టయిన నిందితుడికి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో కథనాలు హల్​చల్ చేస్తున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link